రమావత్ వల్యా నాయక్
రమావత్ వాల్యానాయక్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2022 మార్చి 31న తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[1]
రామావత్ వాల్యానాయక్ | |||
| |||
తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ (T.S.G.C.C)
| |||
పదవీ కాలం 2022 మార్చి 31 – ప్రస్తుతం | |||
నియోజకవర్గం | జడ్చర్ల నియోజకవర్గం, మహబూబ్ నగర్ జిల్లా | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1975 ఏప్రిల్ 10 నేలబండతండా, బాలానగర్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | చత్రు నాయక్, భన్కి బాయి | ||
జీవిత భాగస్వామి | రామావత్ కమల | ||
సంతానం | ఆనంద్ నాయక్, అరుణ్ కుమార్, అనిత | ||
నివాసం | షాద్ నగర్ |
జననం
మార్చురమావత్ వాల్యానాయక్ 1975 ఏప్రిల్ 10న చత్రు నాయక్ - భన్కి బాయి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, బాలానగర్ మండలం, నేలబండతండా గ్రామంలో జన్మించాడు.
వ్యక్తిగత జీవితం
మార్చువాల్యానాయక్కు రామావత్ కమలతో వివాహం జరిగింది. కమల ప్రస్తుతం మహాబుబ్ నగర్ జిల్లాలోని బాలానగర్ మండల ఎం.పీ.పీ గా ఉన్నారు. వారికి ఇద్దురు కుమారులు (ఆనంద్ నాయక్, అరుణ్ కుమార్), ఒక కుమార్తె (అనిత) ఉన్నారు.
రాజకీయ జీవితం
మార్చువాల్యానాయక్ నేలబండతండా సర్పంచ్‌గా ఉన్న సమయంలో 2001లో ఆయన కేసీఆర్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి క్రియాశీల కార్యకర్తగా పనిచేశాడు. ఆయన 2004 నుంచి 2009 వరకు బాలానగర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ జాగరణ సేన మహబూబ్‌నగర్ జిల్లా కన్వీనర్‌గా పనిచేశాడు. వాల్యానాయక్ తెలంగాణ ఉద్యమ సమయంలో 2008లో కేసీఆర్ తండానిద్ర కార్యక్రమం చేపట్టగా నేలబండ తండాలోని వాల్యానాయక్ ఇంట్లోనే బస చేశాడు.
రమావత్ వాల్యానాయక్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు, తరువాత జరిగిన వివిధ ఎన్నికల్లో పార్టీ ఇంచార్జిగా వివిధ స్థాయిల్లో పనిచేశాడు. వాల్యానాయక్ ప్రస్తుతం టీఆర్‌ఎస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కొనసాగుతున్న సమయంలో 2022 మార్చి 31న తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్మన్‌గా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నియమించగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశాడు.[2][3] ఆయన 2022 ఏప్రిల్ 8న చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు.[4]
మూలాలు
మార్చు- ↑ Andhra Jyothy (1 April 2022). "జీసీసీ చైర్మన్‌గా రమావత్ వల్యా నాయక్" (in ఇంగ్లీష్). Archived from the original on 1 April 2022. Retrieved 1 April 2022.
- ↑ Namasthe Telangana (1 April 2022). "జీసీసీ చైర్మన్‌గా వాల్యానాయక్". Archived from the original on 1 April 2022. Retrieved 1 April 2022.
- ↑ Namasthe Telangana (1 April 2022). "రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్‌గా రామావత్ వాల్యానాయక్". Archived from the original on 1 April 2022. Retrieved 1 April 2022.
- ↑ Andhra Jyothy (8 April 2022). "గిరిజన కార్పొరేషన్ ఛైర్మన్ గా వాల్యానాయక్ బాధ్యతల స్వీకరణ" (in ఇంగ్లీష్). Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.