లెసోతో
లెసోతో రాజ్యం [5] అధికారికంగా " కింగ్డం ఆఫ్ లెసోతో " అని పిలువబడుతుంది. దక్షిణాఫ్రికాలో సరిహద్దులో ఒక భూపరివేష్టిత దేశం. దేశ వైశాల్యం 30,000 చ.కి.మీ. జనాభా సుమారు 20 లక్షలు. దీని రాజధాని అతిపెద్ద నగరం మసేరు.
Kingdom of Lesotho 'Muso oa Lesotho (Sesotho) | |
---|---|
గీతం: | |
Location of లెసోతో (dark blue) – in Africa (light blue & dark grey) | |
రాజధాని and largest city | Maseru 29°28′S 27°56′E / 29.467°S 27.933°E |
అధికార భాషలు | |
జాతులు |
|
పిలుచువిధం |
|
ప్రభుత్వం | Unitary parliamentary constitutional monarchy |
• Monarch | Letsie III |
• Prime Minister | Tom Thabane |
• Deputy prime minister | Monyane Moleleki |
• Assembly Speaker | Sephiri Motanyane |
శాసనవ్యవస్థ | Parliament |
• ఎగువ సభ | Senate |
• దిగువ సభ | National Assembly |
Independence | |
• from the United Kingdom | 4 October 1966 |
విస్తీర్ణం | |
• మొత్తం | 30,355 కి.మీ2 (11,720 చ. మై.) (137th) |
• నీరు (%) | 0.0032% |
జనాభా | |
• 2016 estimate | 2,203,821[1] (144th) |
• 2004 census | 2,031,348 |
• జనసాంద్రత | 68.1/చ.కి. (176.4/చ.మై.) (138th) |
GDP (PPP) | 2017 estimate |
• Total | $7.448 billion[2] |
• Per capita | $3,868[2] |
GDP (nominal) | 2017 estimate |
• Total | $2.721 billion[2] |
• Per capita | $1,413[2] |
జినీ (2015) | 54.2[3] high · 17 |
హెచ్‌డిఐ (2018) | 0.515[4] low · 160th |
ద్రవ్యం | Lesotho loti (LSL), South African rand (ZAR) |
కాల విభాగం | UTC+2 (South African Standard Time) |
వాహనాలు నడుపు వైపు | left |
ఫోన్ కోడ్ | +266 |
ISO 3166 code | LS |
Internet TLD | .ls |
Estimates for this country explicitly take into account the effects of excess mortality due to AIDS; this can result in lower life expectancy, higher infant mortality and death rates, lower population and growth rates, and changes in the distribution of population by age and sex than would otherwise be expected. |
లెసోతో గతంలో బసుతోలాండుకు చెందిన బ్రిటిషు వలస రాజ్యంగా ఉండేది. కాని ఇది యునైటెడ్ కింగ్డం నుండి 1966 అక్టోబరు 4 న స్వాతంత్ర్యం ప్రకటించింది. ఇది ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి, కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్, దక్షిణాఫ్రికా డెవలప్మెంట్ కమ్యూనిటీ సభ్యదేశంగా ఉంది. లెసోతో అనే పేరుకు "సెసోతో మాట్లాడే ప్రజల భూమి" అని అర్ధం.[6][7]
చరిత్ర
మార్చుThe original inhabitants of the area now known as Lesotho were the San people. Examples of their rock art can be found in the mountains throughout the area.[8]
మొదటి మొషోషూ పాలన (1822–1868)
మార్చుగతంలో బసుటోలాండ్ అని పిలువబడిన ప్రస్తుత లెసోతో 1822 లో కింగ్ మొదటి మోషోషూ ఆధ్వర్యంలో ఒక రాజ్యంగా ఉద్భవించింది. మోకోచనే కుమారుడు మొషోషూ బకోటెటి వంశానికి చెందిన ఒక చిన్న నాయకుడు. ఆయన స్వంత వంశాన్ని స్థాపించి 1804 లో ప్రధాన అధికార అయ్యాడు. 1821 - 1823 మధ్యకాలంలో ఆయన, ఆయన అనుచరులతో బుద్ధా-బుతే పర్వతం వద్ద స్థిరపడ్డాడు. 1818 నుండి 1828 వరకు షాకా జ్యూలతో సంబంధం కలిగి ఉన్న లైఫాక్నేకు వ్యతిరేకిస్తూ మాజీ ప్రత్యర్థులతో చేయికలిపాడు.
1795 లో ఫ్రెంచ్-మిత్రరాజ్యాలు డచ్చి నుండి కేప్ కాలనీ స్వాధీనం చేసుకున్న తరువాత బ్రిటీషు, డచ్చి వలసవాదులు కేప్ కాలనీని వదిలి వెళ్ళారు. తరువాత ఆరెంజ్ సార్వభౌమ, ఆరంజ్ ఫ్రీ స్టేట్ లతో అనుబంధం ఏర్పడిన నేపథ్యంలో బ్రిటీషు, డచ్చి వలసవాదుల మధ్య విభేదాలు తలెత్తాయి. మొదటి మోషోషూ పారిస్ ఎవాంజెలికల్ మిషనరీ సొసైటీ నుంచి, థామస్ అర్బూసెట్సెట్, యుగెయిన్ కాసాలిసు, కాన్‌స్టాంటు గోసెల్లిన్లను ఆహ్వానించాడు. వారు 1837 - 1855 మధ్య కాలంలో సెసోతో భాషలో లేఖిత, ముద్రిత రచనలను అభివృద్ధి చేశారు. కాసాలీలు అనువాదకునిగా వ్యవహరిస్తూ విదేశీ వ్యవహారాలపై సలహాలు అందించారు. దౌత్య కార్యాలయాల ఏర్పాటు చేయబడి, తుపాకులు కొనుగోలుతో యూరోపియన్లు గ్రిగుయా ప్రజలు వ్యతిరేకంగా దాడులు సాగించారు.
కేప్ కాలనీకి చెందిన ట్రెక్బోయర్లు బసుటోలాండు పశ్చిమ సరిహద్దులకి చేరుకుని భూ-హక్కులను ప్రకటించారు. మే-1838 జూన్ మే- జూన్‌లలో మాట్లకేంగ్ ప్రాంతంలో స్థిరపడిన జాన్ డి విన్నరుతో సంబంధం ఏర్పరచుకున్నారు. బోయర్లు ఈ ప్రాంతంలోకి వలస వెళ్ళి కాలెడానుకు ఉత్తరాన ఉన్న రెండు నదులు మద్య స్థావరం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించారు. తరువాత మోషోషూ కేప్ కాలనీ గవర్నరు సర్ జార్జ్ థామస్ నేపియర్ (బ్రిటీష్ గవర్నరు) ఒక ఒప్పందంపై సంతకం చేశాడు. తరువాత బ్రిటిషువారు బోయర్లు స్థిరపడిన ఆరెంజ్ నది సార్వభౌమ ప్రాంతాన్ని విలీనం చేసుకున్నారు. ఆగ్రహించిన బోయర్లు 1848 లో క్లుప్తమైన వాగ్వివాదంతో అణిచివేయబడ్డారు. 1851 లో కోలినమామాలోని బసొతోమా సైన్యం బ్రిటిష్ సైన్యాన్ని ఓడించింది. 1852 లో మరొక బ్రిటీషు దాడిని తిప్పికొట్టిన తరువాత మోషొషూ బ్రిటిషు కమాండరుకు విఙప్తి చేసి చర్చలద్వారా వివాదాలను పరిష్కరించాడు. 1853 లో బాట్లోకోకాను ఓడించాడు. 1854 లో ఈ ప్రాంతం నుండి బ్రిటీషు వైదొలిగింది. 1858 లో మోషోషూ " ఫ్రీ స్టేట్-బసాతో వార్ " పేరుతో బోయర్లతో వరుస యుద్ధాలు చేసి పశ్చిమ లోతట్టు ప్రాంతాలలో అధిక భాగం వదులుకున్నాడు. 1867 లో చివరి యుద్ధంలో మోషాషూ విక్టోరియా రాణికి విజ్ఞప్తి చేసిన తరువాత యుద్ధం ముగింపుకు వచ్చింది. 1868 లో మొషాషూ బసుటోలాండును బ్రిటీషు ప్రొటెక్టరేటు చేయడానికి అంగీకరించాడు.
