రాకేష్ మాస్టర్ (1968 - 2023 జూన్ 18) భారతీయ సినిమా కొరియోగ్రాఫర్. దాదాపు 300 సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. ఆయన అసలు పేరు ఎస్. రామారావు.

రాకేష్ మాస్టర్
జననం
సీనూరి రామారావు

1968
మరణం2023 జూన్ 18
వృత్తితెలుగు సినిమా కొరియోగ్రాఫర్
జీవిత భాగస్వామిసీనూరి లక్ష్మి
పిల్లలుచరణ్ తేజ, రిషిక

2020 సంవత్సరంలో గ్లోబల్ హ్యమన్ పీస్ యూనివర్సిటీ వారు సేవా రంగంలో రాకేష్ మాస్టర్‌కు డాక్టరేట్ ప్రకటించారు.[1]

జీవిత విషయాలు

మార్చు

ఎస్. రామారావు 1968వ సంవత్సరంలో తిరుపతి ప్రాంతంలో జన్మించాడు. ఈయనకు నలుగురు అక్కలు, ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. హైదరాబాద్‌లో ముక్కురాజు మాస్టర్ వద్ద కొంతకాలం పనిచేశాడు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి వారికి శిక్షణ ఇచ్చాడు. వేణు, మణిచందన, ప్రభాస్, ప్రత్యూష మొదలైన సినీ నటులు రాకేష్ మాస్టర్ వద్ద శిక్షణను పొందారు. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు మొదలైన సినిమాలలోని పాటలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే ఈటీవీ వేదికగా ప్రారంభమైన డ్యాన్స్ షో ఢీ లో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్‌గా వ్యవహరించాడు[2] అదే విధంగా జబర్దస్త్ కామెడీ షోకి సంబంధించి పలు ఎపిసోడ్లలో పార్టిసిపెంట్‌గా కూడా పాల్గొన్నాడు ఆయన చాలామందికి సహాయం చేశారు

వివాదాలు

మార్చు

యూట్యూబ్ వేదికగా రాకేష్ మాస్టర్ అనేక వివాదాస్పద ఇంటర్వ్యూలు ఇచ్చాడు. రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి, ఎన్టీఆర్, బాలకృష్ణ, మోహన్ బాబు, చిరంజీవి, మంచు లక్ష్మి‌లను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి.[3] అలాగే పుల్లయ్య అనే పల్లెటూరి కుర్రాడికి రాకేష్ మాస్టర్ డ్యాన్స్‌లో కొన్నాళ్లు శిక్షణ ఇచ్చాడు. కానీ ఆ కుర్రాడు ఆ శిక్షణను మధ్యలోనే ముగించి, తన మాస్టర్ పైనే వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వార్త సోషల్ మీడియాలో సంచలనాన్ని రేకెత్తించింది.[4] ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ శ్రీకృష్ణుడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని చెబుతూ యాదవ సంఘ నాయకులు రాకేష్ మాస్టర్ పై మే 2021 నెలలో హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. [5]

రాకేశ్‌ మాస్టర్‌ విశాఖలో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొని హైదరాబాద్‌ తిరిగొచ్చిన తరువాత అస్వస్థతకు గురై 2023 జూన్ 18న మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో అడ్మిట్‌ అవ్వగా, డయాబెటిస్‌ పేషెంట్‌ కావడంతో పాటు సివియర్‌ మెటాబాలిక్‌ ఎసిడోసిస్‌ కావడంతో మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ జరగడంతో పరిస్థితి విషమించి సాయంత్రం 5 గంటలకు మరణించాడు.[6][7]

మూలాలు

మార్చు
  1. "Why Rakesh Master Criticize others". www.batukamma.com. బతుకమ్మ వెబ్ సైట్. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  2. "Rakesh Master makes controversial comments about Jr NTR". www.pinkvilla.com. PINK VILLA. Archived from the original on 10 మే 2021. Retrieved 10 May 2021.
  3. "ఎన్టీఆర్ ఫ్యాన్స్ చంపేస్తాం అంటున్నారు.. పోలీస్ స్టేషన్‌కి డాన్స్ మాస్టర్". telugu.samayam.com. SAMAYAM. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  4. "పుల్లయ్యని హీరో చేద్దామని తెచ్చి". telugustop.com. TELUGUSTOP. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  5. "10 టివి వెబ్ సైటులోని వార్తా సమాచారం".
  6. "Rakesh Master Passes Away: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి - tollywood choreographer rakesh master is no more - Samayam Telugu". web.archive.org. 2023-06-18. Archived from the original on 2023-06-18. Retrieved 2023-06-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. Eenadu (18 June 2023). "సినీ కొరియోగ్రాఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ కన్నుమూత". Archived from the original on 18 June 2023. Retrieved 18 June 2023.