విటమిన్ ఎ

(విటమిన్ A నుండి దారిమార్పు చెందింది)

విటమిన్ A రసాయన నామం 'రెటినాల్'. దినిని ఆంటీ జీరాప్తల్మిక్ విటమిన్ అనికూడా అంటారు.

రెటినాల్ రసాయనిక నిర్మాణం.
ఇదిగా చేప కాలేయపు నూనె, పాలు, వెన్న, గుడ్డు సొన మొదలైన వాటిలో ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా కారట్, ఆకుకూరలలో ఉంటుంది. మొక్కలలో ఇది బీటా-కెరోటిన్ రూపంలో ఉంటుంది. ఇది కాలేయం, పేగులలో విటమిన్ A గా మారుతుంది.

ఉపకళా కణజాలాలు ఉత్తేజితంగా ఉండటానికి, పెరుగుదలకు, కంటి చూపు మామూలుగా ఉంచడంలో విటమిన్ A ముఖ్య పాత్ర వహిస్తుంది. కంటి నేత్రపటలంలో రోడాప్సిన్ పునః సంశ్లేషణకు ఇది అత్యావసరం.

విటమిన్ A లోపంవల్ల రేచీకటి, జిరాఫ్తాల్మియా, కెరటోమలేసియా కలుగుతాయి.

---విటమిన్ 'ఎ' లోపం వల్ల కలిగే వ్యాధులు---

¤ రేచీకటి/ నైట్ బ్త్లెండ్‌నెస్/ నిక్టలోపియా: ఈ వ్యాధితో బాధపడేవారు తక్కువ వెలుతురులో, రాత్రిపూట వస్తువులను చూడలేరు.

¤ జీరాఫ్‌థాల్మియా / పొడికళ్లు: కంటిలోని అశ్రుగ్రంథులు అశ్రువులను ఉత్పత్తి చేయవు. ఫలితంగా కంటిపొర (కంజెక్టివా) పొడిగా అవుతుంది.

¤ పోషకాహార అంధత్వం: పిల్లల్లో పోషకాహార (విటమిన్ ఎ) లోపం వల్ల కంటి ముందుభాగంలో ఉండే శుక్లపటలం (కార్నియా) అనే పారదర్శకమైన పొర మెత్తగా అయ్యి, పగులుతుంది. దీనివల్ల దృష్టి పోయి శాశ్వత అంధత్వం కలుగుతుంది.

¤ చర్మం పొలుసుల్లా, గరుకుగా చిన్న చిన్న సూక్ష్మాంకురాలతో కప్పబడి, గోదురకప్ప చర్మంలా కనిపిస్తుంది.

¤ విటమిన్ 'ఎ' లోపం ప్రత్యుత్పత్తి చర్యల మీద కూడా ప్రభావం చూపుతుంది.

¤ కలర్ బ్త్లెండ్‌నెస్ / వర్ణ దృష్టిలోపం: రెటీనాలోని కోన్‌లలో ఉండే దృష్టి వర్ణకాల లోపం వల్ల ఎరుపు, ఆకుపచ్చ రంగుల మధ్య తేడాలను గుర్తించలేరు. శరీరంలో విటమిన్ 'ఎ'ను 6 నుంచి 9 నెలల వరకు నిల్వచేయవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని జాతీయ పోషకాహార సంస్థ (NIN, హైదరాబాద్) విటమిన్ 'ఎను పాఠశాలల్లో చదివే పిల్లలకోసం ప్రతి ఆర్నెళ్లకోసారి పెద్దమొత్తాల్లో సరఫరా చేస్తుంది.

¤ విటమిన్ 'ఎ'ను 'యాంటీ జిరాఫ్తాల్మిక్ విటమిన్ / జీరాఫ్తాల్మియా నివారక విటమిన్' అని కూడా పిలుస్తారు.

"https://te.wiki.x.io/w/index.php?title=విటమిన్_ఎ&oldid=2951620" నుండి వెలికితీశారు