బ్రిటిషు పాలన (1868–1966)
మార్చు1869 లో బ్రిటీషు బోయర్సుతో " ఆలివాల్ నార్తు " ఒప్పందంలో సంతకం చేసిన తరువాత బ్యూరోలండు సరిహద్దులను నిర్ణయించబడ్డాయి. తరువాత లెసోతోను పశ్చిమ దేశాలకు వదులుకొని, మోషాషూ సామ్రాజ్యం పూర్వ పరిమాణంలో సగానికి తగ్గించాడు.
1869 లో జరిగిన సెషన్ తరువాత 1871 లో బసుటోలాండును కేప్ కాలనీకి బదిలీ చేసే వరకు మొషాషూ తాబే బోసియాను రాజధానిగానూ మాసేరులో ఒక పోలీసు శిబిరం ఉండేది. మోషోషూ 1870 మార్చి 11 న మరణించడంతో సాంప్రదాయ యుగానికి ముగింపు జరిగి కాలనీల శకం ప్రారంభం అయింది. ఆయన థాబా బోసియులో సమాధి చేయబడ్డాడు. 1871 - 1884 ల మధ్య బ్రిటీషు పాలన ప్రారంభ సంవత్సరాలలో బలవంతంగా స్వాధీనం చేసుకున్న ఇతర భూభాగాల మాదిరిగా బసుతోలాండు భావించబడింది.[9] 1881 లో ఇది " గన్ యుద్ధం "కు దారితీసింది.[10]
1884 లో బసుటోలాండును ప్రొటొరాటేట్గా పునరుద్ధరించింది. మసేరు తిరిగి రాజధానిగా మారింది. తరువాత ఇది గవర్నరు ప్రత్యక్ష పాలనలో కొనసాగింది. అయితే స్థానిక నాయకులు సమర్థవంతమైన అంతర్గత శక్తిని సంపాదించారు.
స్వతంత్రం (1966–ప్రస్తుతం)
మార్చు1966 లో బసుటోలాండు బ్రిటను నుండి స్వాతంత్ర్యం పొంది లెసోతో రాజ్యంగా మారింది.[11]
1970 జనవరిలో స్వాతంత్ర్యం పొందిన తరువాత నిర్వహించబడిన మొదటి ఎన్నికలను పాలక బసాతో నేషనల్ పార్టీ ఓడిపోయింది. బసాతో నేషనల్ పార్టీ 23 స్థానాలలో విజయం సాధించగా బసుటొలాండ్ కాంగ్రెసు పార్టీకి 36 స్థానాలు దక్కాయి. ప్రధాన మంత్రి లెబూవా జోనాథన్ బస్సోతో కాంగ్రెస్ పార్టీకు అధికారాన్ని ఇవ్వటానికి నిరాకరించాడు. టోనా ఖోలో (సెసోతో భాషలో ప్రధాన మంత్రి అని అర్ధం) బస్సోతో కాంగ్రెస్ పార్టీ నాయకులను బంధించాడు.
BCP ఒక తిరుగుబాటు ప్రారంభించి తన " లిసోతో లిబరేషన్ ఆర్మీ " సైనికులు పాన్ ఆఫ్రికన్ కాంగ్రెస్ సైనికులకు " ఆజానియా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ " సైనికులుగా నటిస్తూ లిబియాలో శిక్షణ పొందారు. 1978 లో పిఎసికి చెందిన సిబ్బోకో వర్గంచే ఆయుధాలను, సరఫరాను కోల్పోయి, 178- మంది లెసొతో లిబరేషన్ ఆర్మీ మావోయిస్ట్ పాన్ ఆఫ్రికన్ కాంగ్రెసు అధికారి ఆర్థిక సహకారంతో టాంజానియా స్థావరం నుండి విడుదల చేయబడ్డారు. కానీ అవి కొద్దిపాటి పాత ఆయుధాలతో గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించాయి. ఉత్తర లెసోతోలో ప్రధాన బలం ఓడిపోయింది. తరువాత గెరిల్లాలు అప్పుడప్పుడు చేసిన దాడులు వ్యర్థమైన దాడులుగా మారాయి. బి.సి.పి. నాయకుడు త్సు మొఖెలె ప్రోటోరియాకు వెళ్ళినప్పుడు పోరాటం తీవ్రంగా రాజీ పడింది. 1980 ల ప్రారంభంలో బహిష్కరించబడిన బి.సి.పి నాయకులపట్ల సానుభూతి ప్రకటించన అనేక బసోథాలకు లీబుయా జొనాథన్ ప్రభుత్వం నుండి బెదిరింపులకు గురైయ్యారు. 1981 సెప్టెంబరు 4 న, బెంజమిన్ మాసిలో కుటుంబం దాడికి గురైంది. దాడిలో అతని 3 సంవత్సరాల మనవడు తన జీవితాన్ని కోల్పోయాడు. సరిగ్గా నాలుగు రోజుల తరువాత ప్రముఖ వార్తాపత్రిక " లెస్లినినా ల లెసోతో " సంపాదకుడు ఎడ్గార్ మహ్మోమోలా మోట్టూబాను ఇద్దరు మిత్రులతో ఆయన ఇంటి నుండి అపహరించి హత్య చేశారు.
1966 నుండి 1970 జనవరి వరకూ బి.ఎన్.పి. పాలించింది. తరువాత డాక్టర్ లీబావా జోనాథన్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం 1986 వరకు కొనసాగింది. తరువాత డాక్టర్ లీబావా జోనాథన్ ప్రభుత్వాన్ని నియంత పాలనగా పేర్కొంటూ ఒక సైనిక తిరుగుబాటు ద్వారా కార్యాలయం నుండి తొలగించబడింది. అధికారంలోకి వచ్చిన మద్యకాల మిలిటరీ కౌన్సిలు రాజు రెండవ మోషొషూ అధికారాలను మంజూరు చేసింది. ఇతను ఒక ఉత్సవ చక్రవర్తిగా ఉన్నాడు. 1987 లో లెసోతో రాజ్యాంగం ఆరు-పేజీల మెమోరాండంతో రాజు బహిష్కరించబడ్డాడు. సైనిక అధికారాన్ని అంగీకరించిన అతని అధిక కార్యనిర్వహణ అధికారాలను ఇచ్చేవాడు. అతని కుమారుడు మూడవ లెట్సీ రాజుగా నియమించబడ్డాడు.
1991 లో సైనిక ప్రభుత్వ చైర్మన్ మేజర్ జనరల్ జస్టిన్ మెట్టింగ్ లిఖేన్య తొలగించబడి ఆయన స్థానంలో జనరల్ ఎలియాస్ ఫిసోవానా రామేమా నియమించబడ్డాడు. 1993 లో ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించబడిన ఎన్నికైన బి.సి.పి. ప్రభుత్వానికి అధికారం అప్పగించబడింది. 1992 లో రెండవ మోషెషూ బహిష్కరణ నుండి సాధారణ పౌరుడుగా తిరిగి వచ్చాడు. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజు మూడవ లెట్సీ తన తండ్రి (రెండవ మోషోషూ)ను అధిపతిగా పునఃస్థాపించడానికి బి.సి.పి. ప్రభుత్వాన్ని ఒప్పించడానిక్ విఫలయత్నం చేశాడు.
