వాడుకరి:యర్రా రామారావు/రెండు రాష్ట్రాలకు తేడా వివరాలు

(గుర్తించిన వ్యాసాలు వికీకరించుటకు, ఉండవలసిన వ్యాసాలు పరిశీలించి సృష్టించుటకు జాబితా కొరకు సృష్టించబడింది.)

రెండు రాష్ట్రాలకు తేడా

మార్చు

వ్యాసాలు

మార్చు

మూసలు

మార్చు

రెండు రాష్ట్రాలలో లేనివి

మార్చు

మూసలు

మార్చు

తెవికీ పండగ - 2025 స్వాగతం

మార్చు

(తెలుగు వికీమీడియన్ యూజర్ గ్రూప్ తరుపున నిర్వహించే మన ముఖ్య పండగ)

(ఈ రోజు కార్యక్రమాలలో భాగంగా తెవికీలో వ్యాసాల నాణ్యత, తాజాపర్చటం గురించి ఒక చిన్న సమర్పణ

ముందుమాట

మార్చు

అసలు నాణ్యత అంటే ఏమిటి, అలాగే తాజా  వివరాలతో వ్యాసాలు నిర్వహించటం ఎలా అనేదానికి ఈ సమర్పణలో  తగిన ఉదాహరణలతో, వాటిని ఎలా అధిగమించవచ్చు అనే విషయాలు సాధ్యమైనంతవరకు తెలపటానికి ఈ ప్రజెంటేషన్ ముఖ్య ఉద్దేశ్యం.

వ్యాసాలు సృష్టింపుకు, సవరణలకు అవినాభావ సంబంధం ఉంది. వ్యాసాల సృష్టింపు మీద మనకు ఆందోళన ఎంత మాత్రం లేదు. వ్యాసాల సృష్టింపే లేకపోతే తాజాపర్చటం, నాణ్యతను పోషించటం అనే ప్రసక్తి లేదు. కాబట్టి రెండూ ముఖ్యమే. అయితే రాసికన్నా వాసి ముఖ్యమని మనందరికి తెలుసు. తెవికీలో అనుభవరీత్యా గమనించిన, గ్రహించిన విషయాలు మాత్రమే నేను చెప్పటం జరుగుతుంది. ఏది ఏమైనా నావరకు నాకు వ్యాసాల నాణ్యత, తాజాపర్చటం మీద ఎక్కువ ఆసక్తి. వీటికి నేను పెద్దపీట వేస్తాను. అలాగని వ్యాసాల సృష్టింపు మీద ఆసక్తి లేదని కాదు. నేను వ్యాసాల సృష్టింపు చేసే పని నాచేతిలో లేదు.ఎక్కడైనా వ్యాసంలోనో, మూసలోనే ముఖ్యమైన వ్యాసాలకు ఎర్రలింకులు ఉంటే వాటిని అప్పుడు వెంటనే ఆ వ్యాసం సృష్టింపు చేయటం నా పరిపాటి. అలానే అనువాద యంత్రం ద్వారా దాదాపు 1000 వ్యాసాలకు పైగా సృష్టింపుకు కారకుడయ్యాను.

అయితే ఈ చిన్న ప్రజెంటేషన్ నేను ఏ ఒక్క వ్యాసమో గమనించి దీని మీద ఈ సమర్పణ ఇచ్చుట లేదనే విషయం మీకు మనవి చేస్తున్నాను.

దీనికి కారణాలు ఏమిటి?

