మౌంట్‌బాటన్

బ్రిటిష్ రాజనీతి మరియు నావికా అధికారి
(మౌంట్ బాటన్ నుండి దారిమార్పు చెందింది)

మౌంట్‌బాటన్ లేదా లార్డ్ మౌంట్‌బాటన్ ఒక బ్రిటీష్ నౌకా సేనాని. ఇతడు బ్రిటీష్ పరిపాలనలోని భారతదేశపు చిట్టచివరి వైస్రాయ్ గానూ (1947), స్వత్రంత్ర్య భారత మొదటి గవర్నర్ జనరల్ గా (1947–48) వ్యవహరించాడు.

అడ్మిరల్ ఆఫ్ ది ఫీట్
ద రైట్ ఆనరబుల్
 ద ఎర్ల్ మౌంట్‌బాటన్ ఆఫ్ బర్మా
The Earl Mountbatten of Burma
 KG GCB OM GCSI GCIE GCVO DSO PC FRS
మౌంట్‌బాటన్


పదవీ కాలం
15 ఆగస్టు 1947 – 21 జూన్ 1948
ప్రధాన మంత్రి జవాహర్ లాల్ నెహ్రూ
చక్రవర్తి జార్జి VI
ముందు ఇతడే (భారత వైస్రాయ్)
తరువాత చక్రవర్తి రాజగోపాలాచారి

పదవీ కాలం
12 ఫిబవరి 1947 – 15 ఆగస్టు 1947
చక్రవర్తి జార్జి VI
ముందు ద విస్కౌంట్ వావెల్
తరువాత ఇతడే(భారత గవర్నర్ జనరల్)
ముహమ్మద్ అలీ జిన్నా (పాకిస్తాన్ గవర్నర్ జనరల్)

వ్యక్తిగత వివరాలు

జననం (1900-06-25)1900 జూన్ 25
విండ్సర్, యునైటెడ్ కింగ్‌డమ్
మరణం 1979 ఆగస్టు 27(1979-08-27) (వయసు 79)
ముల్లగ్ మోరె, ఐర్లాండ్
జీవిత భాగస్వామి ఎడ్విన ఆష్లే
సంతానం పట్రీషియా కనచ్‌బుల్
లేడీ పమేలా హిక్స్
పూర్వ విద్యార్థి క్రైస్ట్ కళాశాల, కేంబ్రిడ్జ్
వృత్తి నావికాదళ సేనాని
మతం అంగ్లికానిజమ్
పురస్కారాలు m:en:Knight of the Garter
m:en:Knight Grand Cross of the Order of the Bath
m:en:Member of the Order of Merit
m:en:Knight Grand Commander of the Order of the Star of India
m:en:Knight Grand Commander of the Order of the Indian Empire
m:en:Knight Grand Cross of the Royal Victorian Order
m:en:Distinguished Service Order
m:en:Mentioned in Despatches

నేపధ్యము

మార్చు

1900 జూన్ 25 వ సంవత్సరంలో జన్మించాడు. జన్మనామము ప్రిన్స్ లూయిస్ ఆఫ్ బాటెన్‌బర్గ్. ఇతను ఎడిన్‌బర్గ్ రాకుమారుడు ప్రిన్స్ ఫిలిప్కు స్వయానా బాబాయి, ఎలిజబెత్ 2 మహారాణికి దాయాది. ఇతను రెండవ ప్రపంచ యుద్ధంలో సౌత్ ఈస్ట్ ఏషియా కమాండ్ యొక్క సర్వ సేనాధిపతిగా వ్యవహరించాడు (1943–46).

బాల్యము

మార్చు
 
మౌంట్‌బాటన్ కుటుంబచిత్రం- రాకుమారి విక్టోరియా ఆఫ్ హెస్సే, రైన్, రాకుమారి లూయిస్ ఆఫ్ బాటెన్‌అర్గ్, వారి నలుగురు పిల్లలు రాకుమారి అలైస్, రాకుమారి లూయిస్, రాకుమారుడు జార్జ్, రాకుమారుడు లూయిస్

పుట్టినప్పటి నుండి 1917 వరకు బ్రిటీష్ రాజకుటుంబం లోని మిగిలిన వారివలె జన్మతహ సంక్రమించిన జర్మన్ రాచరిక ఆనవాళ్ళు వదులుకున్నారు. అప్పుడు మౌంట్‌బాటన్ కూడా ప్రిన్స్ లూయిస్ ఆఫ్ బాటెన్‌బర్గ్ గా పిలవబడేవాడు. ఇతని తల్లిదండ్రులు రాకుమారుడు లూయిస్ ఆఫ్ బాటెన్‌బర్గ్, రాకుమారి విక్టోరియా ఆఫ్ హెస్సె , రైన్కు ఇతని చివరి సంతానము.

1979 లో ఇతడు, ఇతని మనవడు నికొలస్, మరి ఇద్దరు కలిసి ఐర్లాండ్ లోని షాడీ వి ప్రాంతంలోని ముల్లఘ్‌మోర్, కంట్రీ స్లిగో ప్రాంతంలో చేపల పడవలో విహరిస్తుండగా తన పడవలో ప్రొవిజనల్ ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ (IRA) అమర్చిన బాంబు పేలిపోవడంతో దుర్మరణం చెందారు.

మూలాలు

మార్చు

బయటి లంకెలు

మార్చు