1994 ఆగస్టులో రాజ్యాంగం ఆధారంగా బి.సి.పి. ప్రభుత్వం అతని తండ్రి రెండవ మోషొషును బహిష్కరించిన తరువాత మూడవ లెసియో బి.సి.పి. ప్రభుత్వమును తొలగించడానిక్ ఒక సైనిక- తిరుగుబాటును నిర్వహించింది. కొత్త ప్రభుత్వం పూర్తి అంతర్జాతీయ గుర్తింపు పొందలేదు. సదరన్ ఆఫ్రికన్ డెవెలప్మెంట్ కమ్యూనిటీ సభ్య దేశాలు బి.సి.పి ప్రభుత్వాన్ని పునఃస్థాపించేందుకు చర్చలు చేపట్టాయి. దీర్ఘకాల చర్చల తరువాత మూడవ లెఫ్సీ తండ్రి తిరిగి అధిపతిగా నియమించే షరతుతో బి.సి.పి. ప్రభుత్వం పునఃస్థాపించబడింది. 1995 లో తన తండ్రికి అనుకూలంగా మూడవ లెస్సీ పదవి నుండి తొలగించబడ్డాడు. 1996 జనవరి 15 రెండవ మోషోషూ యాభై-ఏడు సంవత్సరాల వయస్సులో పర్వతమార్గంలో ప్రయాణించే సమయంలో కారుప్రమాదంలో మరణించిన తరువాత మూడవ లెప్సీ తిరిగి సింహాసనాన్ని అధిరోహించాడు. ప్రభుత్వ ప్రకటన ఆధారంగా మాషిషూ మాట్సెంగులో ఉన్న పశువులను సందర్శించడానికి మద్యాహ్నం 1 గంటకు బయలుదేరి మాతూటి పర్వతాల ద్వారా మాసెటికి తిరిగి వెళుతుండగా అతని కారు పర్వత మార్గం నుండి పతనం అయింది.[12]
1997 లో బి.సి.పి. ప్రభుత్వ నాయకత్వం వివాదాలలో విడిపోయింది. ప్రధానమంత్రి నట్సు మొఖేలే " లెసోతో కాంగ్రెస్ ఫర్ డెమొక్రసీ " పేరుతో ఒక పార్టీని స్థాపించాడు. తరువాత ఆయన పార్లమెంటు సభ్యుల మెజారిటీతో ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరుచుకున్నాడు. 1998 లో ఎన్నికలలో పార్టీ నాయకుడిగా పాకిలాత మోసిసిలీ విజయం సాధించాడు. స్థానిక అంతర్జాతీయ పరిశీలకులు ఎన్నికలను స్వేచ్ఛాయుతమైనవిగాను న్యాయమైనవిగానూ ప్రకటించారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఫలితాలు తిరస్కరించాయి.
దేశంలో ప్రతిపక్ష నిరసనలు తీవ్రమైయ్యాయి. 1998 ఆగస్టులో రాయల్ ప్యాలెస్ వెలుపల శాంతియుతమైన ప్రదర్శనతో నిరసనలు ముగిసాయి. తరువాత జరిగిన సంఘటనలు దక్షిణ ఆఫ్రికాలో వివాదాస్పదంగా మారాయి. సౌత్ ఆఫ్రికన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ దళాలతో ఉద్రిక్తతలు అధికమై పోరాటం మొదలైంది. దక్షిణాఫ్రికా దళాలు రాజభవనం మీద దక్షిణాఫ్రికా పతాకాన్ని ఎగురవేసినప్పుడు అల్లర్ల తీవ్రత తీవ్రమైంది. 1999 మే మేలో ఎస్.ఎ.డి.సి. దళాలు ఉపసంహరించే సమయానికి రాజధాని మసేరు చాలా భాగం శిథిలమైంది. మాఫిటెంగు, మొహలే హోయెక్, దక్షిణ ప్రావిన్సు పట్టణాలు వారి రియల్ ఎస్టేట్ వాణిజ్యంలో మూడో వంతు నష్టం సంభవించింది. యుద్ధంలో అనేక మంది దక్షిణాఫ్రికా, బసోతో పౌరులు కూడా మరణించారు.
1998 డిసెంబరులో దేశంలో ఎన్నికల నిర్మాణాన్ని సమీక్షించేందుకు తాత్కాలిక రాజకీయ అథారిటీ ఏర్పాటు చేయబడింది. జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రాతినిధ్యం వహించాలని ఐ.పి.ఎ. ఎన్నికల వ్యవస్థను రూపొందించింది. కొత్త వ్యవస్థ ఇప్పటికే 80 ఎన్నికైన అసెంబ్లీ సీట్లను నిలుపుకుంది 40 సీట్లకు నియామకాలతో నింపింది. 2002 మేలో ఈ కొత్త వ్యవస్థలో నిర్వహించబడిన ఎన్నికలలో ఎల్.సి.డి. 54% ఓట్లతో తిరిగి విజయం సాధించింది. కానీ మొదటి సారిగా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు గణనీయమైన సంఖ్యలో స్థానాలను గెలుచుకున్నాయి. మేజర్ జనరల్ లేఖేన్య నుండి హింస, అక్రమాలు, బెదిరింపులు ఉన్నప్పటికీ లెసోతో మొట్టమొదటి శాంతియుత ఎన్నికలను ఎదుర్కొంది. తొమ్మిది ప్రతిపక్ష పార్టీలకు ప్రస్తుతం మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. బి.ఎన్.పి. వీటిలో అతిపెద్ద వాటా (21) కలిగి ఉంది. ఎల్.సి.డి 80 నియోజకవర్గ-స్థానాల్లో 79 స్థానాలు సాధించింది. దాని ఎన్నికైన సభ్యులు జాతీయ అసెంబ్లీలో పాల్గొన్నప్పటికీ, బి.ఎన్.పి. ఎన్నికలపరంగా అనేక చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొన్నది. అవి ఏవీ విజయవంతం కాలేదు.
2014 ఆగస్టు 30 న సైనిక "తిరుగుబాటు" జరిగింది. అప్పటి ప్రధాన మంత్రి థామస్ తబనే మూడు రోజుల పాటు దక్షిణాఫ్రికాకు పారిపోవడానికి ఇది కారణమైంది.[13][14]
భౌగోళికం
మార్చులెసోతో కవర్స్ 30,355 చ.కిమీ (11,720 చ.మై). ప్రపంచంలోని 1000 మీటర్ల (3,281 అడుగులు) ఎత్తులో ఉన్న ఏకైక స్వతంత్ర దేశంగా ఉంది. దాని దిగువ ప్రాంతం 1,400 మీటర్లు (4,593 అడుగులు) ఈ విధంగా ప్రపంచంలోనే అత్యధికం. 80% పైగా దేశంలో 1,800 మీటర్లు (5,906 అడుగులు) పైన ఉంది. లెసొతొ ప్రపంచంలోనే అత్యంత దక్షిణప్రాంత భూబంధితదేశంగా ఉంది. ఇది 28 ° నుండి 31 ° దక్షిణ అక్షాంశం, 27 ° నుండి 30 ° తూర్పు రేఖామ్శంలో ఉంది.
వాతావరణం
మార్చుదాని ఎత్తులో కారణంగా లెసోతో అదే ప్రాంతాల్లోని ఇతర ప్రాంతాల కంటే ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది. ఉరుములతో కూడి వర్షం చాలా అధికంగా ఉంటుంది. వేసవిలో మసెరు, చుట్టుపక్కల ఉన్న లోతట్టు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 30 ° సెంటీగ్రేడు (86 ° ఫారెన్ హీటు) కు చేరుకుంటాయి. చలికాలంలో ఉష్ణోగ్రతలు -7 ° సెంటీగ్రేడు (19 ° ఫారెన్ హీటు) ఉంటుంది. ఎత్తైన ప్రదేశాలలో -18 ° సెంటీగ్రేడు (0 ° ఫారెన్ హీటు) వరకు చల్లగా ఉంటుంది. మే నుండి సెప్టెంబరు మధ్య ఉన్నతస్థాయిలలో మంచు సాధారణంగా ఉంటుంది. శిఖరాల అధికంగా ఏడాది పొడవునా మంచుఘనీభవించి ఉంటుంది.
వన్యజీవితం
మార్చులెసోతోలో 339 పక్షి జాతులు ఉన్నాయి. వాటిలో 10 అంతరించిపోతున్న జాతులు, 2 కొత్తగా ప్రవేశపెట్టిన జాతులు, 17 సరీసృప జాతులు, (జిక్కోలతో కలిసి) పాములు, బల్లులు, లెసోతోకు చెందిన 60 క్షీరద జాతులు (అంతరించిపోతున్న తెల్ల తోక ఎలుకతో సహా) ఉన్నాయి.
