వీణా నాయర్ భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి. ఆమె ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటిస్తుంది.[1] జిబు జాకబ్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం వెల్లిమూంగా (2014)లో నటించడం ద్వారా ఆమె చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది.[2] [3] వీణ మనోజ్ దర్శకత్వం వహించిన టెలివిజన్ ధారావాహిక ఏంటే మకల్‌లో నటించింది. అలాగే, ఆమె అనేక హాస్య ధారావాహికలలో పాత్రలు పోషించింది. వీణా నాయర్ నిష్ణాతురాలైన నర్తకి. బిగ్ బాస్ సీజన్ 2లో వీణా కంటెస్టెంట్ కూడా.

వీణా నాయర్
జననం (1989-05-21) 21 మే 1989 (age 35)
కొట్టాయం, కేరళ, భారతదేశం
నివాస ప్రాంతంచంగనస్సేరి, కేరళ, భారతదేశం
జాతీయతభారతీయులు
వృత్తిచలనచిత్ర నటి
డాన్సర్
టెలివిజన్ నటి
క్రియాశీలక సంవత్సరాలు2006–ప్రస్తుతం
భార్య / భర్తస్వాతి సురేష్ భైమి (ఆర్ జె అమన్) (m.2014)

వ్యక్తిగత జీవితం

మార్చు

వీణా నాయర్ నాలుగేళ్ల వయసులో నాట్యం నేర్చుకోవడం ప్రారంభించింది. ఆమె భరతనాట్యం,కేరళ నాటన్‌లో రాణించింది. ఆమె గాయకుడు, సంగీత స్వరకర్త, నృత్యకారుడు స్వాతి సురేష్ భైమిని వివాహం చేసుకుంది.[4] ఈ దంపతులకు ధన్విన్ అనే కుమారుడు ఉన్నాడు.

మూలాలు

మార్చు
  1. "actress veena nair on her career". thehindu. Retrieved 2016-01-21.
  2. "Veena Nair Biography". cochintalkies.
  3. "vellimoonga cast&crew". filmibeat. Retrieved 2014-04-25.
  4. "veena-nair-marriage". indiancinemagallery. Archived from the original on 2016-06-01. Retrieved 2016-04-24.
"https://te.wiki.x.io/w/index.php?title=వీణా_నాయర్&oldid=4383335" నుండి వెలికితీశారు