రాప్తాటి సుబ్బదాసు
రాప్తాటి సుబ్బదాసు (మ. 1961, మే 19)[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత. ఇతను సంఘ సంస్కర్త, కళాకారుడు.
రాప్తాటి సుబ్బదాసు | |
---|---|
జననం | రాప్తాటి సుబ్బదాసు ధర్మవరం, శ్రీ సత్యసాయి జిల్లా |
మరణం | 1961, మే 19 |
ప్రసిద్ధి | కవి, రచయిత |
మతం | హిందూ |
తండ్రి | నారప్ప |
తల్లి | లక్ష్మమ్మ |
జననం
మార్చుసుబ్బదాసు శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో నారప్ప, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు.[2]
కళా, సాహిత్యరంగాలు
మార్చుసుబ్బదాసు హరికథలను స్వయంగా రచించి, అనేక పట్టణాల్లో ప్రదర్శనలు ఇచ్చేవాడు. నాటకాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. 1910-11 ప్రాంతాల్లో సుబ్బదాసు 'అభిజ్ఞాన జయదేవ’ అనే నాటకాన్ని రచించాడు. ధర్మవరంలో 'వాణీ మనోవినోదిని’ అనే నాటక సభను స్థాపించి, ఆ నాటకాన్ని ప్రదర్శించాడు.[2]
హరికథలు చేస్తూ దేశమంతా పర్యటించి, ధర్మవరంలో ఒక హఠయోగాశ్రమాన్ని స్థాపించాడు. బొజ్జమ్మ అనే శిష్యురాలు సుబ్బదాసుకి చాలాకాలం సహాయకురాలిగా ఉంటూ, ఆశ్రమాభివృద్ధికి తోడ్పడింది. బొజ్జమ్మ కోరిక మేరకు, సుబ్బదాసు 1911లో 'అభిజ్ఞాన జయదేవ’ నాటకాన్ని 'విగమార్థ చంద్రోదయ’ గ్రంథమాల ద్వారా ముద్రించాడు.[3]
సత్యాగ్రహంలో పాల్గొనడానికి ముందు, 8-1-1911న బొజ్జమ్మ కోరికపై స్త్రీల కోసం 'ఆత్మారామ గేయము’ రాశాడు. ఆ తరువాత పోలీసులు ఆయనను అరెస్టు చేసి అలీపూర్ జైలులో నాలుగు నెలలు ఉంచారు. తిరిగి వచ్చాక ఆ గేయాలను 1918లో ముద్రించాడు.
సుబ్బదాసు అహింసా సిద్ధాంతాన్ని 'పకుయజ్ఞ బడము’ అనే గ్రంథంలో (1939లో ముద్రించబడింది) వివరించాడు. మానసగీతావళి, సుక్ర రాశ శతరము, పరమేశ్వర శతకము, విష్ణునామావళి, హితబోధిని., శిష్య పరంపర, ఆశ్రమ కొనసాగింపు వంటి గ్రంథాలు కూడా రాశాడు.[4]
మరణం
మార్చుసుబ్బదాసు 1961, మే 19న మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ రాయలసీమ రచయితల చరిత్ర రెండవసంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
- ↑ 2.0 2.1 కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).
- ↑ కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).
- ↑ కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).