ఎత్తైన పర్వత ప్రాంతాల కారణంగా, లెసోతో ఫ్లోరా ఆల్పైన్. కాటీస్ బొటానికల్ గార్డెన్లలో ఔషధ మొక్కల సమీకరణ ఉంది. మాలిబామత్సో నది ప్రాంతంలో విత్తన మొక్కలు ఉన్నాయి.[15][16]
ఆర్ధికం
మార్చులెసోతో భౌగోళికంగా దక్షిణాఫ్రికా మద్యలో ఉండి ఆర్థికంగా దానితో అనుసంధానం చేయబడింది. లెసోతో ఆర్థికవ్యవస్థ వ్యవసాయం, పశువుల పెంపకం, వస్తు తయారీ, మైనింగ్ మీద ఆధారపడింది. సదరన్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్ (SACU) చెల్లింపులు, కార్మికుల ద్వారా దేశంలోకి వస్తున్న ఆదాయవనరులపై అధికంగా ఆధారపడి ఉంటుంది.[17][18] ఎక్కువ మంది గృహావసారలకు స్వంత వ్యవసాయ తోటల మీద ఆధారపడతారు. మహిళా ఉద్యోగులు దుస్తులతయారీ రంగంలో, మగవారు వలస కార్మికులుగా మూడు నుంచి తొమ్మిది నెలలు దక్షిణాఫ్రికాలో గనులలో పనిచేస్తుంటారు. కొంతమంది లెసోతో ప్రభుత్వం ఉపాధిని కలిగి ఉన్నారు. పశ్చిమ లోతట్టులు ప్రధాన వ్యవసాయ క్షేత్రాలను ఏర్పరుస్తాయి. దాదాపు 50 % జనాభా వ్యవసాయరంగం, పెంపుడు జంతువుల ద్వారా ఆదాయం పొందుతున్నారు. దేశ ఆదాయంలో సుమారు మూడింట రెండు వంతుల పంట సాగు, పశువుల పెంపకం ద్వారా లభిస్తుంది. తలసరి కొనుగోలు శక్తి 1.25 అమెరికా డాలర్లు.[17] లెసొతొ "లో హ్యూమనిటీ డెవెలెప్మెంటు " దేశాలలో ఒకటిగా ఉంది. యు.ఎన్.డి.పి. వర్గీకరించిన మానవ అభివృద్ధి సూచిక 187 దేశాలలో 160 స్థానంలో ఉంది. ఆయుఃప్రమాణం 48.2 సంవత్సరాలు ఉంది.[19] వయోజన అక్షరాస్యత 82 % ఉంది. ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో 20 % తక్కువ బరువు కలిగి ఉన్నారు.[20]
ఆఫ్రికన్ గ్రోత్ అండ్ ఆపర్చ్యునిటి యాక్టు ఆధారంగా లెసొతొ ఉప-సహారా ఆఫ్రికా నుండి యు.ఎస్.కు అతిపెద్ద దుస్తుల ఎగుమతిదారుగా మారింది.[21] లెసోతోకు చెందిన యు.ఎస్. బ్రాండ్లు, చిల్లర వ్యాపార సంస్థలలో ఫుట్ లాకర్, గ్యాప్, గ్లోరియా వాండర్బిల్ట్, JC పెన్నీ, లేవి స్ట్రౌస్, సాక్స్, సియర్స్, టింబెర్లాండ్, వాల్ మార్టు ప్రాధాన్యత వహిస్తున్నాయి.[22] 2004 మధ్యలో దుస్తుల తయారీ రంగంలో సిబ్బంధిసంఖ్య 50,000 కు చేరుకుంది. దుస్తుల తయారీ రంగంలో ప్రధానంగా మహిళా కార్మికులు అత్యధికసంఖ్యలో ఉన్నట్లు ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను మొదటిసారి గుర్తించారు. 2008 లో ఇది ప్రధానంగా యు.ఎస్.కు 487 మిలియన్ డాలర్ల విలువైన దుస్తులను ఎగుమతి చేసింది. 2004 నుండి వస్త్ర రంగంలో అంతర్జాతీయ పోటీ కారణంగా 2011 మధ్యలో 45,000 మందికి ఉపాధి అవకాశాలు క్షీణించాయి. ఇది 2011 లో లెసోతోలో అతిపెద్ద ఉపాధి కల్పన రంగంగా గుర్తించబడుతుంది.[23] 2007 లో టెక్స్టైల్ రంగంలో ఒక ఉద్యోగి సగటు ఆదాయాలు నెలకు $ 103 అమెరికా డాలర్లు ఉంది. సాధారణ వస్త్ర కార్మికులకు అధికారిక కనీస వేతనం నెలకు $ 93 అమెరికా డాలర్లు ఉంటుంది. 2008 లో తలసరి సగటు స్థూల జాతీయ ఆదాయం నెలకి $ 83 అమెరికా డాలర్లు ఉంది.[23] ఎయిడ్సుతో పోరాడటానికి లెసోతో కూటమి అన్న పేరుతో పోరాడటానికి ఈ రంగం ఒక ప్రధాన కార్యక్రమాన్ని ప్రారంభించింది. కార్మికులకు నివారణ చికిత్స అందించే విస్తృత కార్యక్రమం చేపట్టింది.[24]
లెసోతో నీరు, వజ్రాలు ముఖ్యమైన సహజ వనరులుగా ఉన్నాయి.[17] లెసోతో హైలాండ్స్ డెవలప్మెంట్ అథారిటీ అధికారంలో 21-ఏళ్ళ, మల్టీబిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించబడిన " లెసోతో హైలాండ్స్ వాటర్ ప్రాజెక్టు " దేశావసరాలకు నీరు అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ 1986 లో ప్రారంభమైంది.[25] " లెసోతో హైలాండ్స్ వాటర్ ప్రాజెక్టు " ఆరెంజ్ నది వ్యవస్థ నుండి నీటిని దక్షిణాఫ్రికా ఫ్రీ స్టేటు, గ్రేటర్ జొహ్యానెస్బర్గ్ ప్రాంతానికి నీరు నిలువ చేయడానికి, బదిలీ చేయడానికి రూపొందించబడింది. ఇది దక్షిణ ఆఫ్రికా పరిశ్రమ, ప్రజలకు, వ్యవసాయం అవసరాల కొరకు నీరు అందిస్తూ సహకరిస్తుంది. ఈ ప్రాజెక్టు మొదటి దశలో విద్యుత్తు ఉత్పత్తిలో దాదాపు పూర్తిగా స్వయం సమృద్ధి సాధించింది. 2010 లో దక్షిణాఫ్రికాకు విద్యుత్తు, నీటిని అమ్మడం ద్వారా దేశ ఆదాయానికి సుమారు 70 మిలియన్ డాలర్లు జమ చేసింది.[26] ప్రపంచ బ్యాంకు, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్, యూరోపియన్ ఇన్వెస్ట్మెంటు బ్యాంక్, అనేక ఇతర ద్వైపాక్షిక దాతలు ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చారు.
