రాజీవ్ రాజలే
రాజీవ్ అప్పాసాహెబ్ రాజాలే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 మహారాష్ట్ర ఎన్నికలలో షెవ్‌గావ్ - పతార్డి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజీవ్ రాజలే | |||
పదవీ కాలం 2004 – 2009 | |||
నియోజకవర్గం | షెవ్‌గావ్ - పతార్డి | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | మోనికా రాజీవ్ రాజలే[1] | ||
బంధువులు | బాలాసాహెబ్ థోరాట్ (మేనమామ) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చురాజీవ్ రాజలే కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ధకనే పర్తాప్ బాబారావుపై 6001 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2009 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి 2011లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి[2] 2014లో లోక్‌సభ ఎన్నికలలో అహ్మద్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి దిలీప్‌కుమార్ గాంధీ చేతిలో 2,09,122 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]
మరణం
మార్చురాజీవ్ రాజ్లే అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2017 అక్టోబర్ 8న మరణించాడు. ఆయనకు భార్య మోనికా రాజీవ్ రాజలే, ఇద్దరు పిల్లలు ఉన్నారు.[4][5]
మూలాలు
మార్చు- ↑ "Old political rivalries playing out in Ahmednagar". Business Standard. 22 April 2019. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.
- ↑ "Former Congress MLA joins NCP" (in ఇంగ్లీష్). The Indian Express. 21 August 2011. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.
- ↑ "Ahmadnagar Constituency Lok Sabha Election Result" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2023. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.
- ↑ "माजी आमदार राजीव राजळे यांचं निधन". एबीपी माझा. 8 October 2017. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.
- ↑ "पाथर्डीचे माजी आमदार राजीव राजळे यांचे निधन". Loksatta. 8 October 2017. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.