మార్చు

గమనించిన కారణాలు

మార్చు
  • వ్యాసాల సృష్టింపుతో పోల్చుకుంటే నాణ్యత, విస్తరణ, తాజా సమాచారం చేర్చే సవరణ పనులకు సమతుల్యత లేదు.
  • నాణ్యతకు, తాజా సమాచారానికి చెందిన సవరణలుపై ఆసక్తి, తగిన ప్రణాళికలు లేకపోవటం.
  • ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలు, వికీ నియమాలు పాటించేదానిపై దృష్టి లేకపోవటం
  • వ్యాసాల సృష్టింపు ఎంత ముఖ్యమో, వ్యాసాలలో నాణ్యత, తాజా సవరణలు కూడా అంతే ముఖ్యం అని భావించకపోవటం.
  • వ్యాసం సృష్టించిన తరువాత ఆ వ్యాసం మరలా ఓపికతో క్షుణ్ణంగా చదివి, అవసరమైన సవరణలు చేయకపోవటం.
  • ఏదైనా వ్యాసం సవరించేటప్పుడు ఆ వ్యాసంలో కాలానుగణంగా చేయవలసిన సవరణలు గమనించక పోవటం. ఒక వేళ గమనించినా వ్యాసంలో సవరించి, సమాచారపెట్టెలో సవరించక పోవటం,, లేదా సమాచారపెట్టెలో సవరించి వ్యాసంలో సవరించక పోవటం,
  • వ్యాసం సృష్టించి ఎంతకాలమైనా విస్తరణకు అవకాశం ఉన్న ముఖ్య వ్యాసాలు పాత సమాచారంతో అలాగే ఉండటం.
  • పై వాటికి అన్నిటికీ ముఖ్య కారణం చురుకైన వాడుకరులు తక్కువుగా ఉండటం, ఆ చురుకుగా ఉన్న వాడుకరులు నాణ్యతకు సంబంధించిన చర్యలపై దృష్టి, ఆసక్తి లేకపోవటం, నిర్వాహాకులు తగినంతమంది లేకపోవటం, ఉన్నవారు పూర్తిగా దాని మీద దృష్టి లేక ఆసక్తి చూపకపోవటం, కొత్త నిర్వాహకత్వ అభ్యర్థిత్వానికి ముందుకు రాక పోవటం ఇలాంటివి ముఖ్య కారణాలని చెప్పవచ్చు.

ఇక అసలు విషయాలకు వద్దాం

మార్చు

వ్యాసాల నాణ్యత అనేక రకాలకు చెందిన సవరణలుపై ఆధారపడి ఉంది. వాటిని గురించి ఈ దిగువ వివరించటమైనది.

తెలుగు వికీపీడియా వ్యాసాల నాణ్యత, తాజాకరించటంపై చిన్న సమర్పణ
విభాగం విషయం స్థితి /ఉదాహరణ
భవిష్యత్తు కాలానికి చెందిన పదాలతో వాక్యాలు తెవికీలో మనం కొన్ని వ్యాసాలు భవిష్యత్తుకాలానికి చెందిన పదాలతో అనగా, జరగనున్న, జరుగనున్న, జరగనున్నాయి, విడుదలకానుంది, విడుదలకావచ్చు, అందుకుంటారు అని రాయాలిసి వస్తుంది. ఇవి ఎక్కువుగా రాజకీయాల వ్యాసాలు, సినిమా వ్యాసాలు, కార్యక్రమాల వ్యాసాలలో ఈ పదాలు వస్తాయి. సృష్టించటం అయిపోయిన తరువాత ఆ కాలపరిమితి  దాటిన తరువాత ఆ వ్యాసాలు చదివిన పాఠకులకు వికీపీడియా వ్యాసాల మీద ఒక దురభి అభిప్రాయం కలగటానికి అవకాశం ఉంది. వాటిని ఆ కాలం దాటినతరువాత మనం గుర్తించాలంటే అలాంటి వాటిని మనం రాసేటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే వీటిని తాజాకరించటానికి అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. విడుదలకానున్న సినిమాలు
మూస:Update after వాడుక ఉదాహరణకు 2025 బీహార్ శాసనసభ ఎన్నికలు అనే వ్యాసంలో ఎన్నికలు 2025 నవంబరులో జరగనున్నాయి. అని రాయక తప్పదు. అది రాసినప్పుడే {{Update after}} అనే మూసను అక్కడే ఎక్కించి దానిని ------ అనే విధంగా రాయాలి. ఈ విధానం పాటించటం వలన అ వ్యాసాలు

కాలదోషం పట్టిన వాక్యాలు గల వ్యాసాలు అనే వర్గంలోకి చేరి, మనకోసం ఎదురు చూస్తుంటాయి. వాటిని గమనించిన సముదాయసభ్యులు ఆ వాక్యాలను కాలానుగుణంగా సవరించటానికి అవకాశం ఉంటుంది.

