విషువత్తు

రాత్రి, పగలు సమానంగా ఉండే రోజు
భూమిపై విషువత్తులు, ఆయనములు వచ్చు
UT తేదీ, సమయం[1]
సంఘటన విషువత్తు ఆయనము విషువత్తు ఆయనము
నెల మార్చి జూన్ సెప్టెంబరు డిసెంబరు
సంవత్సరం
రోజు సమయం రోజు సమయం రోజు సమయం రోజు సమయం
2010 20 17:32 21 11:28 23 03:09 21 23:38
2011 20 23:21 21 17:16 23 09:04 22 05:30
2012 20 05:14 20 23:09 22 14:49 21 11:12
2013 20 11:02 21 05:04 22 20:44 21 17:11
2014 20 16:57 21 10:51 23 02:29 21 23:03
2015 20 22:45 21 16:38 23 08:20 22 04:48
2016 20 04:30 20 22:34 22 14:21 21 10:44
2017 20 10:28 21 04:24 22 20:02 21 16:28
2018 20 16:15 21 10:07 23 01:54 21 22:23
2019 20 21:58 21 15:54 23 07:50 22 04:19
2020 20 03:50 20 21:44 22 13:31 21 10:02

భూమి భ్రమణాక్షం దాని పరిభ్రమణ కక్ష్య తలానికి లంబంగా కాక 23.4° కోణంలో వాలుగా ఉంటుంది. అంటే భూమి కక్ష్యా తలం, జ్యోతిశ్చక్ర (ఎక్లిప్టిక్) తలానికి 23.4° కోణంలో ఉంటుంది.[2] భూమధ్య రేఖను ఖగోళానికి పొడిగిస్తే ఆ ఖగోళ మధ్య రేఖ జ్యోతిశ్చక్రాన్ని రెండు స్థానాల వద్ద ఖండిస్తుంది. వీటినే విషువత్తులు అంటారు. ఇంగ్లీషులో ఈక్వినాక్స్ అంటారు. జ్యోతిశ్చక్రం వెంట ప్రయాణిస్తున్నట్లుగా కనిపించే సూర్యుడు ఖగోళ భూమధ్య రేఖను ఈ విషువత్తుల వద్దనే దాటుతాడు.[3] సంవత్సరంలో ఇది రెండు సార్లు జరుగుతుంది. దక్షిణం నుండి ఉత్తర దిశగా దాటే బిందువును వసంత విషువత్తు (వెర్నల్ ఈక్వినాక్స్) అని అంటారు. ఉత్తరం నుండి దక్షిణానికి దాటే బిందువును శరద్ విషువత్తు (ఆటమల్ ఈక్వినాక్స్) అనీ అంటారు.[4]

వసంత విషువత్తును జ్యోతిశ్చక్రపు ఎసెండింగ్ నోడ్ అని, మేషపు తొలి బిందువు అనీ కూడా అంటారు. అలాగే శరద్ విషువత్తును డిసెండింగ్ నోడ్ అని అంటారు.

సంవత్సరానికి రెండు సార్లు వచ్చే విషువత్తు రోజుల్లో (మార్చి 20/21, సెప్టెంబరు 22/23) భూమధ్యరేఖాతలంలో సూర్యుని కేంద్రం ఉంటుంది. ఆ రోజున భూఅక్షం యొక్క వంపు సూర్యునికి దగ్గరగాగానీ, దూరంగాగానీ ఉండక సమానదూరంలో ఉంటుంది. విషువత్తు రోజున భూమిపైన రాత్రీ, పగళ్ళ నిడివి సమానంగా ఉంటుంది. ఇవి రెండు రకాలు వసంత విషువత్తు (మార్చిలో), శరత్ విషువత్తు (సెప్టెంబరులో).

ఆయనము

మార్చు

విషువత్తుల మధ్య కాలాన్ని ఆయనము అంటారు. ఇవి ఉత్తరాయనము, దక్షిణాయనం అని విభజించబడి ఉన్నాయి.

చిత్రాలు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. United States Naval Observatory (2010-06-10). "Earth's Seasons: విషువత్తుes, ఆయనముs, Perihelion, and Aphelion, 2000-2020".
  2. Explanatory Supplement (1992), p. 733
  3. The directions north and south on the celestial sphere are in the sense toward the north celestial pole and toward the south celestial pole. East is the direction toward which Earth rotates, west is opposite that.
  4. Astronomical Almanac 2010, p. M2 and M6
"https://te.wiki.x.io/w/index.php?title=విషువత్తు&oldid=3588307" నుండి వెలికితీశారు