పెరియాళ్వార్ (జ. 9 వ శతాబ్దం) హిందూ మతంలో వైష్ణవ సంప్రదాయానికి అనుబంధంగా పేరుగాంచిన దక్షిణ భారతదేశంలోని పన్నెండు మంది ఆళ్వారులలో ఒకడు. అతనిని విష్ణుచిత్తుడు అని కూడా పిలుస్తారు. అతను హిందూ మతం వైష్ణవ సంప్రదాయానికి అనుబంధంగా ఉన్నాడు. అతనిని పెరియళ్వార్, లేదా పెరియాజ్వర్ అని కూడా పిలుస్తారు.

పెరియాళ్వార్
జననంవిష్ణుచిత్త
c. 9వ శతాబ్దం
శ్రివిల్లిపుత్తూరు
నిర్యాణముకల్లఝగర్ దేవాలయం
బిరుదులు/గౌరవాలుఆళ్వారులు
తత్వంవైష్ణవం, భక్తి
సాహిత్య రచనలుతిరుపల్లందు, పెరియ అఝవర్ త్రిరుమోఝి

అళ్వార్ల శ్లోకాలను నాలాయిర దివ్య ప్రబంధం గా సంకలనం చేశారు. వైష్ణవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలు 108 ఉన్నాయి. 108 దేవాలయాలు వైష్ణవ దివ్య దేశాలుగా వర్గీకరించబడ్డాయి. పన్నిద్దరు (12) ఆళ్వారులు తమ రచనలయిన పాశురములలో ఈ 108 విష్ణు రూపాలను కొలిచారు. తిరుప్పాణాళ్వార్ పన్నెండు అళ్వార్ల క్రమంలో ఎనిమిదవ వాడిగా పరిగణించబడతాడు.

జీవిత విశేషాలు

మార్చు

పెరియళ్వార్ మదురైకి సమీపంలో ఉన్న శ్రీవిల్లిపుత్తూరులో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతనికి విష్ణుచిత్తుడు అని పేరు పెట్టారు. దీని అర్ధం "విష్ణువు మనస్సులో ఉన్నవాడు".అతను వంశానుగతంగా వేదమూర్తులైన "వేయర్" కుటుంబానికి చెందినవాడు. అతను ముకుందాచార్యులు, పద్మ అను దంపతులకు మిథున మాసంలో శుక్లపక్ష ఏకాదశినాడు జన్మించాడు. చిన్నతనము నుండి వేదాధ్యయనము చేసి నిరంతరము భగవంతుని కైంకర్యము చేస్తూ బ్రహ్మచర్య వృత్తి చేపట్టి జీవించాడు. ఆజన్మబ్రహ్మచారిగా జీవించసాగాడు. అతను తులసి వనాన్ని ఏర్పాటు చేసి తులసి మొక్కలోని తులసిని మాలలుగా కట్టి వటపత్రశాయికి సమర్పించుకుంటూ తన జీవితమును గడపసాగాడు. శ్రీకృష్ణుని స్తుతియా భక్తిలో మైమరచి ఆ దేవదేవుని గురించి పాడేవాడు. అతను పాడిన పాశురములు అన్నియును శ్రీ కృష్ణుని బాల్యక్రీడలను అభివర్ణిస్తుంది. అతను తన "తిరువాల్యమొయి" లో బాలకృష్ణుని చిలిపి చేష్టలను కనులకు కట్టినట్లుగా వర్ణించిరి.

విష్ణువు దర్శనం

మార్చు

మధుర రాజధానిగా ఉన్న పాండ్యదేశమును పాలించిన నరసింహరాజుకు తన శేషజీవితాన్ని పుణ్యకార్యములకు వినియోగించాలని తలచి అది ఎలా వినియోగించుకోవాలో తనకు చెప్పే ఒక ఆళ్వారును కలుసుకోవాలని కోరిక కలిగింది. మతపరమైన, దైవపరమైన తన సందేహాలను తీర్చగల పండితులకు గొప్పగా బహుమతులు ఇస్తానని ప్రకటన చేసాడు. అందుకు దర్బారులో ఒక స్తంబాన్ని నిర్మించి దాని పై భాగంలో బంగారు వరహాలు, నాణేలు, వజ్ర వైడూర్యములు మూటగా కట్టాడు. చాలా మంది పండితులు దర్బారుకు వచ్చి ఎన్నో విషయాలను తెలియజేసినా మహారాజుకు సంతోషం కలుగలేదు. అపుడు నిరాడంబరుడు, వృద్ధ వైష్ణవ పండితుడైన విష్ణుచిత్తుడు

మతపరమైనది, దైవపరమైనది గల సందేహాలను తీర్చగల పండితుడు కావాలని, వారికి గొప్పగా బహుమతులు కూడా ఇస్తానని రాజ్యములో ప్రకటన చేసెను. అందుకు తగినట్లు దర్బారులో ఒక స్తంభాన్ని నిర్మించి దాని పైభాగమున చివర బంగారు వరహాలు, నాణేలు, వజ్ర వైడూర్యములు మూటగా కట్టినాడు. ఈ బహుమతి వార్త విన్న పలువురు శాస్త్ర పండితులు దర్బారుకువచ్చిఎన్నోవిషయాలు తెలిపెను.కాని అవి అన్నియును రాజు శ్రీ విల్లిపుత్తూరు నుండి మధురకు వచ్చి రాజదర్బారులో అద్భుతముగా "జీవితములో జరిగే అన్ని సంఘటనలకు శ్రీ మన్నారాయణుడే మూల కారణము. ఆయనపై విశ్వాసము ఉంచి భక్తితో ప్రార్థించినా, మతో కీర్తించినా ఆ దేవదేవుడు తన భక్తులను ఆదుకొని కష్టాలు తీర్చును అని పలికెను.

