వల్సాడ్

గుజరాత్ రాష్ట్రం, వల్సాడ్ జిల్లాలోని ఒక నగరం.

వల్సాడ్, చారిత్రాత్మకంగా దీనిని బుల్సర్ అని పిలుస్తారు. ఇది భారతదేశం, గుజరాత్ రాష్ట్రం, వల్సాడ్ జిల్లాలోని ఒక నగరం.ఇది పురపాలక సంఘ పట్టణం. ఇది వల్సాడ్ జిల్లా కేంద్రంగా ఉంది.[2] వల్సాడ్ నగరం, నవ్‌సారి నగరానికి, సూరత్‌కు దక్షిణాన ఉంది.

వల్సాడ్
బుల్సర్
నగరం
పర్నేరా హిల్ నుండి వల్సాద్ సిటీ వ్యూ
పర్నేరా హిల్ నుండి వల్సాద్ సిటీ వ్యూ
Nickname: 
City of Peace
వల్సాడ్ is located in Gujarat
వల్సాడ్
వల్సాడ్
వల్సాడ్ is located in India
వల్సాడ్
వల్సాడ్
వల్సాడ్ is located in Asia
వల్సాడ్
వల్సాడ్
Coordinates: 20°36′36″N 72°55′34″E / 20.610°N 72.926°E / 20.610; 72.926
దేశం భారతదేశం
రాష్ట్రంగుజరాత్
జిల్లావల్సాడ్
విస్తీర్ణం
 • Total24.10 కి.మీ2 (9.31 చ. మై)
Elevation
13 మీ (43 అ.)
జనాభా
 (2011)[1]
 • Total1,70,060
 • జనసాంద్రత7,100/కి.మీ2 (18,000/చ. మై.)
Demonym(s)వల్సాడియన్లు, వల్సాడిలు
భాషలు
 • అధికారికగుజరాతీ
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
పిన్ కోడ్
396001
టెలిఫోన్ కోడ్912632
Vehicle registrationజిజె-15
లింగ నిష్పత్తిపురుఫులు 926/ స్త్రీలు 1000
అక్షరాస్యత80.94 %

పేరు వ్యుత్పత్తి

మార్చు
 
స్వామినారాయణ ఆలయం, తితాల్

"వల్సాద్" అనే పేరు గుజరాతీ భాషా సమ్మేళనం వాద్-సాల్ నుండి వచ్చింది. దీని అర్థం "మర్రి చెట్లచే కప్పబడిన (సాల్ ) " అని సూచిస్తుంది. ( ప్రాంతం సహజంగా మర్రి చెట్లతో సమృద్ధిగా ఉండేది). బ్రిటిష్ రాజ్ కాలంలో, దీనిని చారిత్రాత్మకంగా "బల్సర్" అని పిలిచారు. ప్రధానంగా మాట్లాడే భాష గుజరాతీ.మాట్లాడే ఇతర భాషలు హిందీ, మరాఠీ, అంగ్ల భాష . వల్సాద్‌లో అనుసరించే ప్రధాన మతం హిందూ మతం.పట్టణంలో అనుసరించే ఇతర మతాలు ఇస్లాం, క్రైస్తవం, జైనమతం, జొరాస్ట్రియనిజం, బౌద్ధమతం .

రవాణా

మార్చు

త్రోవ మార్గం

మార్చు

వల్సాద్ జాతీయ రహదారి 48 లో ఉంది. గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు సేవల ద్వారా వల్సాద్ నుండి, గుజరాత్‌లోని అన్ని ప్రముఖ నగరాలకు బస్సు సేవలు ఉన్నాయి. డామన్ గంగగా సూచించబడే గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 16 విభాగాలలో వల్సాద్ ఒకటి.

రైల్వే మార్గం

మార్చు

వల్సాద్ రైల్వే స్టేషన్ పశ్చిమ రైల్వేలోని ముంబై రైల్వే విభాగం ద్వారా నిర్వహించబడుతుంది. ఇది పశ్చిమ రైల్వే కింద ఒక ఉప విభాగం. ఇది కొత్త ఢిల్లీ-ముంబై ప్రధాన మార్గంలో ఉంది. ప్రస్తుత రైల్వే స్టేషన్ భవనం 1925లో స్థాపించారు. రైల్వే స్టేషన్‌కు ఆనుకుని వల్సాడ్ విద్యుత్ లోకో షెడ్‌లో 100కి పైగా ఎలక్ట్రిక్ రైలు ఇంజన్లు ఉన్నాయి.

