వాడేల వేంకటశేషగిరిరావు
వాడేల వేంకటశేషగిరిరావు (జ. 1905, అక్టోబరు 14) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కవి, ఆయుర్వేద వైద్యుడు, సామాజికవేత్త.[1] శేషగిరిరావు కేవలం కవిగా మాత్రమే కాకుండా, సమాజ సేవకుడిగా కూడా పేరుగాంచాడు. రావిపాడు గ్రామంలో శ్రీలక్ష్మీ గణేశ జ్యోతిషాలయాన్ని నడిపించి, ఆయుర్వేద వైద్యుడిగా సేవలందించాడు.
వాడేల వేంకటశేషగిరిరావు | |
---|---|
జననం | 1905, అక్టోబరు 14 రావిపాడు, కర్నూలు జిల్లా |
వృత్తి | ఆయుర్వేద వైద్యుడు |
ప్రసిద్ధి | కవి, సామాజికవేత్త |
మతం | హిందూ |
తండ్రి | వెంకట్రామయ్య |
తల్లి | వెంకట లక్ష్మమ్మ |
జననం, ప్రారంభ జీవితం
మార్చువాడేల వేంకట శేషగిరిరావు 1905, అక్టోబరు 14న కర్నూలు జిల్లా, రావిపాడులో జన్మించాడు. తల్లి వెంకట లక్ష్మమ్మ, తండ్రి వెంకట్రామయ్య.[2]
విద్యాభ్యాసం
మార్చువాడేల వేంకట శేషగిరిరావు కవిత్వంతో పాటు జ్యోతిష శాస్త్రంలో కూడా ప్రావీణ్యం కలిగి ఉన్నాడు. చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి ఇతనికి అక్షరాభ్యాసం చేయించాడు. ఉన్నత విద్యను హైదరాబాదులోని తన అక్క ఇంట్లో అభ్యసించాడు. ఆయన ఇంగ్లీషులో ఇంటర్మీడియెట్ వరకు చదివాడు. ఆయుర్వేద వైద్యుడిగా ప్రాక్టీస్ చేశాడు.[3]
సాహిత్య సేవ
మార్చుశేషగిరిరావు అద్భుతమైన కవి. అనేక రచనలు చేశారు. వాటిలో కొన్ని:[4]
- శ్రీ కృష్ణాభ్యుదయము
- నక్షత్రమాల
- స్తోత్రమాల
- స్తోత్ర కదంబము
- శ్రీశైల పంచాంగము
- శ్రీశైల క్షేత్రమహిమ
- శ్రీశైలేశ చరితము
- గీత భాగవతము
- రుక్మిణీకల్యాణము (నాటకం)
- సత్యభామ పరిణయము (నాటకం)
- కట్నపిశాచి (నాటకం)
- శ్రీకృష్ణదేవరాయలు (నాటకం)
- లీలా మల్లికార్జునీయము లేక శివలీల (నాటకం)
బిరుదులు, గౌరవాలు
మార్చుశేషగిరిరావుకి "అభినవ పోతనామాత్యుడు", "కవికులాలంకార" బిరుదులు వచ్చాయి. 1960 నవంబరు 2న కర్నూలు నగరంలో సంస్కృత విద్యాదాన సమాఖ్య నుండి కలెక్టర్ సమక్షంలో "కవికులాలంకార" బిరుదును అందుకున్నాడు.[5]
మూలాలు
మార్చు- ↑ రాయలసీమ రచయితల చరిత్ర రెండవసంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
- ↑ కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).
- ↑ కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).
- ↑ కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).
- ↑ కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).