రాజి జల్లేపల్లి

ఇండో-అమెరికన్ చెఫ్

రాజేశ్వరి "రాజీ" జల్లేపల్లి (1949, మే - 2002, జనవరి 27) తెలంగాణకు చెందిన చెఫ్. క్లాసిక్ ఫ్రెంచ్, భారతీయ వంటకాలకు గాను ది న్యూయార్క్ టైమ్స్ చేత ప్రశంసించబడింది.[1]

రాజి జల్లేపల్లి
జననం
రాజేశ్వరి రాంపల్లి

(1949-05-00)1949 మే
మరణంజనవరి 27, 2002(2002-01-27) (aged 52)
మెంఫిస్, టెన్నెస్సీ, యుఎస్
వృత్తిచెఫ్, రెస్టారెంట్ యజమానురాలు
క్రియాశీల సంవత్సరాలు1989–2002

జీవిత విశేషాలు

మార్చు

రాజేశ్వరి రాంపల్లి 1949 మే నెలలో రామకృష్ణ - రాధ దంపతులకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించింది.[2] రాజేశ్వరి తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నతస్థాయి దౌత్యవేత్తగా పనిచేసినందున, ఆమె కుటుంబం తరచుగా యూరప్‌కు వెళ్ళేది. తనకు ముగ్గురు చెల్లెళ్ళు (పద్మ, సీత, వైజయంతి) ఉన్నారు.

వైద్యుడైన పాండురంగ జల్లేపల్లిని వివాహం చేసుకున్న తరువాత అతనితోపాటు 1969లో అమెరికాకు వెళ్ళింది.[2] మైక్రోబయాలజిస్ట్‌గా శిక్షణ పొందిన రాజేశ్వరి[3] యుఎస్ లో మెడికల్ టెక్నాలజిస్ట్‌గా పనిచేసింది. మొదట న్యూయార్క్, న్యూజెర్సీలలో నివసించిన రాజేశ్వరి కుటుంబం 1970ల ప్రారంభంలో మెంఫిస్, టెన్నెస్సీకి వెళ్ళింది.[2]

చెఫ్‌గా కెరీర్

మార్చు

1989లో మెంఫిస్‌లో రాజేశ్వరి, ది ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో తన మొదటి రెస్టారెంట్ ను ప్రారంభించింది.[4] ప్రారంభంలో భారతీయ వంటకాలు ఉన్నప్పటికీ తర్వాత ఫ్రెంచ్ - భారతీయ వంటకాల కలయికగా మార్చింది. 1992లో రెస్టారెంట్ పేరును రాజి అని మార్చింది. కొత్త వంటకాలకు మంచి స్పందన లభించింది. 1990లలో జల్లేపల్లి జేమ్స్ బార్డ్ హౌస్‌లో ఆరుసార్లు వంట చేయడానికి ఆహ్వానించబడింది.

రాజేశ్వరి 2000లో హార్పర్‌కాలిన్స్‌ సంస్థ నుండి రాజీ వంటకాలు: ఇండియన్ ఫ్లేవర్స్, ఫ్రెంచ్ ప్యాషన్ అనే పుస్తకాన్ని ప్రచురించబడింది.[3][5] 2000లో న్యూయార్క్ నగరంలోని ట్రిబెకాలోని భారతీయ రెస్టారెంట్ అయిన టామరిండ్‌కి ఎగ్జిక్యూటివ్ చెఫ్‌గా అవతార్ వాలియా ఎంపికైంది.[2] 2001 జనవరిలో టామరిండ్‌ ప్రారంభించబడింది. ది న్యూయార్క్ టైమ్స్లోని ఆహార విమర్శకుడు విలియం గ్రిమ్స్ రాసిన ప్రారంభ సమీక్షలో "భారతీయ ఆహారం కారణానికి స్పష్టమైన విజయం" అని పిలువబడింది.[1]

అవార్డులు, గుర్తింపులు

మార్చు
  • 1996, 1997లో బెస్ట్ చెఫ్: సౌత్ ఈస్ట్ విభాగంలో రెండు జేమ్స్ బియర్డ్ ఫౌండేషన్ అవార్డులకు నామినేట్ చేయబడింది.[2]
  • 2000లో "ఇమాజిన్ ది ఫ్యూచర్" అనే కార్యక్రమంలో భాగంగా వైట్ హౌస్ వెయ్యేళ్ళ వేడుకల్లో సత్కరించబడింది.[4]

వ్యక్తిగత జీవితం

మార్చు

పాండురంగ జల్లేపల్లితో జల్లేపల్లి మొదటి వివాహం జరిగింది. ఇద్దరు కుమారులు (ప్రసాద్, సతీష్) పాండురంగతో విడాకులు తీసుకున్న తర్వాత 1999లో లూయిస్ రీస్‌ని వివాహం చేసుకుంది.

రాజేశ్వరి 52 సంవత్సరాల వయస్సులో జీర్ణాశయ క్యాన్సర్ కారణంగా 2002, జనవరి 27న మెంఫిస్‌లో మరణించింది.[2][1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 Pace, Eric (January 31, 2002). "Raji Jallepalli-Reiss, Chef, 52; Merged French and Indian Cuisines". The New York Times. Retrieved 2023-03-07.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 Sen, Mayukh (November 5, 2019). "A Comet Called Raji". Gravy. Southern Foodways Alliance. Retrieved 2023-03-07.
  3. 3.0 3.1 Rice, William (May 24, 2000). "'RAJI CUISINE' COMBINES FRENCH AND INDIAN STRENGTHS". Chicago Tribune. Retrieved 2023-03-07.
  4. 4.0 4.1 "Raji Jallepalli". StarChefs.com. Retrieved 2023-03-07.
  5. Fox Burks, Justin; Lawrence, Amy (August 6, 2018). "Remembering Raji". Edible Memphis. Archived from the original on 2019-11-11. Retrieved 2023-03-07.