https://w.wiki/_q2ai
మూస:Update వాడుక ఒక్కోసారి మనం పై పద్దతిలో రాయటం మర్చిపోవచ్చు.ఇబ్బందేమి లేదు. తరువాత ఎవరైనా గమనించినప్పుడు ముందు చెప్పిన విధంగా పాటించవచ్చు. ఆ మూస వాడకుండానే వ్యాసాల వివరించిన కాలపరిమితి దాటిన తరువాత వాక్యాలు ఉన్న వ్యాసాలు గమనిస్తాం.కానీ వాటిని గమనించినప్పుడు సవరించటానికి మనకు కుదరకపోవచ్చు.అలాంటి అప్పుడు మూస:Update అనే మూసను ఆ వ్యాసం ప్రవేశికపైన {{Update}} అని చేర్చితే,  ఆ మూసను చేర్చిన వ్యాసాలు అన్నీ తాజాకరించవలసిన వ్యాసాలు అనే వర్గంలో చేరతాయి. వీటిని అవకాశం ఉన్న సముదాయ సభ్యులలో ఎవరైనా తగిన చర్యలు చేపట్టటానికి అవకాశముంటుంది. లేదా వీటిని ఒక ప్రాజెక్టుగా చేపట్టి తాజాకరించటానికి అవకాశముంది. https://w.wiki/_q2an
మూస:Update done వాడుక పై రెండు వర్గాలలో చేరిన వ్యాసాలు సవరించిపక్షంలో వాటి చర్చాపేజీలో ముగింపుదశగా {{Updtedone}} అనే మూసను ఎక్కించాలి. ఆ మూసను చేర్చిన వ్యాసాలన్నీ వర్గం:తాజాకరించిన వ్యాసాలు వర్గంలో చేరతాయి. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఉంది. ఈ మూస ఉన్న వ్యాసాలు ఎవరు, ఎప్పుడు సవరించినా సవరణలు చేసిన తేదీ స్యయంచాలకంగా మారింది. https://w.wiki/_q2k8
అనువాద పదాలలో పాటించవలసిన జాగ్రత్తలు
అసందర్బ పదాలు, అసలు ఇవి ఎలా ఎందుకు ఏర్పడతాయి నేను గమనించిన ప్రకారం ఆంగ్ల వ్యాసం నుండి ఏదేని ఒక వ్యాసం అనువాద యంత్రం ద్వారా ప్రచురించటానికి 25% అనువదించాలిసిన పరిమితి ఉన్నందున మనం పలుమార్లు వ్యాసం చదివి సవరించటం జరుగుతుంది. అందువలన ఈ అసందర్బపదాలు అనువాదయంత్రం ద్వారా సృష్టించిన వ్యాసాలలో ఎక్కడో ఒకటి తప్పితే చాలా బహు తక్కువ. అయితే అదే ఆంగ్ల వ్యాసం గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా అనువదించి, కాపీ పేస్ట్ చేసిన వ్యాసాలలో ఈ పదాలు ఎక్కువుగా ఉంటున్నట్లు నేను గమనించాను. అయితే ఈ లోపాలు సరికావాలంటే వ్యాసం ఒకటికి రెండుసార్లు నిశితంగా చదివి పరిశీలించి సవరించాలిసిన అవసరం ఉంది.

Gurmeet Singh Meet Hayer , Krishna , India Ahead-P Mark - భారత్ ముందుంది-పి మార్క్- ఇండియా ఎహెడ్-పి మార్క్

https://w.wiki/_q22a

https://w.wiki/_q22t

ఆంగ్ల శీర్షికలకు లింకులు కలపరాదు కొన్ని వ్యాసాలకు ఆంగ్ల శీర్షికలకు లింకులు కలిపి |(పైపు) తరువాత తెలుగు శీర్షికతో సరిపుచ్చుట జరుగుతుంది. తెవికీలో వాస్తవంగా వాటికి వ్యాసాలు ఉన్ననూ అవి అన్నీ ఎర్రలింకులు చూపుతున్నవి. కాస్త ఓపికతో వాటిని అనువదించి లింకులు కలపాలి. ఒక వేళ వ్యాసం లేకపోతే తెలుగులోకి అనువదించి ఎర్రలింకుగా చూపాలి గాని, అలా చూపకూడదు. https://w.wiki/_p$zf
సమాచారపెట్టె నిర్వహణ-పాటించవలసిన జాగత్తలు
సమాచారపెట్టె ఏర్పాటు, అనువాదం కొన్ని వ్యాసాలలో సమాచారపెట్టెలు లేవు. అటువంటి వ్యాసాలు గమనించినప్పుడు, ఆంగ్ల వ్యాసం నుండి సమాచారపెటె కూర్పు చేసి అవకాశం ఉంటే అనువదించాలి. లేదా కనీసం సమాచారపెట్టె చేర్చి, దాని చర్చాపేజీలో {{అనువాదం చేయవలసిన సమాచారపెట్టెలు}} అనే మూసను చేర్చితే వాటిని ఒక ప్రాజెక్టుగా చేపట్టటానికి అవకాశం ఉంది. https://w.wiki/_p$p6
తప్పుగా ఫార్మాట్ చేయబడిన కోఆర్డినేట్ ట్యాగ్‌లు ఉన్న పేజీలు