లెస్సెంగ్, మోథే, లిఖోబాంగ్, కావో గనులలో వజ్రాలు ఉత్పత్తి చేయబడ్డాయి. ఇవి సంయుక్తంగా $ 300 మిలియన్ల అమెరికన్ డాలర్ల విలువైన వజ్రాలు (2,40,000 క్యారెట్లు) ఉత్పత్తి చేస్తాయి. లెట్షెంగ్ గని సగటు US $ 2172 వజ్రాలు ఉత్పత్తి చేస్తుందని అంచనా వేయబడింది. దీనితో ఇది కారట్ ప్రాతిపదికన సగటు ధరపై ప్రపంచ సంపన్నమైన గనిగా మారింది.[27] 2008 లో ప్రపంచ ఆర్థిక మాంద్యం ఫలితంగా ఈ రంగం ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ 2010 - 2011 లో పుంజుకుంది. 2010-2011 నాటికి వజ్రాల ఎగుమతి 230 మిలియన్ డాలర్లకు చేరుకుంది.[28] 1957 లో దక్షిణాఫ్రికా సాహసికుడు కల్నల్ జాక్ స్కాట్, కీత్ విట్లోక్ అనే యువకుడుతో కలిసి వజ్రాల వృద్ధిని సాధించాడు. వారు ఈశాన్య లెసోతోలోని మాలుటి పర్వతాలపై 3,100 మీ ఎత్తులో వజ్రాల గనిని కనుగొన్నారు. వారు లెత్సంగులో మొఖోట్లాంగ్ నుండి 70 కిమీ దూరంలో ఉన్నారు. 1967 లో, ఒక మిస్సోతో మహిళ ద్వారా 601 క్యారెట్ (120.2 గ్రా) వజ్రం (లెసోతో బ్రౌన్) పర్వతాలలో కనుగొనబడింది. 2006 ఆగస్టు ఆగస్టులో, లెసొతొ ప్రామిస్ అనే ఒక 603-కారెట్ (120.6 గ్రా) తెల్ల వజ్రం లెటెంగ్-లా-టెరాయే గనిలో కనుగొనబడింది. 2008 లో మరో 478 క్యారెట్ (95.6 గ్రా) డైమండ్ అదే స్థానంలో కనుగొనబడింది.[29]
లెసోతో ప్రధాన జీవనాధార ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి తక్కువ మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థకు చేరుకోవడానికి సహజ వనరులను, ఉత్పాదక వస్తువులని ఎగుమతి చేయటానికి పురోగమించింది. ఎగుమతి రంగం ద్వారా జనాభాలో గణనీయమైన భాగానికి అధిక, మరింత సురక్షిత ఆదాయాలు లభించాయి.[17]
ప్రపంచ ఆర్థిక సంక్షోభం లెసోతో ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. యునైటెడ్ స్టేట్సు ఆర్థికమాంధ్యం ఫలితంతా లెసొతొ టెక్‌స్టైల్ ఎగుమతులలో సంభవించిన నష్టాలకారణంగా ఉద్యోగాలను కోల్పోవడం సంభవించింది. డైమండ్ మైనింగు, వజ్రాలు ధరలు బలహీనమవడం దక్షిణాఫ్రికా ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్యం ఏర్పడిన కారణంగా ఎస్.ఎ.సి.యు ఆదాయం పడిపోయింది. దక్షిణాఫ్రికా ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం, మైనింగ్ రంగం సంకోచం, దక్షిణాఫ్రికాలో సంబంధిత ఉద్యోగ నష్టాల కారణంగా కార్మికుల చెల్లింపులు తగ్గిపోయాయి. 2009 లో జి.డి.పి. పెరుగుదల 0.9 % మందగించింది.[17]
అధికారిక ద్రవ్యం లోతి (బహువచనం: మలోటి) దక్షిణాఫ్రికా ర్యాండుతో పరస్పరం మారవచ్చు. లెసోతో, స్వాజిలాండ్, నమీబియా, దక్షిణాఫ్రికా కూడా ఒకే కరెన్సీ ఏరియా (CMA) గా ఉంది. లోతి ర్యాండుతో సమానంగా ఉంటుంది. వంద లిసెంటేలు (ఏకవచనం: సెంటే) సమానమైన ఒక లోతికి సమానంగా ఉంటుంది.
లెసోతో సదరన్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్ (SACU) లో సభ్యదేశంగా ఉంది. దీనిలో ఇతర సభ్య దేశాలుగా బోత్సువానా, నమీబియా, సౌత్ ఆఫ్రికా, స్వాజిలాండ్ ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్, ప్రపంచ బ్యాంకు, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, యునైటెడ్ కింగ్డం, యూరోపియన్ యూనియన్, జర్మనీతో నుండి అనేక వనరుల నుండి లెసోతో ఆర్థిక సహాయం పొందింది.
జనసంఖ్య
మార్చుPopulation[1] | |||
---|---|---|---|
Year | Million | ||
1950 | 0.7 | ||
2000 | 1.8 | ||
2016 | 2.2 |
గణాంకాలు
మార్చులెసోతో జనసంఖ్య సుమారు 2,203,821 ఉంది.[1]. లెసోతో ప్రజలు 25% పట్టణప్రాంతాలలో 75% గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. పట్టణ జనసంఖ్య వార్షిక పెరుగుదల 3.5 % ఉందని అంచనా.[30] పశ్చిమ లోతట్టు ప్రాంతాల కంటే ఉన్నత ప్రాంతాలలో జనసాంద్రత తక్కువగా ఉంది. ప్రజలలో 15-65 మద్యవయస్కులు 60.2% ఉన్నారు. లెసోతో 34.8% యువత ఉంది.[30]
స్థానిక సమూహాలు, భాషలు
మార్చులెసొతో ప్రజలలో అధికంగా బంటూ భాషా వాడుకరులైన బసొతో ప్రజలు అధికంగా ఉన్నారు. బసొతో ప్రజలు దాదాపు 97% ఉన్నారు. బసతో మాట్లాడే ప్రజలలో దాదాపు పూర్తిగా ఉన్నాయి: ప్రజలు అంచనా వేసిన 99.7 శాతం బసోథోగా గుర్తించారు. బసొతో ఉపజాతులలో బఫోకెంగు (టోటెమ్: ఫోకా (డ్యూ), ముల్టా (హరె)), బట్లంగు (టోటెమ్:ట్లౌ (ఏనుగు)), బఫుంటి (టోటెం:ఫుంటి)), (బాకుయెనా (టోటెమ్: కయెన (మొసలి)), బటాంగ్ (టోటెమ్: టౌ (సింహం)), బత్సోయెంగ్ (టోటెమ్: టెస్యోనే), మటేబెలె.
ప్రధాన భాష సెసోథో కూడా మొదటి అధికారిక, పరిపాలనా భాషగా ఉంది. బసోథో ఒక ప్రజలందరికి వాడుక భాషగా ఉంది.
మతం
మార్చులెసోతో క్రైస్తవులు 95% అధికంగా ఉన్నట్లు అంచనా వేయబడింది.[31] ప్రొటెస్టంట్లు 50% (ఎవాంజలికాలు 17.5%, ఆంగ్లికన్లు 7.5%, పెంటెకోస్టులు 21.9%, ఇతర క్రైస్తవులు అదనంగా 8.5%) ఉన్నారు.[32] రోమన్ కాథలిక్కులు జనాభాలో దాదాపు 40% ఉన్నారు. మేసేరు మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్ ప్రావిన్సు, ఆయన ముగ్గురు శిష్యులు (లెరిబ్, మొహలే హోయెక్, కచాస్ నెక్ బిషప్లు) జాతీయ ఎపిస్కోపల్ సమావేశం ఏర్పాటు చేశారు. క్రైస్తవేతర మతాలు జనాభాలో 1.5% మాత్రమే ఉన్నారు. నాస్థికుల సంఖ్య 3.5% ఉంది.[32]
విద్య, అక్షరాశ్యత
మార్చు14 కంటే అధిక వయస్సు ఉన్న వారిలో 85% మంది అక్షరాస్యులు ఉన్నారని ఇటీవలి అంచనాలు తెలియజేస్తున్నాయి. అలాగే లెసోతో ఆఫ్రికాలో అత్యధిక అక్షరాస్యతా శాతం ఉన్న దేశాలలో ఒకటిగా ఉంది.[30] ఎందుకంటే లెసోతో తన జి.డి.పి.లో 12% విద్యాభివృద్ధికి వ్యయం చేస్తుంది.[33] ఇతర దేశాలలో వలె కాకుండా లెసోతో మహిళలలో అక్షరాస్యత (88.7%) పురుషుల అక్షరాస్యత (70.1%)కంటే 18.6% అధికంగా ఉంది. 2000 లో దక్షిణ, తూర్పు ఆఫ్రికా కన్సార్టియమ్ ఫర్ మానిటరింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిటీ అధ్యయనం ఆధారంగా లెసోతో (14 ఏళ్ల సగటు వయస్సు) లో ఉన్నత స్థాయి విద్యార్థులు 37% మంది నాలుగు లేదా అంతకంటే అధికమైన చదువు కొనసాగిస్తున్నారు.[34] ఈ స్థాయి అక్షరాస్యతలో విద్యార్థులు వివిధ విభాగాల ద్వారా ముందుకు సాగవచ్చు. విద్య నిర్బంధం కానప్పటికీ లెసోతో ప్రభుత్వం ఉచిత ప్రాథమిక విద్య కోసం ఒక కార్యక్రమాన్ని పెంపొందించుకుంటుంది.[35]
అక్షరాస్యత అధికంగా ఉన్నప్పటికీ లెసొతో నివాసులు ఆరోగ్య, ప్రయాణ, విద్యా వనరులు వంటి ముఖ్యమైన సేవలు అందుకోవడానికి పోరాడుతున్నారు. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఆధారంగా జనాభాలో 3.4% మాత్రమే ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. ఎకోనెట్ టెల్కాం లెసోతోలో ఒక ఆరంభ-స్థాయి, తక్కువ-స్థాయి మొబైల్ ఫోన్ల ద్వారా ఇమెయిల్ ప్రాప్యతను విస్తరించింది. తదనుగుణంగా విద్యా సమాచారాన్ని మెరుగుపరిచింది. ఆఫ్రికన్ లైబ్రరీ ప్రాజెక్ట్ యు.ఎస్. పీస్ కార్ప్స్,బుధా బుధే డిస్ట్రిక్ ఆఫ్ ఎజ్యుకేషన్ భాగస్వామ్యంతో లెసొతోలో పాఠశాలలు, గ్రామాలలో గ్రంథాలయాలను స్థాపించింది.[36]
ఆరోగ్యం
మార్చు2016 లో లెసోతోలో ప్రజల ఆయుఃపరమిత్ పురుషులకు 51 సంవత్సరాలు, మహిళలకు 55 సంవత్సరాలు. శిశు మరణాలు 8.3%. 2006 లో ఆయుఃపరిమితి పురుషుల, మహిళలకు 42 సంవత్సరాలు ఉన్నట్లు అంచనా వేయబడింది.
