లైసోసోము
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
భంగభ్రస్తములు త్వచనిర్మిత ఆశయాలవంటి నిర్మాణాలు. ఇవి చాలా రకాల ఎంజైములతో నింపబడి ఉంటాయి. ఈ ఎంజైములన్నింటినీ కలిపి 'ఆసిడ్ హైడ్రోలేసులు' అంటారు. ఈ ఎంజైములు ప్రోటోజోవన్ లలో ఆహార పదార్ధాల కణాంతస్థ జీర్ణక్రియకు చాలా అవసరం. కణంలోని నిరుపయోగ సూక్ష్మాంగాలను నిర్మూలించటంలో కూడా ఇవి పాల్గొంటాయి. అందువల్లనే లైసోసోములను 'ఆత్మహత్య తిత్తులు' (Suicidal bags) అంటారు. ఇవి కణంలోకి ప్రవేశించిన బాక్టీరియాను కూడా చంపేస్తాయి. ఇవి కణాంతర జీర్ణక్రియను నిర్వహించేటప్పుడు బహురూపకతను ప్రదర్శిస్తాయి.
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/4/48/Animal_cell_structure_en.svg/220px-Animal_cell_structure_en.svg.png)
భంగభ్రస్తము(Lysosomes)
మార్చుభంగభ్రస్తము అనేవి త్వచములతో ఆవరించిన నిర్మాణాలు.ఇవి జీవద్రవ్యంలో తేలియాడుతూ సూక్ష్మ పరిమాణంలో ఉన్న ఆశయాలు .లైసోసోములు అనేవి మొట్టమొదట పెరికానలిక్యులార్ నిర్మాణాలని పిలిచారు. తరువాతి కాలంలో క్రిస్టియన్ డిడువే - 1955లో కాలేయ కణ పదార్దం నుంచి సెంట్రిఫ్యూజ్ సహాయంతో లైసోసోములను వేరు చేయగలిగాడు
ఉనికి
మార్చు- జీర్ణక్రియలను, జలవిశ్లేషణలను నిర్వర్తించే కణాల్లో లైసోసోములనేవి చల అథికంగా ఉంటాయి.
- RBC, కాలేయం, క్లోమం, ఎముక, మృదులాస్థి, మూత్రపిండం, థైరాయిడ్ గ్రంథి, బాహ్య చర్మం మొదలైన నిర్మాణంలోలైసోసోములు అధికంగా ఉంటాయి.
నిర్మాణం(Structure)
మార్చు- లైసోసోముల పరిమాణం 0.2ų - 0.8ų ఉంటుంది.
- WBC, మూత్రపిండం కణాల్లో అత్యధిక పరిమాణంలో అంటే 8మ్యూ వరకు ఉంటుంది.
- లైసోసోములు అండాకారంలో గాని నిరాకారంగాగా ఉంటాయి.
- ఈ నిర్మాణాల చుట్టూ ఒకే ప్రమాణ త్వచం [Unit membrane] ఆవరించి ఉండి ద్రవ మొజాయిక్ పద్ధతిలో ఉన్న ప్లాస్మాత్వచాన్ని పోలి ఉంటుంది.
- సముద్రంలాగా ఉన్నఫాస్పోలిపిడు పరమాణువుల మధ్యలో మంచు గడ్డలాగా ప్రోటీను పరమణువులు తేలియాడుతూ ఉంటాయి.
- ఫాస్ఫోలిపిడు పరమాణువులు రెండు పొరలుగా అమరి ఉంటాయి.
- జలవిరోధ గుణం గల ధ్రువ అంత్యాలు లోపలి వైపుకు జల సఖ్య గుణంగల ధ్రువ శిరో భాగాలు పరిధీయం గాను అమరి ఉంటాయి.
- ప్రోటీను పరమాణువులు రెండు రకాలుగా అమరి ఉంటాయి.