| coordinates  =

సమాచారపెట్టెలలో కొన్ని వ్యాసాలలో అక్షాంశ, రేఖాంశాలు తప్పుగా లేదా సరియైన ఫార్మెట్లో కూర్పు చేయనందున వర్గం:Pages with malformed coordinate tags అనే వర్గంలో నన్ను పట్టించుకోరా అని మన కోసం ఎదురుచూసే పేజీలు ఉన్నవి. ఉదాహరణకు ఒకదానిని ఎలా సవరించాలో తెలుసుకుందాం. https://w.wiki/_pzzR
మీడియా ఫైల్ ఆకృతి వలన సమాచారపెట్టె ఎబ్బెెట్టుగా మారుట ఒక్కోసారి కొన్ని వ్యాసాలలో మీడియా ఫైల్స్ ఆకృతి సరిగా లేకపోతే సమాచారపెట్టె ఆకృతి వికృతంగా మారటానికి అవకాశం ఉంది. జగ్గేష్ https://w.wiki/_rwSJ
పదవుల మారినప్పుడు తాజా సవరణలు ముఖ్యంగా కొంతమంది పదవులలో ఉన్న వ్యక్తుల వ్యాసాలలో  పాత సమాచారంతో ఉండటం, కొన్ని వ్యాసాలలో పదవీకాలం ముగిసినా అధికారంలో ఉన్న వ్యక్తి అని చూపుతుంది. మరొక పదవికి మారినా ఆ సమాచారం చేర్చకపోవటం ప్రధాన సమస్య. దీనికి కారణం ఒక వేళ గమనించినా వ్యాసంలో సవరించి, సమాచారపెట్టెలో సవరించక పోవటం, లేదా సమాచారపెట్టెలో సవరించి వ్యాసంలో సవరించక పోవటం  తాజా సమాచారం గురించి రాయకపోవటం, దీనికి కారణం ఏదైనా వ్యాసం సవరించేటప్పుడు ఆ వ్యాసంలో కాలానుగణంగా చేయవలసిన సవరణలు గమనించక పోవటం. వికీపీడియాలో జరిగే సవరణలుకు సమతుల్యత పద్దతి లేదు. ( వివిధ రకాలు కారణాలు) (సిద్దిపేట జిల్లా కలెక్టరు)
పదవీ కాలం ముగిసినా, ఇంకా పూర్వపదవిలో అధికారంలో ఉన్న వ్యక్తి అని చూపే వ్యాసాలు కొన్ని వ్యాసాలలో పదవీకాలం ముగిసి వారు ఏ పదవిలో లేకపోయిననూ ఇంకా పూర్వపదవిలో అధికాారంలో ఉన్న వ్యక్తి అని చూపే వ్యాసాలు ఉన్నవి.

(తాడపట్ల రత్నాబాయి) - https://w.wiki/_p$fH , (డొక్కా మాణిక్యవరప్రసాద్) - https://w.wiki/_p$eo

ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా

https://w.wiki/_p$fE

విషయసంగ్రహం సరిగా కుదింపు కాకపోవటం కొన్ని వ్యాసాలలో కారణం ఎందుకో తెలియదు కానీ, విషయసంగ్రహం పైన ఖాళీ స్పేస్ చూపుతుంది.దానిని ఎంత ప్రయత్నం చేసినా సరిగా కుదింపు కాదు. దానిని ఎలా చేయాలో తెలుసుకుందాం. https://w.wiki/_s5hj

https://w.wiki/_rT5E

సంవత్సరం తెలుపకుండా సమాచారం కూర్పు ఏదేని వ్యాసంలో సమాచారం చేర్చేటప్పుడు కావాలని కాదు, ఆరోజే జరిగిన సంఘటన కాబట్టి ఏదో ధ్యాసలో నెల, తేదీతో "మార్చి 21న సాయంత్రం" అని సరిపుచ్చుతాం. కానీ కొంతకాలం తరువాత అది చదివినవార్కి అర్థవంతమైన సమాచారంగా కనపడదు. https://w.wiki/_sJwg

https://w.wiki/_sJwc