దేశం ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో క్షయవ్యాధి గ్రస్థులను కలిగి ఉంది.
రక్షణ
మార్చులెసోతో అంతర్గత, బాహ్య భద్రతలకు డిఫెంసు కమిషన్ బాధ్యత వహిస్తుంది. దీనిని లెసోతో జాతీయ రాజ్యాంగంలోని 145 వ అధికరణం నిర్ధారిస్తుంది. ప్రధానమంత్రి ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా వ్యవహరిస్తారు. లెసోతో కమాండర్, లెసోతో డిఫెన్స్ ఫోర్సు డిప్యూటీ కమాండరు, కమిషనరు, లెసోతో మౌంటెడ్ పోలీసు సర్వాసు అసిస్టెంట్ కమీషనరు, డైరెక్టరు, లెసోతో నేషనల్ సెక్యూరిటీ సర్వీసు డిప్యూటీ డైరెక్టరు మొదలైన ఆరుగురు సభ్యులు దేశరక్షణ వ్యవస్థలో ప్రధానమంత్రితో కలిసి పనిచేస్తుంటారు. డిఫెంసు కమిషనుకు డిఫెంసు ఫోర్సు, పోలీసు, జైలు సర్వీసులకు వ్యూహాత్మకంగా మార్గదర్శకత్వం చేసే అధికారం ఉంది. అయినప్పటికీ సెక్యూరిటీ సర్వీసు ప్రభుత్వానికి జవాబుదారీగా ఉంటుంది. రక్షణ కమిషన్, పోలీసు, జైలు సర్వీసు సీనియర్ సిబ్బందిని నియమించటానికి లేదా తొలగించటానికి రక్షణ కమిషన్ అధికారం కలిగి ఉంది. సిక్యూరిటీ సర్వీసు డైరెక్టరు, డిప్యూటీ డైరెక్టరును ప్రధానమంత్రి వ్యక్తిగతంగా నియమిస్తాడు.[37]
లెసోతో డిఫెన్స్ ఫోర్సు జాతీయ రాజ్యాంగంలోని 146 వ అధికరణ పరిధిలో స్థాపించబడింది. ఇది అంతర్గత భద్రత, లెసోతో రక్షణ బాధ్యత వహిస్తుంది. దీని ముఖ్య అధికారిని రాజ్యాంగం కమాండరుగా నియమిస్తుంది. ఆయన లెఫ్టినెంట్ జనరలు హోదాను కలిగి ఉంటాడు. ఎల్డిఎఫ్ సిబ్బంధి కేవలం 3,000 మంది మాత్రమే ఉంటారు. పదాతి దళం అతిపెద్ద భాగంగా ఉంది. చిన్న ఫిరంగి, లాజిస్టిక్స్, వైమానిక దళ యూనిట్లు ఉంటాయి. వీటికి సాయుధ నిఘా సంస్థలు మద్దతు ఇస్తాయి. 2000 నుండి లెసోతో డిఫెన్స్ ఫోర్సెసుకు ఒక బ్రిగేడియర్ నేతృత్వంలో ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ టీం చిన్న బృందం శిక్షణ ఇచ్చింది.[ఆధారం చూపాలి]
లెసోతో మౌంటెడ్ పోలీస్ సర్వీసు జాతీయ రాజ్యాంగంలోని 147 వ అధికరణ పరిధిలో స్థాపించబడింది. ఇది చట్టనియంత్రణకు బాధ్యత వహిస్తుంది. దీని ప్రధాన అధికారిని రాజ్యాంగం కమిషనరుగా నియమిస్తుంది. ఎల్.ఎం.పి.సి యూనిఫాం పాలసీ, క్రిమినల్ డిటెక్షన్, ట్రాఫిక్ పాలసీని అందిస్తుంది. హైటెక్ నేర, ఇమ్మిగ్రేషన్, వన్యప్రాణి, తీవ్రవాదంతో వ్యవహరించే ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. ప్రస్తుత రక్షణశక్తి 1872 నుండి నిరంతరంగా (మార్పులు చేస్తున్నప్పటికీ) ఉనికిలో ఉంది.
లెసోతో నేషనల్ సెక్యూరిటీ సర్వీసును జాతీయ రాజ్యాంగంలోని 148 వ అధికరణ పరిధిలో స్థాపించబడింది. ఇది జాతీయ భద్రతకు బాధ్యత వహిస్తుంది. దీని ప్రధాన అధికారిని రాజ్యాంగం డైరెక్టరుగా నియమిస్తుంది. ఎ.ఎన్.ఎస్.ఎస్. ఒక గూఢచార సేవాసంస్థ. ఇది ప్రభుత్వానికి నేరుగా నివేదిస్తుంది. డైరెక్టరును నియమించటానికి లేదా తొలగించటానికి అధికారం నేరుగా ప్రధాన మంత్రికి ఇవ్వబడింది.
సంస్కృతి
మార్చుసాంప్రదాయిక సంగీత వాయిద్యాలలో లెకోలోలో పశువుల కాపర్లుగా ఉండే బాలురు ఉపయోగించే వేణువు వంటి సంగీత వాయిద్యం ఇది. సెటోలో-టాలో పురుషులు వారి నోటిని ఉపయోగించి వాయిస్తారు. స్త్రీల థోమో అనే తంత్రీ వాయిద్యం ఉపయోగిస్తారు.
లెసోతో జాతీయ గీతం "లెసోతో ఫాట్సే లా బో-నటాటా రోనా", ఇది సాహిత్యపరంగా "లెసోతో, మా ఫోర్-ఫాదర్స్ ల్యాండ్"గా అనువదించబడింది.
లెసోతోలోని గృహనిర్మాణ శైలిని మోకోరో అని పిలుస్తారు. చాలా పాత పట్టణాలలో (ముఖ్యంగా చిన్న పట్టణాలు), గ్రామాలలో ఈ రకమైన గోడలు ఉన్నాయి. సాధారణంగా గోడలు సాధారణంగా పెద్ద రాళ్లతో నిర్మించబడతాయి. ప్రస్తుతం గోడలు నిర్మించడానికి కాల్చిన మట్టి ఇటుకలు, ముఖ్యంగా కాంక్రీట్ బ్లాక్సులను ఉపయోగిస్తుంటారు. సాధారణంగా నివాసగృహాలకు తరచుగా కంచె పైకప్పులు ఉంటాయి. అయితే వీటిని తరచుగా ముడతలు పెట్టిన రూఫింగ్ షీట్లతో భర్తీ చేస్తారు.
