వేదవతి
వేదవతి రామాయణంలో సీత పూర్వజన్మపు పతివ్రత. ఈమెను లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు.
ఈమె బ్రహ్మర్షి కుశధ్వజుడు, మాలావతి దంపతుల కుమార్తె. ఈమె జన్మించినప్పుడు వేదధ్వని వినిపించెను. అందువలన ఈమెకు వేదవతి అని పేరుపెట్టిరి. ఈమెను విష్ణుమూర్తి కే యిచ్చి వివాహము చేయవలెనని కోరుతూ ఎంతటి రాజులకు ఇవ్వలేదు. విష్ణుమూర్తిని భర్తగా పొందడానికి ఈమె తపస్సు చేయుచుండెను. ఆకాశ మార్గమున పోతూ రావణుడు ఈమెను చూచి అందానికి మోహించాడు. తనను పరిణయము చేసుకొమ్మని కోరెను. కానీ వేదవతి తిరస్కరించింది. అందులకు రావణుడు మోహంతో ఆమెను చేపట్టబూనెను. వేదవతి యోగాగ్నిలో దూకి భస్మమయ్యెను.
తర్వాత జన్మమున ఈమె లంకలోనే ఒక పద్మమున జన్మించెను. కానీ జ్యోతిష్యులామె లంకకు అరిష్ట సూచకమని చెప్పుటవలన ఆమెను ఒక పెట్టెలో పెట్టి సముద్ర మద్యములో విడిచిరి. ఆమె మిథిలా నగరములో జనకునికి దొరికి సీతగా పేరొంది, శ్రీరామునికి భార్యగా రావణ సంహారానికి కారణభూతమయ్యెను.
మూలాలు
మార్చు- పూర్వగాథాలహరి, వేమూరి శ్రీనివాసరావు, వేంకట్రామ అండ్ కో., ఏలూరు, 2007.