రేణిగుంట

ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా, రేణిగుంట మండల జనగణన పట్టణం

రేణిగుంట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా, రేణిగుంట మండలానికి చెందిన జనగణన పట్టణం.[2] ఇది తిరుపతి నగర పరిసర ప్రాంతం. తిరుపతి పట్టణ సమ్మేళనంలో ఒక భాగం.[1] ఇక్కడ విమానాశ్రయం ఉంది.ఇది ఇది తిరుపతి జిల్లాలోని రేణిగుంట మండలానికి మండల కేంద్రం.[3] ఇది తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికార పరిమితిలో కిందకు వస్తుంది.[4]

రేణిగుంట
తిరుపతి పరిసర ప్రాంతం
రేణిగుంట రైల్వే జంక్షన్
రేణిగుంట రైల్వే జంక్షన్
రేణిగుంట is located in ఆంధ్రప్రదేశ్
రేణిగుంట
రేణిగుంట
ఆంధ్రప్రదేశ్ పటంలో రేణిగుంట స్థానం
Coordinates: 13°39′N 79°31′E / 13.65°N 79.52°E / 13.65; 79.52
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి
Elevation
107 మీ (351 అ.)
జనాభా
 (2011)[1]
 • Total26,031
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
517520
ప్రాంతీయ ఫోన్‌కోడ్+91
Vehicle registrationAP–03

జనాభా గణాంకాలు

మార్చు

రేణిగుంట, చిత్తూరు జిల్లా, రేణిగుంట మండలంలో ఉన్న ఒక జనాభా లెక్కల పట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం రేణిగుంట నగరంలో మొత్తం 6,667 కుటుంబాలు నివసిస్తున్నాయి. రేణిగుంట మొత్తం జనాభా 26,031 అందులో పురుషులు 12,995, స్త్రీలు 13,036, సగటు లింగ నిష్పత్తి 1,003.[5]

రవాణా సౌకర్యాలు

మార్చు

ఇది జాతీయ, రాష్ట్ర రహదారులకు అనుసంధానం కలిగి ఉంది. కడప చెన్నై జాతీయ రహదారి ఎన్ఎచ్ 716 తిరుపతిని తమిళనాడులోని చెన్నైతో కలుపుతుంది. మదనపల్లిని నాయుడుపేటతో కలిపే జాతీయ రహదారి 71 ఈ పట్టణం గుండా వెళుతుంది.[6] B ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. ద్వారా నిర్వహించబడే బస్సు సేవలు ప్రజలకు స్థానిక రవాణాను అందిస్తాయి. రేణిగుంట రైల్వే జంక్షన్ చెన్నై-బెంగళూరు లైన్, ముంబై-చెన్నై లైన్‌లోని గుంతకల్-చెన్నై ఎగ్మోర్ సెక్షన్‌ను కలిపే ప్రధాన జంక్షన్‌లలో ఒకటి. ఇది హౌరా-చెన్నై ప్రధాన లైన్‌లోని విజయవాడ-చెన్నై లైన్‌లో గూడూరుకు అనుసంధానించబడి ఉంది.[7] తిరుపతి విమానాశ్రయం తిరుపతి ప్రయాణీకులకు సేవలు అందిస్తుంది.[8]

పరిశ్రమలు

మార్చు
  • అమరరాజా బ్యాటరీ
  • ఇ.సి.ఐ.ఎల్. ఫ్యాక్టరీ
  • చక్కెర కర్మాగారం
  • విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్
  • రైల్వే క్యారేజి షాప్

చిత్రమాలిక

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Census of India Search details". censusindia.gov.in. Retrieved 10 May 2015.
  2. "Villages and Towns in Renigunta Mandal of Chittoor, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-11. Retrieved 2022-10-11.
  3. "Chittoor District Mandals" (PDF). Census of India. pp. 452, 510. Retrieved 19 June 2015.
  4. "TUDA Right to Information Act, 2005". TUDA. Archived from the original on 14 జూన్ 2015. Retrieved 19 జూన్ 2015.
  5. "Renigunta Population, Caste Data Chittoor Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-11. Retrieved 2022-10-11.
  6. "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 March 2016. Retrieved 11 February 2016.
  7. "Renigunta station map". India Rail Info. Retrieved 24 February 2015.
  8. "Traffic Statistics – International Passengers" (PDF). Airports Authority of India. Ministry of Civil Aviation, Government of India. Archived from the original (PDF) on 6 June 2014. Retrieved 24 February 2015.

బయటి లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wiki.x.io/w/index.php?title=రేణిగుంట&oldid=3885465" నుండి వెలికితీశారు