రామసహాయం సురేందర్ రెడ్డి
రామసహాయం సురేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు మాజీ పార్లమెంటు సభ్యుడు. ఆయన డోర్నకల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా & వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా పనిచేశాడు.[1][2] ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 3వ లోక్‌సభ, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 4వ, 9వ, 10వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[3]
ఆర్. సురేంద్రరెడ్డి | |||
![]() ఆర్. సురేంద్రరెడ్డి | |||
మాజీ పార్లమెంటు సభ్యుడు
| |||
పదవీ కాలం 1967-1971, 1989-1996 | |||
ముందు | బకర్ అలీ మిర్జా | ||
---|---|---|---|
తరువాత | అజ్మీరా చందులాల్ | ||
నియోజకవర్గం | వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం | ||
మాజీ పార్లమెంటు సభ్యుడు
| |||
పదవీ కాలం 1962-1967 | |||
ముందు | ఇటికాల మధుసూదనరావు | ||
తరువాత | పోరిక బలరాం నాయక్ | ||
నియోజకవర్గం | మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఖమ్మం, తెలంగాణ | 1931 అక్టోబరు 10||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | జయమాల | ||
సంతానం | ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు | ||
మతం | హిందూ మతం |
జీవిత విశేషాలు
మార్చుసురేంద్రరెడ్డి 1931 అక్టోబరు 10 న తెలంగాణ రాష్ట్రం, ఖమ్మంలో జన్మించాడు. హైదరాబాదులోని నిజాం కళాశాలలో చదువుకున్నాడు.[4]
రాజకీయ జీవితం
మార్చుభారత జాతీయ కాంగ్రెస్ 1965లో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 3వ లోక్‌సభకు, [5] 1967లో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 4వ లోక్‌సభకు[6] ఎన్నికయ్యాడు. 1974 నుండి 1979 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1989-1991 మధ్యకాలంలో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 9వ లోక్‌సభ, [7] 1991-1996 మధ్యకాలంలో 10వ లోక్‌సభకు[8] పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[9]
వ్యక్తిగత జీవితం
మార్చురవీంద్రరెడ్డికి 1956, నవంబరు 28న జయమాలతో వివాహం జరిగింది. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. వ్యవసాయదారుడిగా కొంతకాలం పనిచేసి, పారిశ్రామికవేత్తగా ఎదిగాడు.
నిర్వర్తించిన పదవులు
మార్చు- 1980-1982: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి
- 1988: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్
- 1990: పబ్లిక్ అండర్‌టేకింగ్స్‌పై కమిటీ సభ్యుడు
- 1990: పరిశ్రమల మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు
ఇతర వివరాలు
మార్చుక్యూబా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, మెక్సికో, యుఎస్ఏ, సింగపూర్, హాంకాంగ్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్, థాయిలాండ్, న్యూజిలాండ్, టర్కీ దేశాలు సందర్శించాడు.
వివిధ ఎన్నికలలో పాల్గొన్న వివరాలు
మార్చుసంవత్సరం | నియోజకవర్గం | గెలుపొందిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|
1962 | మహబూబాబాద్ | రామసహాయం సురేందర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | ఇటికాల మధుసూదనరావు | సిపిఐ | ||
1974 | డోర్నకల్ | రామసహాయం సురేందర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | ఏకగ్రీవం | |||
1978 | డోర్నకల్ | రామసహాయం సురేందర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 30294 | నర్సింహా రెడ్డి | కాంగ్రెస్ ఐ | 16685 |
1983 | డోర్నకల్ | రామసహాయం సురేందర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 51038 | జానారెడ్డి జితేందర్ రెడ్డి | టీడీపీ | 16794 |
1985 | డోర్నకల్ | రామసహాయం సురేందర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 44387 | జానారెడ్డి జితేందర్ రెడ్డి | టీడీపీ | 29104 |
1989 | వరంగల్ | రామసహాయం సురేందర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 311810 | టి. కల్పనాదేవి | తెలుగుదేశం పార్టీ | 257689 |
1991 | వరంగల్ | రామసహాయం సురేందర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 258733 | నెమరుగొమ్ముల యెతిరాజా | తెలుగుదేశం పార్టీ | 206860 |
1996 | వరంగల్ | అజ్మీరా చందులాల్ | తెలుగుదేశం పార్టీ | 292887 | రామసహాయం సురేందర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 275447 |
మూలాలు
మార్చు- ↑ Loksabha (2021). "REDDY, SHRI SURENDRA". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.
- ↑ Sakshi (9 November 2018). "విభిన్న రాజకీయం". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.
- ↑ "Lok Sabha Members Bioprofile-". Retrieved 13 December 2017.
- ↑ "Members Bioprofile (Tenth Lok Sabha Members Bioprofile REDDY, SHRI SURENDRA)". loksabhaph.nic.in. Archived from the original on 2021-12-20. Retrieved 2021-12-20.
- ↑ "Third Lok Sabha State wise Details Andhra Pradesh". loksabhaph.nic.in. Archived from the original on 2021-12-20. Retrieved 2021-12-20.
- ↑ "Fourth Lok Sabha State wise Details Andhra Pradesh". loksabhaph.nic.in. Archived from the original on 2021-12-20. Retrieved 2021-12-20.
- ↑ "Ninth Lok Sabha State wise Details Andhra Pradesh". loksabhaph.nic.in. Archived from the original on 2021-12-20. Retrieved 2021-12-20.
- ↑ "Tenth Lok Sabha State wise Details Andhra Pradesh". loksabhaph.nic.in. Archived from the original on 2021-12-20. Retrieved 2021-12-20.
- ↑ "Shri Surendra Reddy MP biodata Warangal | ENTRANCEINDIA". www.entranceindia.com. 2018-12-28. Archived from the original on 2021-12-20. Retrieved 2021-12-20.