వాయు మార్గం

మార్చు

వల్సాద్ నగరం, సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉంది. ఇది నగరానికి ఉత్తరాన 99 కి.మీ. దూరంలో సూరత్‌లో ఉంది. వల్సాద్‌కు సమీపంలో ఉన్న ఇతర విమానాశ్రయం ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది వల్సాడ్ నగరం నుండి దక్షిణాన 188 కి.మీ.దూరంలో ఉంది.

పరిశ్రమలు

మార్చు

రసాయనాలు, వస్త్రాలు, కాగితం & గుజ్జు పరిశ్రమల వంటి రంగాలకు వల్సాద్ ఒక పారిశ్రామిక స్థావరం.1980వ దశకం నుండి, నగరంలో ఉపాధికి వస్త్ర తయారీ, రసాయన ఉత్పత్కులు ప్రధాన రంగాలుగా ఉన్నాయి. వల్సాద్ రాష్ట్రంలోని ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఆహార ధాన్యాలు, పంటలలో గణనీయమైన ఉత్పత్తిని సాధిస్తోంది.

వల్సాద్‌లో డుంగ్రా, పార్డి, ధరంపూర్, భిలాద్, వల్సాద్, ఉంబర్‌గావ్, సరిగామ్, వాపి (గుజరాత్ రసాయన కేంద్రం) కల్గామ్‌లో ఒక పారిశ్రామిక ఉద్యానవనం ఉన్నాయి.[3] నగరంలో 300 కంటే ఎక్కువ మధ్యతరహా, భారీ పరిశ్రమలతో, వాపి వల్సాద్‌ ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా ఉంది. ఆసియాలోని అతిపెద్ద కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (సిఇటిపి) వాపిలో ఉంది, ఇది వాపి వేస్ట్ & ఎఫ్లూయెంట్ నిర్వహణ కంపెనీకి చెందింది. వాపి పారిశ్రామిక సంఘం ద్వారా ప్రచారం చేయబడింది.[4]

చదువు

మార్చు

కళాశాలలు

మార్చు
  • సి.ఎం.ఇ.ఆర్.ఎస్.వైద్య కళాశాల - స్థాపన 2014
  • ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల - స్థాపన 2004
  • ప్రభుత్వ సాంకేతిక కళాశాల - స్థాపన 1965
  • శ్రీమతి జెపి ష్రాఫ్ చిత్రకళ కళాశాల
  • షా ఎన్.హెచ్. వాణిజ్య కళాశాల
  • ధీరు-సరళ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్
  • బికెఎం విజ్ఞాన కళాశాల
  • డోలత్-ఉషా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్
  • శ్రీ ఎన్.కం.ఎం.నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్
  • షా కె.ఎం.న్యాయ కళాశాల

పాఠశాలలు

మార్చు
  • సరస్వతి అంతర్జాతీయ పాఠశాల
  • శ్రీ వల్లభ ఆశ్రమ ఎం.జి.ఎం అమీన్ & వి.ఎన్. సవాని అంతర్జాతీయ పాఠశాల
  • శ్రీ వల్లభ సంస్కార్ ధామ్ శ్రీమతి.శోభాబెన్ ప్రతాప్‌భాయ్ పటేల్ డే బోర్డింగ్ పాఠశాల [5]
  • శ్రీ వల్లభ ఆశ్రమ ఎం.సి.ఎం.కొఠారి బాలికల రెసిడెన్షియల్ పాఠశాల [6]
  • వెస్ట్రన్ రైల్వే ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల
  • డి.ఎం.డి.జి. పురపాలకసంఘ పాఠశాల
  • జమ్నాబాయి సర్వజనిక్ కన్యా విద్యాలయ
  • మణిబా సర్వజనిక్ విద్యాలయ
  • షా ఖిమ్‌చంద్ ముల్జీ సర్వజనిక్ ఉన్నత పాఠశాల
  • సెయింట్ జోసెఫ్ ఆంగ్ల బోధన ఉన్నత పాఠశాల
  • మదర్ మేరీ పబ్లిక్ ఉన్నత పాఠశాల
  • బాయి అవా బాయి ఉన్నత పాఠశాల
  • బి.ఎ.పి.ఎస్. స్వామినారాయణ విద్యామందిర్
  • జివిడి సర్వజనిక్ ఉన్నత పాఠశాల
  • స్వామినారాయణ ఉన్నత పాఠశాల
  • గాయత్రి ఉన్నత పాఠశాల
  • కుసుమ్ విద్యాలయ
  • సి.బి.ఉన్నత పాఠశాల