సాంప్రదాయిక వస్త్రం బసాథోతో కప్పబడి ఉంటుంది. ప్రధానంగా ఉన్నితో చేసిన మందపాటి బ్లాంకెటు అన్ని సీజన్లలో దేశవ్యాప్తంగా ఉంటాయి. పురుషులు, మహిళలు వేరువేరుగా ధరిస్తారు.
మోరిజా ఆర్ట్స్ & కల్చరల్ ఫెస్టివల్ పేరుతో ప్రముఖ సెసోతో కళలు, సంగీత ఉత్సవం నిర్వహించబడుతుంది. 1833 లో మొదటి మిషనరీలు ప్రవేశించిన సందర్భాన్ని పురస్కరించుకుని మొహేజా చారిత్రక పట్టణంలో వార్షికంగా ఉత్సవం నిర్వహించబడుతుంది.
Cuisine
మార్చులెసొతో వంటకం ఆఫ్రికన్ సంప్రదాయాలు, బ్రిటీషు ప్రభావాలను కలిగి ఉంటాయి.[38] లెసోతో జాతీయ వంటకం మోతోహో దేశం అంతటా తినే ఒక పులియబెట్టిన జొన్న గంజి.
సంప్రదాయ ఆహారం
మార్చులెసోతో పరిమిత ఆహార వనరులను కలిగి ఉంది. దేశంలో అత్యధిక కుటుంబాలు తమ సొంత ఆహారం పండించుకుంటూ, పశువులను పోషిస్తూబ్వారి కుటుంబాల ఆహారావసరాలు తీర్చుకుంటూ స్వయం సమృద్ధిని కలిగి ఉంటారు.
కొన్ని ముఖ్యమైన ఆహారాలలో పాప్-పాప్, వివిధ కూరగాయలతో కూడిన సాసులతో కూడి ఉండే ఒక మొక్కజొన్న గంజి ఒకటి. టీ, స్థానికంగా తయారు చేయబడుతున్న బీరు పానీయాలు ప్రసిద్ధి చెందాయి.[39]
మాధ్యమం
మార్చు2018 చిత్రం " బ్లాక్ పాంథర్ " దర్శకుడు " రయాన్ కూగ్లర్ " లెసోతో చే ప్రేరణ పొంది ఈ చిత్రాన్ని చిత్రించాడు.[40][41] బసొథతోడు బ్లాంకెట్సు కూడా ఈ సినిమా ఫలితంగా ప్రసిద్ధి చెందాయి.[42]
సాంఘిక వివాదాలు
మార్చులెసోతోలో బాల కార్మికులు గణనీయమైన స్థాయిలో ఉన్నారు. దేశం " చైల్డ్ లేబర్ ఎలిమినేషన్ " పేరుతో ఒక యాక్షన్ ప్రోగ్రాంను రూపొందించే ప్రక్రియలో ఉంది. ఐక్యరాజ్యసమితి ఆధారంగా ఏ దేశంలోనూ లేనంతగా లెసోతోలో అత్యధిక మానభంగాల శాతం ఉంది (2008 లో నమోదైన 1,00,000 మందిలో 91.6 కేసులు నమోదౌతూ ఉన్నాయి).[43]
వైకల్యాలున్న వ్యక్తుల చికిత్స దేశం ఎదుర్కొంటున్న మరొక ప్రధాన సమస్యగా ఉంది. 2006 లెసోతో గణాంకాల ఆధారంగా జనాభాలో దాదాపు 4% మంది వైకల్యం కలిగి ఉంటారని భావిస్తున్నారు. అయితే, ఉపయోగించిన మెథడాలజీల విశ్వసనీయతకు సంబంధించి ఆందోళనలు ఉన్నాయి. వాస్తవిక సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15% నికి సమీపంగా ఉంటుందని అంచనా. " లెసొతో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ డిసేబుల్డు " నిర్వహించిన సర్వే ఆధారంగా [44] లెసోతోలో వైకల్యం ఉన్న వ్యక్తులు గణనీయంగా సాంఘిక, సాంస్కృతిక ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగావకాశాలు అందుకోవడానికి అంగవైకల్యం ఆటంకంగా ఉంటుంది.
2008 డిసెంబరు 2 న లెసొతో వికలాంగుల హక్కులపై ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ మీద సంతకం చేసిన ప్రపంచదేశాలలో 42 వ దేశంగా మారింది. అయినప్పటికీ ఇప్పటివరకు ఈ ఒప్పందం ఇప్పటికీ అమలుకు రాలేదు. వికలాంగుల సంస్థల ప్రయత్నాలను లాబీయింగ్ చేసినప్పటికీ వైకల్యాలున్న ప్రజల హక్కులను కాపాడటానికి నిర్దిష్ట చట్టాలను రూపొందించడానికి ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. 2011 లో జాతీయ వైకల్యం పునరావాస విధానం అభివృద్ధి చేయబడినప్పటికీ, దాని అమలుకు బడెటులో నిధులు కేటాయించబడలేదు.
లెసోతోలో లైంగిక హింస తీవ్రమైన సమస్యగా ఉంది. యు.ఎన్.ఒ.డి.సి. నుండి అంతర్జాతీయ డేటా 2008 లో లైసోతో అత్యధికంగా పోలీసులచే నమోదు చేయబడిన అత్యాచారాల సంఘటనలను కనుగొంది.[45]
లెసోతోలో జరిపిన ఒక అధ్యయనంలో 61% మంది మహిళలు లైంగిక హింసను అనుభవించినట్లు తెలుసుకున్నారు. అందులో 22% బలవంతపు లైంగిక సంబంధం వేధింపులకు గురౌతున్నారని నివేదించబడింది.[46] 2009 డి.హెచ్.ఎస్.సర్వేలో పురుషులు 15.7% లైంగిక సంబంధానికి అంగీకరించని భార్యను కొట్టడాన్ని ఒక న్యాయవాదిని సమర్థించారని తెలుసుకున్నారు.[47] అధ్యయనంలో పరిశోధకులు "లెసోతోలో హెచ్.ఐ.వి. అధిక ప్రాబల్యం ఉన్న కారణంగా లైంగికతను నియంత్రించడానికి మహిళల హక్కును పరిరక్షించాలి" అని నివేదించారు.[48]
" వివాహిత పర్సన్స్ సమానత్వం చట్టం 2006 " భర్తల విషయంలో భార్యలకు సమాన హక్కులు కల్పిస్తుంది. భర్త వివాహ హక్కులను రద్దు చేస్తుంది.[49]
వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2015 లింగ వివక్ష నివేదిక ప్రపంచంలోని లెసోతో 61 వ స్థానంలో ఉంది. పొరుగునున్న దక్షిణాఫ్రికా 17 వ స్థానంలో ఉంది.[50]
లెసోతో ప్రపంచంలో రెండవ అత్యధిక ఆత్మహత్య రేటును కలిగి ఉంది. అయినప్పటికీ లెసోతోలో ఈ వివాదం గురించి అధికంగా దృష్టిసారించ లేదు.
వెలుపలి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 September 2017.
- ↑ 2.0 2.1 2.2 2.3 "Lesotho". International Monetary Fund.
- ↑ "GINI index". World Bank. Archived from the original on 8 ఏప్రిల్ 2016. Retrieved 31 మార్చి 2016.
- ↑ "2016 Human Development Report" (PDF). United Nations Development Programme. 2016. Archived (PDF) from the original on 18 జూలై 2017. Retrieved 21 మార్చి 2017.
- ↑ "lesotho noun - Definition, pictures, pronunciation and usage notes | Oxford Advanced Learner's Dictionary at OxfordLearnersDictionaries.com". www.oxfordlearnersdictionaries.com (in ఇంగ్లీష్). Archived from the original on 11 మార్చి 2018. Retrieved 10 మార్చి 2018.
- ↑ Nicole Itano (2007). No Place Left to Bury the Dead. Simon and Schuster. p. 314. ISBN 0-7432-7095-9.
