విష్ణు సవారా (1 జూన్ 1950 - 9 డిసెంబర్ 2020) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆయన ఆరుసార్లు మహారాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు.[1]

విష్ణు సవారా

పదవీ కాలం
మార్చి 1990 – అక్టోబర్ 2019
నియోజకవర్గం విక్రమ్‌గడ్ (అక్టోబర్ 2014 నుండి అక్టోబర్ 2019); భివాండి రూరల్ (అక్టోబర్ 2009 నుండి అక్టోబర్ 2014 వరకు); వాడా (మార్చి 1990 నుండి అక్టోబర్ 2009)

వ్యక్తిగత వివరాలు

జననం (1950-06-01)1950 జూన్ 1
వాడా , మహారాష్ట్ర, భారతదేశం
మరణం 9 డిసెంబరు 2020(2020-12-09) (aged 70)
కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ , ముంబై
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం ముంబై
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

విష్ణు సవారా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1980లో వాడా శాసనసభ నియోజకవర్గం నుండి (ప్రస్తుతం భివాండి రూరల్) ఓడిపోయి ఆ తరువాత 1990, 1995, 1999, 2004, 2009లో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై 2009లో నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత 2009లో భివండి రూరల్‌ నుండి 2014లో విక్రమ్‌గడ్‌ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో గిరిజనాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు.[2]

విష్ణు సవారా అనారోగ్యంతో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో 9 డిసెంబర్ 2020న మరణించాడు.[3][4]


మూలాలు

మార్చు
  1. "Indian Express: Rane sworn in along with jumbo team". expressindia.indianexpress.com. Retrieved 2014-06-07.
  2. "Photo ! विष्णू सवरा: दुर्गम भागातील कर्तव्य दक्ष मितभाषी नेता!". TV9 Marathi. 10 December 2020. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
  3. "Former Maharashtra minister Vishnu Savara passes away at 70". Timesnownews.com. 9 December 2020. Retrieved 10 December 2020.
  4. "Ex-minister Vishnu Savara dies at 70" (in ఇంగ్లీష్). The Indian Express. 10 December 2020. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.