రాయదుర్గం పురపాలక సంఘం
రాయదుర్గం పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురంకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం లోని, రాయదుర్గం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
రాయదుర్గం | |
స్థాపన | 1963 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
చరిత్ర
మార్చురాయదుర్గం పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలోని మునిసిపాలిటీ.రాయదుర్గం పట్టణంలో పట్టు చీరలు నేయటం ఒక కుటీర పరిశ్రమ. ఇక్కడి జనాభాలో అధిక శాతం చేనేత కార్మికులు అయితే కాలక్రమేణ చేనేత పరిశ్రమ కుంటుపడడంతో జీన్స్ పరిశ్రమ ఊపందుకుంది. ఇప్పుడు ఈ ప్రాంతం జీన్స్ ప్యాంట్లుకు ప్రసిద్ధి. ఇది సరిహద్దు ప్రాంతం కావడం చేత ఇక్కడి ప్రజలు అధిక శాతం తెలుగు, కన్నడ రెండు భాషలూ మాట్లడగలరు.1963 సంవత్సరంలో మునిసిపాలిటీగా స్థాపించబడింది.[1] ఈ పురపాలక సంఘం 49.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.31 ఎన్నికల వార్డులు ఉన్నాయి.
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం 61,749 జనాభా ఉండగా అందులో పురుషులు 30,911, మహిళలు 30,838 మంది ఉన్నారు.అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 69.59% ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 76.75% కాగా, మహిళా 62.47% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 7462 ఉన్నారు.[2]
ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్
మార్చుప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా రాజశేఖర్, [3] వైస్ చైర్మన్‌గా మహబూబ్ బాషా పనిచేస్తున్నారు.[3]
పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చు- దశభుజ గణపతి ఆలయం: రాయదుర్గంలోని దశభుజ గణపతి మందిరం ప్రత్యేకమైంది. ఆ కళ్లు అచ్చంగా తండ్రి పోలికే, మూడుకన్నులతో ముక్కంటి బిడ్డ అనిపించుకున్నాడు. చేతులేమో అమ్మను తలపిస్తాయి, మహాశక్తిని గుర్తుకుతెచ్చేలా దశభుజాలు. మేనమామ లక్షణాలూ వచ్చాయి, విష్ణుమూర్తిలా చేతిలో సుదర్శనం.
మూలాలు
మార్చు- ↑ "Rayadurg Municipality". cdma.ap.gov.in. Municipal Administration & Urban Development Department, Govt. of Andhra Pradesh. Archived from the original on 2016-08-07. Retrieved 2020-07-10.
- ↑ "Rayadurg Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-10.
- ↑ 3.0 3.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.