వికీపీడియా:వికీప్రాజెక్టు/రాయలసీమ

తెలుగు వికీపీడియా 21 వార్షికోత్సవం సందర్భంగా రాయలసీమకు సంబంధించిన సమాచారాన్ని, చరిత్ర వ్యాసాలను, గ్రామాల సమాచారాన్ని, అందులోని కొత్త చిత్రాలను చేర్చే కార్యక్రమం. ఇందులో భాగంగా, రాయలసీమ చరిత్ర, భౌగోళికం, సంస్కృతి, కళలు, పర్యాటక ప్రదేశాలు, ముఖ్య వ్యక్తులు, గ్రామాలు మొదలైన అంశాలపై కొత్త వ్యాసాలు రాయడం, ఇప్పటికే ఉన్న వ్యాసాలను మెరుగుపరచడం జరుగుతుంది. అలాగే, రాయలసీమకు సంబంధించిన అరుదైన చిత్రాలు, వీడియోలు, ఇతర మీడియా ఫైళ్ళను వికీమీడియా కామన్స్‌లో అప్‌లోడ్ చేస్తారు ఇది అందరు వికీపీడియన్ లు స్వచ్చందంగా పాలుపంచుకొనే కార్యక్రమం,ఇందులో పోటీలు , బహుమతులు ఉండవు.

రాయలసీమ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యప్రాంతాల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ భాగంలో ఉండే 8 జిల్లాలు (కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్ఆర్, అనంతపురం, శ్రీ సత్య సాయి, తిరుపతి, చిత్తూరు) రాయలసీమ ప్రాంతంలోకి వస్తాయి.
లక్ష్యాలు:

  • రాయలసీమ గురించి వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని సమగ్రంగా, కచ్చితంగా, విశ్వసనీయంగా తీర్చిదిద్దడం.
  • రాయలసీమ చరిత్ర, సంస్కృతి, కళలు, సాహిత్యం, వంటకాలు, రాయలసీమ చరిత్రలో ముఖ్యమైన వ్యక్తులు, మొదలైన వాటిపై కొత్త వ్యాసాలను సృష్టించడం.ఉన్న వ్యాసాలను మెరుగుపరచడం.
  • రాయలసీమలోని గ్రామాలు, పట్టణాలు, దర్శనీయ స్థలాలు మొదలైన వాటి గురించి సమాచారాన్ని చేర్చడం.
  • రాయలసీమలోని పర్యాటక ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, అధిక సంఖ్యలో చిత్రాలను వికీమీడియా కామన్స్కు అప్‌లోడ్ చేయడం.
  • వికిసోర్సులో రాయలసీమకు సంబంధించిన పుస్తకాల ప్రూఫ్ రీడింగ్.
  • వికిడేటాలో రాయలసీమ సంబందిత బౌగోళిక సమాచారం చేర్చటం


మార్గదర్శకాలు :

  • విశ్వసనీయత (Verifiability): సమాచారం విశ్వసనీయ మూలాల నుండి సేకరించబడాలి. వ్యక్తిగత అభిప్రాయాలు, ఊహాగానాలకు తావు లేదు. పుస్తకాలు, పత్రికలు, అధికారిక వెబ్‌సైట్లు వంటి విశ్వసనీయ వనరులను మాత్రమే ఉపయోగించాలి. ప్రతి సమాచారానికి తగిన మూలాన్ని చూపించాలి.
  • తటస్థ దృక్కోణం (Neutral Point of View): వ్యాసాలు తటస్థ దృక్కోణంలో రాయబడాలి. ఏ ఒక్క వర్గానికో, వ్యక్తికో అనుకూలంగా రాయకూడదు. అన్ని వైపుల వాదనలను సమానంగా పరిగణించాలి.
  • కాపీహక్కు (Copyright): కాపీహక్కు చట్టాలను తప్పకుండా పాటించాలి. ఇతరుల రచనలను అనుమతి లేకుండా కాపీ చేయకూడదు. సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నించాలి. ఒకవేళ కోట్ చేయవలసి వస్తే, తప్పనిసరిగా కోట్ మార్క్స్ (" ") ఉపయోగించాలి ఇంకా మూలాన్ని పేర్కొనాలి.
  • మౌలిక పరిశోధన లేదు (No Original Research): వికీపీడియాలో మౌలిక పరిశోధనలను ప్రచురించకూడదు. ఇప్పటికే ప్రచురితమైన సమాచారాన్ని మాత్రమే ఉపయోగించాలి.

