వసంత్ గోవారికర్
వసంత్ రాంచోండ్ గోవారికర్ (1933 మార్చి 25 - 2015 జనవరి 2) ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత. ఆయన ఇస్రో కు ఛీఫ్ గా తన సేవలందించారు. భారతదేశం[1] లో సైన్స్, టెక్నాలజీ శాఖ కార్యదర్శిగా,1991–1993 మధ్యకాలంలో అప్పటి భారత ప్రధాని దివంగత పి.వి.నరసింహారావు కు శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరించారు.ఆయన అంతరిక్ష రంగంలో విశేష పరిశోధనలు చేసారు. ఆయన వాతావరణం, జనాభా రంగాలలో కూడా తన సేవలనందించారు. 'భారత మాన్సూన్ నమూనా’ పితామహుడిగా పేరుగాంచిన ఆయన తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో వాతావరణ మార్పులను సూచించే వ్యవస్థను రూపొందించిన తొలి శాస్త్రవేత్త.[2][3]
వసంత్ గోవారికర్ | |
---|---|
జననం | పూణే, బ్రిటిష్ ఇండియా | 1933 మార్చి 25
మరణం | 2015 జనవరి 2 పూణే, బ్రిటిష్ ఇండియా | (వయసు 81)
జాతీయత | భారతీయుడు |
రంగములు | Science |
ముఖ్యమైన పురస్కారాలు | పద్మశ్రీ, పద్మభూషణ్ |
జీవిత విశేషాలు
మార్చుఆయన పూణే లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో మార్చి 25 1933 న జన్మించారు. తరువాత ఆయన మహారాష్ట్ర లోని కోల్హాపూర్ జిల్లాలో ప్రారంభవిద్య, గ్రాడ్యుయేషన్ చేసారు.1950ల ప్రారంభంలో పరిశోధనల నిమిత్తం ఇంగ్లాండు వెళ్లారు. ఆయన ఎం.ఎస్.సి, కెమికల్ ఇంజనీరింగ్ లో పి.హెచ్.డి లను డా.ఎఫ్.హెచ్.గార్నర్ అధ్వర్యంలొ చేసారు. ఆయన పరిశోధనల ఫలితం "గార్నర్-గోవారికర్ సిద్ధాంతం". ఈ సిద్ధాంతం ఘనపదార్థాల నుండి ప్రవాహులకు ఉష్ణము, ద్రవ్యరాశి ల బదిలీ గూర్చి విశ్లేషణ చేయబడిన గ్రంథము.[4]
కెరీర్
మార్చుఆయన అంతరిక్ష పరిశోధన, వాతావరణ అంచనా, ఇతర అంశాల పై పరిశోధనలు చేశారు. గోవారికర్ యూకే అటామిక్ ఎనర్జీ అథారిటీలో కూడా పనిచేశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో పనిచేసిన ఆయన 1979 నుండి 1985 మధ్యకాలంలో విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ గా బాధ్యతలను నిర్వర్తించారు. ఆయన శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా పనిచేశారు.ఆయన 1967లో తుంబాలోని ఈక్వేటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ లో ప్రోపెల్లంట్ ఇంజనీరింగ్ డివిజన్ కు అధిపతిగా వ్యవహరించారు.ఆయన 1995 నుండి 1998 మధ్య పూణే విశ్వవిద్యాలయ ఉపకులపతిగా పనిచేశారు.[5]
అవార్డులు
మార్చుఆయనకు భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ 1984 లోనూ, పద్మభూషణ్ 2008 లోనూ వచ్చాయి. ఆయన ఫై ఫౌండేషన్ అవార్డును కూడా పొందారు.[6]
మరణం
మార్చుఆయన జనవరి 2 2015 శుక్రవారం నాడు పుణేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన డెంగ్యూ, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌తో కన్నుమూసినట్టు ఆస్పత్రి ఐసీయూ ఇన్‌చార్జ్ డాక్టర్ సమీర్ జోగ్ వెల్లడించారు.[1][3][7][8]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "ప్రముఖ శాస్త్రవేత్త వసంత్ గోవారికర్ మృతి". vijnana vedika weekly. Retrieved 3 January 2015.[permanent dead link]
- ↑ "Dr. Vasant Gowarikar". Archived from the original on 2015-01-02. Retrieved 2015-08-04.
- ↑ 3.0 3.1 Former ISRO chief V R Gowarikar dies in Pune
- ↑ Vasant Gowarikar
- ↑ "వసంత్ రంచ్చోడ్ గోవారికర్ గురించి". Archived from the original on 2015-08-05. Retrieved 2015-08-04.
- ↑ Awards
- ↑ Scientist Vasant Gowarikar passes away
- ↑ "Scientist Vasant Gowarikar no more". Archived from the original on 2015-09-24. Retrieved 2015-08-04.