రమేశ్ కృష్ణన్
1961 జూన్ 5 న జన్మించిన రమేశ్ కృష్ణన్ భారత టెన్నిస్ క్రీడాకారుడు. 1980 దశాబ్దంలో భారత్ తరఫున ఆడి పలు విజయాలు సాధించాడు. అతని తండ్రి రామనాథన్ కృష్ణన్ కూడా టెన్నిస్ ఆటగాడు. 1998లో రమేశ్ కృష్ణన్ కు పద్మశ్రీ అవార్డు లభించింది. 2007 జనవరిలో అతనిని భారత డేవిస్ కప్ టీం కోచ్ గా నియమించారు.
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/b/b4/The_former_Tennis_players%2C_Shri_Ramanathan_Krishnan_and_Shri_Ramesh_Krishnan_called_on_the_Union_Minister_of_Youth_Affairs_and_Sports%2C_Dr._M.S._Gill%2C_in_New_Delhi_on_November_26%2C_2009.jpg/220px-thumbnail.jpg)
క్రీడా జీవితంలో ముఖ్య ఘట్టాలు
మార్చు- 1979 - వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ చాంపియన్ షిప్ సాధించాడు.
- 1981 - అమెరికన్ ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళినాడు.
- 1985 - సింగిల్స్ ర్యాంకింగ్ లో అతని జీవితంలోనే అత్యుత్తమమైన 23 వ ర్యాంకును పొందినాడు.
- 1986 - వింబుల్డన్ లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళినాడు.
- 1987 - అమెరికన్ ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళినాడు.
- 1987 - డేవిస్ కప్ భారత టీంలో సభ్యుడిగా ఉండి ఫైనల్ వరకు తీసుకువచ్చాడు.
- 1989 - అప్పటి ప్రపంచ నెంబర్ 1 మాట్స్ విలాండర్ను ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్ లో ఓడించాడు.
- 1992 - బార్సిలోనా ఒలింపిక్ క్రీడలలో డబుల్స్ లో క్వార్టర్ ఫైన వరకు వచ్చాడు.