రాచర్ల తిప్పయ్య గుప్త

రాచర్ల తిప్పయ్య గుప్త (జ. 1908, మే 30) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత.[1]

రాచర్ల తిప్పయ్య గుప్త
జననం1908, మే 30
బెళుగుప్ప, బెళుగుప్ప మండలం, అనంతపురం జిల్లా,
వృత్తిఆయుర్వేద వైద్యుడు
ప్రసిద్ధికవి, సామాజికవేత్త
మతంహిందూ
తండ్రిదొణ తిమ్మప్ప
తల్లితిప్పమాంబ

జననం, కుటుంబ నేపథ్యం

మార్చు

తిప్పయ్య గుప్త 1908, మే 30అనంతపురం జిల్లా, బెళుగుప్ప మండలంలోని, బెళుగుప్పలో జన్మించాడు.[2] తల్లి తిప్పమాంబ, తండ్రి దొణ తిమ్మప్ప. ఇతని తాత రామప్ప ఆంధ్ర గీర్వాణ భాషలలో ప్రవీణుడు కాగా, తండ్రి దొణ తిమ్మప్ప వేదాంతంలో నిష్ణాతుడు.[3]

విద్యాభ్యాసం

మార్చు

తిప్పయ్య గుప్త బళ్ళారిలోని యాదాటి నరహరి శాస్త్రుల వద్ద సంస్కృతం, వేదాంతం అభ్యసించాడు. అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన కల్లారు వేంకటనారాయణరావు గారి వద్ద లక్షణ గ్రంథాలను అభ్యసించాడు.[4]

సాహిత్య ప్రస్థానం

మార్చు

తిప్పయ్య గుప్త 15 సంవత్సరాల వయసులోనే కవిత్వం రాయడం ప్రారంభించాడు. బళ్ళారి వార్డా హైస్కూల్లో చదువుతున్నప్పుడే వారి రచనలు భారతి మాసపత్రికలో ప్రచురితమయ్యాయి. వారు పద్య రచనతో పాటు నాటకాలు, నవలలు, చరిత్ర గ్రంథాలు కూడా రచించాడు.[3]

ముఖ్యమైన రచనలు[5]

మార్చు
  • విద్యారణ్యచరిత్ర
  • విద్యారణ్యవిజయము
  • కంపిల విజృంభణము
  • కాకతీయ జీవనసంధ్య
  • అమృత స్రవంతి
  • బదులుకు బదులు
  • మోహినీరుక్మాంగద
  • ఛత్రపతి శివాజీ

సాహిత్య పోషణ, గుర్తింపు

మార్చు

తిప్పయ్య గుప్త తన తండ్రి స్మారకంగా 116 రూపాయలు గ్రంథమాలకు దానం చేశాడు. తిప్పయ్య గుప్తకి "సాహిత్య సరస్వతి" అనే బిరుదు లభించింది. సాహిత్య సేవలకు అనేక ప్రశంసలు లభించాయి. రచనలు అనేక పత్రికలలో ప్రచురితమయ్యాయి.[6]

మూలాలు

మార్చు
  1. రాయలసీమ రచయితల చరిత్ర రెండవసంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
  2. కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).
  3. 3.0 3.1 కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).
  4. కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).
  5. కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).
  6. కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).

ఇతర లింకులు

మార్చు