యస్.బి.పి.బి.కె. సత్యనారాయణ రావు

రాజకీయ నాయకుడు

శ్రీ బలుసు ప్రభాకర బుచ్చి కృష్ణ సత్యనారాయణ రావు (1921 - 2011) భారతదేశంలో కేంధ్ర మంత్రిగా, ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా, తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసారు, పారిశ్రామిక వేత్తగా, కపిలేశ్వర పురం జమిందారుగా సుప్రసిద్దులు.[1]

S. B. P. B. K. సత్యనారాయణ రావు
జననంబలుసు ప్రభాకర బుచ్చి కృష్ణ సత్యనారాయణ రావు
1921 సెప్టెంబరు 23
తూర్పుగోదావరి జిల్లాలోని కపిలేశ్వరపురం గ్రామం
మరణం2011 జనవరి 21
ప్రసిద్ధికపిలేశ్వరపురం జమిందారు
పదవి పేరు13వ లోక్‌సభ సభ్యులు, కేంద్ర మంత్రి
పదవీ కాలం1999 -2001
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
మతంహిందువు
భార్య / భర్తశ్రీమతి యస్.బి.రాజ రాజేశ్వరమ్మ
తల్లిదండ్రులురావుబహద్దూర్ శ్రీ బలుసు బుచ్చి సర్వారాయుడు (రెండోవ) , లక్ష్మీ వెంకట సుబ్బమ్మ

జననం, విద్య

మార్చు

సత్యనారాయణ రావు గారు తూర్పుగోదావరి జిల్లాలోని కపిలేశ్వరపురం గ్రామంలో రావుబహద్దూర్ శ్రీ బలుసు బుచ్చి సర్వారాయుడు (రెండోవ), లక్ష్మీ వెంకట సుబ్బమ్మ దంపతులకు 1921 సెప్టెంబరు 23 న జన్మించారు.[2] వీరిది కపిలేశ్వరపురం జమీ జమిందారి వంశం. సత్యనారాయణ రావు మద్రాసు ప్రసెడెన్సీ కాలేజీ నుండి బి.ఏ. డిగ్రీ చదివారు. వీరి వివాహం 1941లో శ్రీమతి యస్.బి.రాజ రాజేశ్వరమ్మ గారితో జరిగింది. వీరి సోదరుడు శ్రీ బలుసు ప్రభాకర పట్టాభిరామారావు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాసన సభ్యునిగా, మంత్రిగా పనిచేసారు. ఐదవ, ఆరవ, ఏడోవ లోక్‌సభలలో సభ్యునిగా పనిచేసారు.

రాజకీయ జీవితం

మార్చు

యస్.బి.పి.బి.కె. సత్యనారాయణ రావు గారు గ్రామ సర్పంచ్ గా 1953 నుండి 1964 వరకు, పంచాయితి సమితి ప్రసెడెంట్ గా 1959 నుండి 1964 వరకు పనిచేసారు. 1964 నుండి 1976 వరకు తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసారు[3]. ఉత్తర కోస్తా జిల్లాల లోని పట్టబద్రుల నియోజక వర్గం నుండి శాసమండలికి 1958లోనూ, 1980 లోనూ ఏన్నికైనారు.[4] 1977 లో జనతా పార్టీలో చేరి ఆతరువాత యన్.టి రామారావు స్ఫూర్తితో తెలుగుదేశం లో చేరారు.

1999 లో రాజమండ్రి నియోజకవర్గం నుండి 13వ లోక్‌సభకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఏన్నికైనారు.1999 నుండి 2001 వరకు అటల్ బిహారి వాజపేయి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ సహాయమంత్రిగా పనిచేసారు[4].

విద్యా, సాహిత్య, సంస్కృతిక సేవ

మార్చు

సత్యనారాయణ రావు గారు పెద్దాపురంలో 1967 లో SRVBSJB మహారాణి కళాశాలను స్థాపించారు. తన తండ్రి గారి పేరుతో శ్రీ సర్వారాయ హరికథ పాఠశాలను, వేద పాఠశాలను కపిలేశ్వరపురంలో పెట్టారు. 1991లో శ్రీ సర్వారాయ ధార్మిక ట్రస్టును స్థాపించి అనేక సాహిత్య, ధార్మిక మత గ్రంథాలను ప్రచురించారు. పోతన రచించిన మహా భాగవతం వంటి గ్రంథాలను ప్రచురించారు.

చంటి దొరగా అభిమాన పాత్రుడైన యస్.బి.పి.బి.కె. సత్యనారాయణ రావు 2011 జనవరి 21న మరణించారు[4].

మూలాలు

మార్చు
  1. "Members : Lok Sabha". loksabhaph.nic.in. Retrieved 2022-05-30.
  2.   https://en.wiki.x.io/wiki/S._B._P._B._K._Satyanarayana_Rao. వికీసోర్స్. 
  3. "Thirteenth Lok Sabha, Members Bioprofile". Retrieved 4 September 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. 4.0 4.1 4.2 "Ex-Union minister SBPBK dead". The New Indian Express. 22 January 2011. Retrieved 4 September 2021.