ఉపన్యాసం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఉపన్యాసంను ఆంగ్లంలో లెక్చర్ అంటారు. విద్యను నోటి ద్వారా బోధించడాన్నే ఉపన్యాసం అంటారు. ఒక ప్రత్యేకమైన విషయాన్ని లేక సమాచారాన్ని నోటితో బోధించడానికి లేక ప్రదర్శించడానికి ఉద్దేశించబడిన విద్యే ఉపన్యాసం. ఉదాహరణకు కళాశాల లేదా విశ్వవిద్యాలయం యొక్క ఉపాధ్యాయులు విద్యార్థులకు నోటి ద్వారా విద్యను బోధించడం. ఉపన్యాసం ఇచ్చే వ్యక్తిని ఉపన్యాసకుడు అంటారు. ఉపన్యాసకుడిని ఆంగ్లంలో లెక్చరర్ అంటారు. చరిత్ర, నేపథ్యం, సిద్ధాంతాలు, సమీకరణాలు వంటి క్లిష్టమైన సమాచారాన్ని తెలియజేయడానికి ఉపన్యాసాలను ఉపయోగిస్తారు. సాధారణంగా విద్యాగదిలో లెక్చరర్ ఉపన్యాసం ఇచ్చేటప్పుడు విద్యార్థులందరికి కనపడే విధంగా వారందరికి ముందువైపున నిలబడి ఉపన్యాసమిస్తాడు.
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/8/86/Mathematics_lecture_at_the_Helsinki_University_of_Technology.jpg/220px-Mathematics_lecture_at_the_Helsinki_University_of_Technology.jpg)
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/8/8f/Stats_lec.jpg/220px-Stats_lec.jpg)
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/f/fc/Laurentius_de_Voltolina_001.jpg/220px-Laurentius_de_Voltolina_001.jpg)
రాజకీయ ఉపన్యాసాలు
మార్చురాజకీయ ఉపన్యాసకుడిని రాజకీయనాయకుడు అంటారు. ఇతను తమ పార్టీ బలోపేతానికి కార్యకర్తలకు ఉపన్యాసమిస్తాడు.
వ్యాపార ఉపన్యాసాలు
మార్చువ్యాపార ఉపన్యాసకుడిని వ్యాపారవేత్త అంటారు. ఇతను తన సంస్థలో తయారైన వస్తువులను అమ్ముకుని తను లాభపడటానికి తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉపన్యాసాలిస్తాడు.
సుత్తికొట్టడం
మార్చుఅవసరమైన ఉపన్యాసం ఇచ్చేటప్పుడు అనవసరమైన, సందర్భానికి సంబంధం లేని మితిమీరిన ఉపన్యాసాన్ని సుత్తికొట్టడం అంటారు. సుత్తిలేని ఉపన్యాసాలు ఇంపుగా ఉండవు, అందుకే బోరు కొట్టకుండా పిట్టకథలు, చమత్కారాలతో సుత్తికొడతారు. సుత్తి అనే పదం స్తుతి పదం నుంచి ఉద్భవింవించింది. స్తుతించడం అనగా ప్రార్థించడం అని అర్ధం.