రాయలసీమ సమాచార అభివృద్ధికి సంబంధించిన అదనపు మార్గదర్శకాలు:

  • స్థానిక చరిత్రకు ప్రాధాన్యత: రాయలసీమ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక అంశాలకు సంబంధించిన సమాచారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
  • స్థానిక నిపుణుల సహకారం: స్థానిక చరిత్రకారులు, రచయితలు, నిపుణుల సహకారం తీసుకోవాలి. వారి జ్ఞానాన్ని, అనుభవాన్ని ఉపయోగించుకోవాలి.
  • చిత్రాల నాణ్యత: అధిక రిజల్యూషన్ గల చిత్రాలను ఉపయోగించాలి. చిత్రాలకు సరైన వివరణ (caption) ఇవ్వాలి. చిత్రాలకు కాపీహక్కు సమస్యలు లేకుండా చూసుకోవాలి. వికీమీడియా కామన్స్ లైసెన్సులకు అనుగుణంగా చిత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • గ్రామాల సమాచారం: గ్రామాల సమాచారాన్ని చేర్చేటప్పుడు, గ్రామం యొక్క చరిత్ర, జనాభా, ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి మొదలైన వాటి గురించి సమాచారాన్ని చేర్చాలి. అధికారిక గణాంకాలను ఉపయోగించడానికి ప్రయత్నించండి.
  • సమన్వయం: ఇతర వికీపీడియన్లతో సమన్వయం చేసుకోవాలి. చర్చా పేజీలలో మీ అభిప్రాయాలను తెలియజేయాలి.
  • పేజీని సృష్టించాక: వ్యాసాన్ని సృష్టించిన తరువాత, దాని చర్చ పేజీలో {{వికీప్రాజెక్టు రాయలసీమలో భాగం}} అనే మూసను చేర్చండి. తద్వారా ఆ పేజీ వర్గం:రాయలసీమ ప్రాజెక్టులో భాగంగా సృష్టించిన పేజీలు అనే వర్గం లోకి చేరుతుంది.
  • పేజీని విస్తరించాక: ఈసరికే ఉన్న వ్యాసాన్ని విస్తరించిన సందర్భంలో, ఆ వ్యాసపు చర్చ పేజీలో పై మూసను, దానిలో 1=y అనే పరామితితో సహా చేర్చాలి - {{వికీప్రాజెక్టు రాయలసీమలో భాగం|1=y}} -ఇలా. తద్వారా ఆ పేజీ వర్గం:రాయలసీమ ప్రాజెక్టులో భాగంగా విస్తరించిన పేజీలు అనే వర్గం లోకి చేరుతుంది.
  • పై మూసలను ఆయా వ్యాసాల "చర్చ పేజీల్లో" మాత్రమే చేర్చాలి. మరే ఇతర పేజీల్లోనూ చేర్చకూడదు. "చర్చ:" పేరుబరిలో కాకుండా మరే ఇతర పేరుబరిలో చేర్చినా మూస పనిచెయ్యదు.


ఈవెంట్లు


సమావేశాలు - శిబిరాలు

సమాచారం/మూలాల కోసం వనరులు

ప్రాజెక్టు కాలక్రమం

మార్చు
  • 2025 జనవరి 21 - 2025 మార్చి 31

వాడూకరిపెట్టె, టాప్‌ఐకన్లు

మార్చు

ఈ ప్రాజెక్టులో పాల్గొనే వాడుకరులు {{రాయలసీమ ప్రాజెక్టు topicon}} అనే టాప్‌ఐకన్ను తమ వాడుకరి పేజీలో పెట్టుకోవచ్చు. దీన్ని పేజీలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది, సదరు వాడుకరి పేజీని వర్గం:రాయలసీమ ప్రాజెక్టులో కృషి చేసిన వాడుకరులు అనే వర్గం లోకి చేరుస్తుంది.

పాల్గొనేవారు

మార్చు

వనరులు

మార్చు

సూచనలు:పై వాటిలో రాయలసీమ ప్రాంతానికి చెందిన పుణ్యక్షేత్రాల, విద్యాసంస్థల, కవుల, రచయితల, రాజకీయ నాయకుల, జానపద కళలకు చెందిన వ్యాసలు, జిల్లా, మండల, గ్రామ, పట్టణాల, శాసనసభ నియోజకవర్గాల, ఇలా వివిధ కేటగిరీలకు చెందిన వ్యాసాలు ఉన్నవి. ఈ వర్గంలోకి వెళ్లి మీకు నచ్చిన వ్యాసాలు ఎంచుకుని అభివృద్ధి చేయవచ్చు. ఆ వ్యాసం చూడగానే మీకు ఏరకంగా అభివృద్ది చేయవచ్చో సాధారణంగా తెలిసిపోతుంది. కొన్ని వ్యాసాలు పాత సమాచారంతో ఉన్నవి. వాటిని దాని ఆంగ్ల వ్యాసానికి వెళ్లి అందులోని తాజా సమాచారం ప్రకారం సవరణలు చేపట్టవచ్చు. కొన్నిటిలో ఆంగ్ల పదాలు అనువాదం చేయాలిసిన అవసరం ఉంది. సమాచారపెట్టెలు లేని వాటికి సమాచారపెట్టెలు ఆంగ్ల వ్యాసం నుండి కూర్పుచేసి అనువదించవచ్చు. దీనిమీద ఇంకా ఏమైనా అభిప్రాయాలు ఉంటే ప్రాజెక్టు చర్చాపేజీలో రాయగలరు.

గణాంకాలు- Outreach Dashboard

మార్చు

Editors may enroll by visiting the following URL:

https://outreachdashboard.wmflabs.org/campaigns/రయలసమ_/programs