మొరార్జీ దేశాయ్ సంగ్రహశాల వల్సాద్‌లో భారతదేశ మాజీ 5వ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్‌కు అంకితం చేస్తూ నిర్మించబడింది. ఈ సంగ్రహశాలను వల్సాద్ పురపాలక సంఘం రూ.4 కోట్లు ఖర్చుతో నిర్మించింది.దీనిని గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ప్రారంభించారు.[7]

కాల్లియన్ బాగ్ వల్సాద్‌లోని ఒక పట్టణ ఉద్యానవనం. ఇది 1929లో, మిస్టర్ మోతీలాల్ కలియన్జీ తన తండ్రి జ్ఞాపకార్థం వల్సాద్ పురపాలక సంఘానికి అందించిన విరాళంతో ఏర్పడింది.సా.శ. 1931లో, కాలియన్ బాగ్‌ని జెహెచ్‌గారెట్ ప్రారంభించాడు.[8]

ప్రముఖ వ్యక్తులు

మార్చు
  • భూలాభాయ్ దేశాయ్ - స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రఖ్యాత న్యాయవాది.
  • బిందు దేశాయ్ - హిందీ సినిమా నటి.
  • దాదాభోయ్ హవేవాలా - క్రికెటర్, అతను బాంబే క్రికెట్ టీమ్, పార్సీస్ క్రికెట్ టీమ్ కోసం ఆడాడు.
  • ఫ్రెడ్డీ మెర్క్యురీ (జననం ఫరోఖ్ బుల్సారా ) - బ్రిటిష్ రాక్ బ్యాండ్ క్వీన్ గాయకుడు, పాటల రచయిత.
  • హేమిన్ దేశాయ్ - భారత సంతతికి చెందిన క్రికెటర్, లిస్ట్ ఎ క్రికెట్‌లో ఒమన్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
  • మకరంద్ దవే - గుజరాతీ కవి.
  • మణిలాల్ దేశాయ్ - గుజరాతీ కవి.
  • మొరార్జీ దేశాయ్ - భారత మాజీ ప్రధాన మంత్రి .
  • నాగిందాస్ పరేఖ్ - సాహిత్య విమర్శకుడు, సంపాదకుడు, అనువాదకుడు.
  • నానుభాయ్ వకీల్ - హిందీ, గుజరాతీ చిత్ర దర్శకుడు.
  • నారాయణ్ దేశాయ్ - గుజరాతీ రచయిత.
  • నిరుపా రాయ్ - హిందీ సినిమా నటి.
  • పూజా ఝవేరి - తెలుగు, తమిళం, కన్నడ సినిమా నటి.
  • ప్రమోద్‌కుమార్ పటేల్ - సాహిత్య విమర్శకుడు.
  • ప్రతాప్ సేవ్ - ఒక సామాజిక కార్యకర్త.
  • రవీంద్ర పరేఖ్ - రచయిత, నవలా రచయిత, కవి, విమర్శకుడు, అనువాదకుడు.
  • రెక్స్ సెల్లర్స్ - భారత-ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్.
  • సామ్ మానెక్షా - భారతదేశ మొదటి ఫీల్డ్ మార్షల్, మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. అతని కుటుంబం వల్సాద్ నుండి వచ్చింది, తరువాత బొంబాయి, తరువాత అమృత్‌సర్‌కు వెళ్లింది.
  • సంగీతా చౌహాన్ - భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి.
  • షీలా శర్మ - హిందీ, గుజరాతీ సినిమా నటి.
  • ఉష్నాస్ - గుజరాతీ కవి.

ఇది కూడ చూడు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Census of India: Search Details". www.censusindia.gov.in. Archived from the original on 24 September 2015. Retrieved 17 January 2022.
  2. "District Valsad, Government of Gujarat | Famous for Mangos and Tithal Beach | India". Retrieved 2023-02-26.
  3. "District Profile: Valsad" (PDF). Global Gujarat. Archived from the original (PDF) on 2022-04-23. Retrieved 2023-07-01.
  4. "DISTIRCT INDUSTRIAL POTENTIALITY SURVEY REPORT" (PDF). Dcmsme. Archived from the original (PDF) on 2020-06-05. Retrieved 2023-07-01.
  5. "Vallabh Ashram - Smt. Shobhaben Pratapbhai Patel Day Boarding School". www.vadb.edu.in.
  6. "Vallabh Ashram - MCM Kothari International Girls' Residential School". www.vamcm.edu.in.
  7. "Museum on Morarji Desai likely to open in February 2015 in Gujarat". DeshGujarat. 29 December 2014.
  8. "Valsad Tourism". Valsad Tourism.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wiki.x.io/w/index.php?title=వల్సాడ్&oldid=4321806" నుండి వెలికితీశారు