యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (ఏప్రిల్ 2022) |
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశంలో కేంద్ర స్థాయిలో పబ్లిక్ సర్వీసుల నియామక సంస్థగా పని చేస్తుంది. ఇది స్వతంత్ర రాజ్యాంగ బద్ధ సంస్థ.[1]
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ | |
---|---|
కమిషన్ అవలోకనం | |
స్థాపనం | 1 అక్టోబరు 1926 |
పూర్వపు ఏజెన్సీలు | ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ |
అధికార పరిధి | భారతదేశం |
ప్రధాన కార్యాలయం | ఢోల్ పూర్ హౌస్, షాజహాన్ రోడ్, న్యూఢిల్లీ 28°36′29″N 77°13′37″E / 28.6080°N 77.2269°E |
కమిషన్ కార్యనిర్వాహకుడు/ | ప్రో. (డా) ప్రదీప్ కుమార్ జోషి, (ఛైర్మన్) |
మాతృ శాఖ | భారత ప్రభుత్వం |
Child కమిషన్ | పబ్లిక్ సర్వీస్ కమీషన్స్ ఇన్ ఇండియా |
నిర్మాణం, నియామకం, పదవీ కాలం
మార్చు- యూపీఎస్సీలో చైర్మన్, సభ్యులును నియమించే, తొలగించే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. ఈ కమిషన్‌లో ఎంత మంది సభ్యులు ఉండాలో రాజ్యాంగం ప్రత్యేకంగా చెప్పలేదు. సాధారణంగా చైర్మన్‌తో సహా 9 నుండి 11 మంది సభ్యులు ఉంటారు.
- కమిషన్‌లోని సగం మంది సభ్యులు భారత ప్రభుత్వంలో గాని, రాష్ట్ర ప్రభుత్వాలలో కానీ కనీసం 10 సంవత్సరాలు పని చేసి ఉండాలి, చైర్మన్, సభ్యుల సర్వీస్ విషయాలను రాష్ట్రపతి నిర్ణయిస్తాడు.
- యూపీఎస్సీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు ఏది ముందైతే అది వర్తిస్తుంది. చైర్మన్, సభ్యులు ఎప్పుడైనా రాష్ట్రపతికి రాజీనామా ఇచ్చి పదవి నుంచి తప్పుకోవచ్చు.
విధులు
మార్చు- అఖిల భారత సర్వీసులకు, కేంద్ర సర్వీసులకు, కేంద్ర పాలిత ప్రాంతాల సర్వీసు నియామకాలకు పరీక్షలు నిర్వహిస్తుంది.
- ఏమైనా సర్వీసులకు ప్రత్యేక అర్హతలుగల అభ్యర్థుల నియామకం అవసరమని రెండు లేక అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు భావిస్తే ఆ రాష్ట్రాల అభ్యర్థన మేరకు సర్వీసులలో ఉమ్మడిగా వర్తింపజేయుటకు పథకాలను రూపొందించడానికి, అమలు చేయడానికి యూపీఎస్సీ ఆ రాష్ట్రాలకు సహాయం చేస్తుంది.
- రాష్ట్రపతి అనుమతిలో గవర్నర్ కోరిన మేరకు రాష్ట్రానికి తోడ్పడుతుంది.
ఇవి కూడా చుడండి
మార్చు- జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిషన్
- వినయ్ మిట్టల్ (మాజీ చైర్మన్)
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (26 March 2022). "రాజ్యాంగపర, చట్టపరమైన సంస్థలు". Archived from the original on 28 March 2022. Retrieved 28 March 2022.