సభలోని వారందరూ ఆ మాటలు విన్నారు. జడత్వము కలిగిన అక్కడి స్తంభము దానియంతట అదే విష్ణుచిత్తుని దగ్గరకు వచ్చి వంగి ఆ బంగారు వరహాల మూటను ఆయన పాదాల దగ్గర పడవైచెను. జడత్వము గలస్తంభానికి విష్ణుచిత్తుని వాక్యములు ఎంతో సంతోషింప చేసినందులకు రాజు కూడా ఎంతో సంతోషించెను. - ఈ అద్భుత సంఘటన తరువాత విష్ణుచిత్తునికి పెరియాళ్వార్ అన్న పేరు వచ్చింది. పెరియాళ్వార్ గొప్పతనమును గుర్తించిన పాండ్యరాజు గజారోహణము, కనకాభిషేకము మొదలగు సత్కారములు చేసిరి. ఆ విధముగా రాజు, పెరియాళ్వారు బోధించు సమయాన సూర్యోదయము అయినట్లుగా ఆకాశములో ఒక అద్భుత తేజస్సు కనిపించింది. శంఖము, చక్రము ధరించిశ్రీ మన్నారాయణుడు ప్రత్యక్షమై పాండ్యరాజును, పెరియాళ్వారును అనుగ్రహించెను.[1]

అంత పాండ్యరాజునకు ఆశీస్సులిచ్చి పెరియాళ్వారు శ్రీ విల్లిపుత్తూరుకు వచ్చి అక్కడ ఉన్న వటపత్రశాయిని యథాప్రకారముగా సేవించసాగెను. అతను శ్రీనివాసుని ఏడు పాశురములతో స్తుతించాడు. అతను శ్రీ వేంకటేశ్వరునిలో రాముని, కృష్ణుని దర్శించినట్లుగా తెలిపెను.

గోదాదేవి

మార్చు

గోదాదేవి, శ్రీ విష్ణుచిత్తులకు పూలతోటలో లభించిన కుమార్తె. ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. యుక్త వయస్సులో వచ్చిన తరువాత లక్ష్మీస్వరూపమైన గోదాదేవి, తన శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలనుకుంటుంది. వైష్ణవుడైన విష్ణుచిత్తుడు రంగనాథ స్వామిని ప్రతినిత్యం భక్తిశ్రద్ధలతో కొలిచేవాడు. ఇందులో భాగంగా ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలను సుందరంగా అల్లుకుని అలంకరణకు తీసుకుని వెళ్లేవాడు. అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తర్వాత స్వామివారికి పంపిస్తుంది. ఈ రహస్యం తెలుసుకున్న విష్ణుచిత్తుడు దుఃఖించి రంగనాథుడికి మాలాధారణ గావించరు. దీంతో స్వామివారి మొహం చిన్నబోతుంది, దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమని విష్ణుచిత్తుడు బాధపడుతుంటే రంగనాథుడు విష్ణుచిత్తునితో ఇక ప్రతిరోజూ తనకు గోదాదేవి ధరించిన మాలాధారనే కావాలని ఆదేశిస్తారు. రంగనాథుని ఆదేశం మేరకే విష్ణుచిత్తుడు నడుచుకుంటాడు. ఇంతలో శ్రీరంగనాథుడే తనకు భర్తగా రావాలని కోరుకుంటూ గోదాదేవి... తన తోటి బాలికలతో కలిసి "తిరుప్పావై" (తిరుప్పావు) వ్రతాచరణ చేస్తారు. ఈ వ్రతమహిమతో... లక్ష్మీ స్వరూపమైన గోదాదేవి శ్రీరంగనాథుడి సతీమణి అవుతుంది. రంగనాథుడి ఆజ్ఞమేరకే గోదాదేవికి, రంగనాథస్వామికి విష్ణుచిత్తుడు దేవేరులకు భూలోకంలో వైభవంగా వివాహం జరిపించాడని పురాణాలు పేర్కొంటున్నాయి.[2]

మూలాలు

మార్చు
  1. "విష్ణుచిత్తుడు (పెరియాళ్వార్)". Srivenkatesham. Archived from the original on 2020-07-22. Retrieved 2020-07-22.
  2. SELVI.M. "మహావిష్ణువునే మనువాడిన గోదాదేవి". telugu.webdunia.com. Retrieved 2020-07-22.

వనరులు

మార్చు

బాహ్య లంకెలు

మార్చు