- ↑ Roman Adrian Cybriwsky (2013). Capital Cities around the World: An Encyclopedia of Geography, History, and Culture. ABC-CLIO. p. 182. ISBN 9781610692489. Archived from the original on 8 మే 2018. Retrieved 4 మార్చి 2018.
- ↑ Walsham How, Marion (1962). The Mountain Bushmen of Basutoland. Pretoria: J. L. Van Schaik Ltd.
- ↑ Olson JS, Shadle RS, eds. (1996). Historical Dictionary of the British Empire. Greenwood Press. p. 118. ISBN 0-313-27917-9.
- ↑ Sam Romaya, Alison Brown (April 1999). "City profile: Maseru, Lesotho". Cities. 16 (2): 123–133. doi:10.1016/S0264-2751(98)00046-8.
- ↑ Karen Tranberg Hansen, Mariken Vaa (2004). Reconsidering Informality: Perspectives from Urban Africa. Nordic African Institute. p. 180. ISBN 91-7106-518-0.
- ↑ Donald G. McNeil Jr (16 January 1996) King of Tiny Land Circled by South Africa Dies in Car Plunge. The New York Times.
- ↑ Lesotho 'coup' forces PM Thabane to South Africa Archived 2 ఆగస్టు 2018 at the Wayback Machine. BBC. 30 August 2014.
- ↑ Lesotho PM Thabane returns home after fleeing 'coup' Archived 29 అక్టోబరు 2018 at the Wayback Machine. BBC. 3 September 2014
- ↑ "Katse Botanical Garden". St Ives Communications. Archived from the original on 27 డిసెంబరు 2016. Retrieved 9 డిసెంబరు 2016.
- ↑ "Flora - Semonkong Lodge". Semonkong. Archived from the original on 20 డిసెంబరు 2016. Retrieved 9 డిసెంబరు 2016.
- ↑ 17.0 17.1 17.2 17.3 17.4 "World bank Lesotho: Country Brief". Archived from the original on 31 మార్చి 2014. Retrieved 12 ఫిబ్రవరి 2019.
- ↑ "CIA Lesotho Economy 2011". Archived from the original on 24 ఫిబ్రవరి 2012. Retrieved 3 మార్చి 2012.
- ↑ "UNDP Lesotho – Country Profile: Human Development Indicatos". Archived from the original on 11 మే 2013. Retrieved 12 ఫిబ్రవరి 2019.
- ↑ Human Development Report 2009 Archived 22 నవంబరు 2009 at the Wayback Machine. The United Nations. Retrieved 7 March 2012.
- ↑ "Central Bank of Lesotho – Africa Growth and Opportunities Act (AGOA): Economic Impact and Future Prospects" (PDF). Archived from the original (PDF) on 15 జూలై 2012. Retrieved 12 ఫిబ్రవరి 2019.
- ↑ "Purchase for Africa: An appeal for American apparel buys". Archived from the original on 1 నవంబరు 2009. Retrieved 12 ఫిబ్రవరి 2019.
- ↑ 23.0 23.1 "World Bank – IFC – Africa Can Compete! The Miracle of Tiny Lesotho—Sub-Saharan Africa's Largest Garment Exporter". Archived from the original on 31 జూలై 2013. Retrieved 4 ఫిబ్రవరి 2012.
- ↑ "Apparel Lesotho Alliance to Fight AIDS (ALAFA)". Archived from the original on 25 ఫిబ్రవరి 2011. Retrieved 12 ఫిబ్రవరి 2019.
- ↑ "Lesotho Highlands Water Project: The Treaty". Lhwp.org.ls. 24 October 1986. Archived from the original on 19 డిసెంబరు 2013. Retrieved 12 ఫిబ్రవరి 2019.
- ↑ "LHWP Water Sales" (PDF). Archived from the original (PDF) on 10 మే 2011. Retrieved 12 ఫిబ్రవరి 2019.
- ↑ https://www.letsengdiamonds.co.ls/about-us/corporate-profile/
- ↑ "Central Bank of Lesotho – QUARTERLY REVIEW – June 2011" (PDF). Archived from the original (PDF) on 9 ఫిబ్రవరి 2012. Retrieved 12 ఫిబ్రవరి 2019.
- ↑ Dan Oancea. "Letseng-la-Terae: The 603 Carat Lesotho Promise Diamond". Technology.infomine.com. Archived from the original on 13 ఫిబ్రవరి 2010. Retrieved 20 మే 2010.
- ↑ 30.0 30.1 30.2 "Lesotho". The World Factbook. Archived from the original on 12 జూన్ 2007. Retrieved 15 మే 2007.
- ↑ "Table: Christian Population as Percentages of Total Population by Country". Pew Research Center. Archived from the original on 11 మే 2017. Retrieved 21 ఏప్రిల్ 2018.
- ↑ 32.0 32.1 "Lesotho: Demographic and Health Survey, 2014" (PDF). Ministry of Health. p. 38. Archived from the original (PDF) on 25 డిసెంబరు 2016. Retrieved 21 ఏప్రిల్ 2018.
- ↑ "Unesco Institute for Statistics: Date Centre". 14 సెప్టెంబరు 2007. Archived from the original on 30 జనవరి 2011. Retrieved 28 ఫిబ్రవరి 2011.
- ↑ "The SACMEQ II Project in Lesotho: A Study of the Conditions of Schooling and the Quality of Education. Harare: SACMEQ". Sacmeq. 2 October 2005. Archived from the original on 25 ఏప్రిల్ 2013. Retrieved 13 ఫిబ్రవరి 2019.
- ↑ "Lesotho Ministry of Education and Training – Basic Education". Education.gov.ls. 5 అక్టోబరు 2005. Archived from the original on 20 జూలై 2010. Retrieved 13 ఫిబ్రవరి 2019.
- ↑ "Peace Corps: Lesotho". 14 July 2010. Archived from the original on 5 ఫిబ్రవరి 2011. Retrieved 13 ఫిబ్రవరి 2019.
- ↑ See article 145 of the Constitution of Lesotho Archived 3 మార్చి 2016 at the Wayback Machine.
- ↑ "Archived copy". Archived from the original on 17 ఫిబ్రవరి 2015. Retrieved 1 ఏప్రిల్ 2014.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Ethnic Food of Lesotho". USA Today. Archived from the original on 10 మార్చి 2018. Retrieved 1 మార్చి 2018.
- ↑ https://www.timeslive.co.za/sunday-times/lifestyle/2018-02-17-black-panther-director-ryan-cooglers-a-fan-of-lesotho--isixhosa/
- ↑ https://www.vulture.com/2018/02/black-panthers-wakanda-explained.html
- ↑ https://www.businessinsider.co.za/black-panther-has-not-real-effect-on-the-south-african-sale-of-basotho-blankts-2018-3
- ↑ "Countries Compared by Crime > Rape rate. International Statistics at NationMaster.com" Archived 1 డిసెంబరు 2011 at the Wayback Machine. nationmaster.com.
- ↑ Yusman Kamaleri and Arne H. Eide (eds.) (2011) Living Conditions of People with Disability in Lesotho Archived 2 ఏప్రిల్ 2015 at the Wayback Machine. SINTEF Technology and Society. lnfod.org.ls
- ↑ "Rape at the National Level, number of police recorded offenses". Archived 29 అక్టోబరు 2013 at the Wayback Machine United Nations.
- ↑ "Magnitude of sexual violence in Lesotho" Archived 29 అక్టోబరు 2013 at the Wayback Machine. confex.com.
- ↑ Lesotho. Demographic and Health Survey 2009 Archived 29 అక్టోబరు 2013 at the Wayback Machine. Ministry of Health and Social Welfare, Maseru, Lesotho. November 2010
- ↑ L Brown (2006). "Sexual violence in Lesotho". Stud Fam Plann. 37 (4): 269–80. PMID 17209284.
- ↑ Buhle Angelo Dube. The Law and Legal Research in Lesotho Archived 20 జూన్ 2010 at the Wayback Machine. nyulawglobal.org
- ↑ The Global Gender Gap Report 2015 Archived 25 అక్టోబరు 2016 at the Wayback Machine. World Economic Forum.