యువరాజ్ సింగ్

భారత దేశపు క్రికెట్ ఆటగాడు

1981, డిసెంబరు 12 న చండీగర్ లో జన్మించిన యువరాజ్ సింగ్ భారత దేశపు క్రికెట్ క్రీడాకారుడు. భారత మాజీ బౌలర్, పంజాబీ సినీ నటుడు అయిన యోగ్‌రాజ్ సింగ్ కుమారుడైన యువరాజ్ సింగ్ 2000 నుంచి వన్డే క్రికెట్ లో, 2003 నుంచి టెస్ట్ క్రికెట్|టెస్ట్ క్రికెట్ లో భారత జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇతను ప్రస్తుతం 2007 ప్రపంచ కప్ క్రికెట్లో ఇంగ్లాండుకు చెందిన స్టూవర్ట్ బ్రాడ్ ఓవర్‌లో వరుసగా 6 సిక్సర్లు సాధించి అంతర్జాతీయ క్రికెట్లో ఆ ఘనత సాధించిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ గా క్రికెట్ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

Yuvraj Singh
Yuvraj Singh at a promotional event in January 2013.
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1981-12-12) 1981 డిసెంబరు 12 (వయసు 42)
Chandigarh, పంజాబ్, భారత దేశము
మారుపేరుYuvi
ఎత్తు6 అ. 2 అం. (1.88 మీ.)
బ్యాటింగుఎడమ చేతి వాటం
బౌలింగుSlow left arm orthodox
పాత్రAll-rounder
బంధువులుహాజెల్ కీచ్ (భార్య)
 
Yograj Singh (father)
Son = Orion Keech Singh
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 247)2003 అక్టోబరు 16 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు2012 డిసెంబరు 5 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 134)2000 అక్టోబరు 3 - Kenya తో
చివరి వన్‌డే2013 డిసెంబరు 5 - దక్షిణాఫ్రికా తో
తొలి T20I (క్యాప్ 15)2007 సెప్టెంబరు 13 - స్కాంట్లాండ్ తో
చివరి T20I2013 అక్టోబరు 10 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1996–presentపంజాబ్
2003Yorkshire
2008–2010Kings XI పంజాబ్
2011–presentపూణే వారియర్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలుs]] T20I ఫస్ట్
మ్యాచ్‌లు 40 292 34 106
చేసిన పరుగులు 1900 8329 868 6829
బ్యాటింగు సగటు 33.92 36.53 33.38 44.92
100లు/50లు 3/11 13/51 0/7 20/32
అత్యుత్తమ స్కోరు 169 150 77* 209
వేసిన బంతులు 931 4988 316 2508
వికెట్లు 9 111 23 28
బౌలింగు సగటు 60.77 38.18 16.22 51.78
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/9 5/31 3/17 5/94
క్యాచ్‌లు/స్టంపింగులు 31/- 92/- 9/- 97/-
మూలం: Cricinfo, 2013 డిసెంబరు 5

2007 టి20 ప్రపంచ కప్ లో ప్రధాన బ్యాట్సమన్ గా రాణించాడు.  అలాగే,   2011 వన్డే ప్రపంచ కప్ భారత్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు, ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయాడు.  

టి20 పొట్టి క్రికెట్లో తక్కువ బంతుల్లో (12) అర్ధ శతకం ఇప్పటికి ఈ బ్యాట్సమెన్ పేరిట ఉంది.

ఇప్పటి వరకు వన్డే ప్రపంచ కప్ క్రికెట్ లో అల్ రౌండర్ అత్యుత్తమ ప్రదర్శన ఈ యువి పేరిట ఉంది. (మొత్తం టోర్నమెంట్లో 300లకు పైగా పరుగులు, 15 వికెట్లతో).

అలాగే వన్డే ప్రపంచ కప్ క్రికెట్ లో ఒక టోర్నమెంట్లో సచిన్ తర్వాత అధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను పొందిన క్రికెటర్.

అలాగే వన్డే ప్రపంచ కప్ క్రికెట్లో అన్ని టోర్నమెంట్లో సచిన్ తర్వాత అధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను పొందిన క్రికెటర్.

ఇప్పటి వరకు వన్డేల్లో 26 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నాడు. అందులో రెండు మ్యాచుల్లో తప్ప అన్ని మ్యాచులు భారత విజయానికి ఉపయోగపడ్డాయి.

అలాగే వరసగా వన్డేల్లో మూడు మ్యాన్ అఫ్ ది సిరీస్ అవార్డులను పొందిన అతి తక్కువ మందిలో యువరాజ్ ఒకడు.

భారత క్రికెట్లో ఫీల్డింగ్ బాగా చేసే వారిలో యువి ఒకరు.

దుర్భేద్యమయిన పిచ్లయినా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఇండీస్ లలో అలవోకగా బ్యాట్టింగ్ చేయగల బ్యాట్సమెన్ లలో ఒకడిగా పేరొందాడు.

1999 లో అండర్ 19 వన్డే ప్రపంచ కప్ క్రికెట్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.

2011 ప్రపంచ కప్ తరువాత యువికి కాన్సర్ అనే భయంకరమైన వ్యాధి సోకింది.

తరువాత అందులోనుండి బయటపడ్డాక క్రికెట్ లో మళ్ళి పునరాగమనం చేసాడు.

భారత ప్రభుత్వం నుండి అర్జున, పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నాడు.

యువరాజ్ సింగ్ 2019 సంవత్సరం జూన్ 10 తేదీన రిటైర్మెంట్ ప్రకటించాడు.

యువరాజ్ సొంత స్వచ్ఛంద సంస్థ YouWeCan వందలాది మంది క్యాన్సర్ రోగులకు చికిత్స చేసింది. 2015 ఏప్రిల్లో, అతను ఆన్‌లైన్ స్టార్టప్‌లలో INR 40–50 కోట్లు పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశాన్ని ప్రకటించాడు, అలా చేయడానికి YouWeCan వెంచర్స్‌ని ఏర్పాటు చేయడం ద్వారా YouWeCan ప్రతిపాదనను విస్తరించాడు.[133] 2015లో, యూవీకాన్ హేయో మీడియా వ్యవస్థాపకుడు జయకృష్ణన్‌తో కలిసి దేశవ్యాప్తంగా క్యాన్సర్ అవగాహనను కూడా ప్రారంభించింది.

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు