వేములవాడ శాసనసభ నియోజకవర్గం
కరీంనగర్ జిల్లాలోని 13 శాసనసభ స్థానాలలో వేములవాడ శాసనసభ నియోజకవర్గం ఒకటి. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా 2009లో వేములవాడ శాసనసభ నియోజకవర్గంగా ఏర్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాలు, జగిత్యాల జిల్లాలోని కథలాపూర్, భీమారం, మేడిపల్లి మండలాల్లో విస్తరించి ఉన్న వేములవాడ నియోజకవర్గంలో 2009లో 1,81,512 మంది ఓటర్లు ఉండగా, 2023లో ఆ సంఖ్య 2,22,302 మందికి పెరిగింది. 2009 నుంచి ఒక ఉప ఎన్నికతోపాటు మూడు సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చెన్నమనేని రమేశ్ వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
దేశం | భారతదేశం ![]() |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 18°28′12″N 78°52′12″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,18.47,78.87,300x300.png?lang=te&domain=te.wiki.x.io&title=%E0%B0%B5%E0%B1%87%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4157266&groups=_4c02abfcef9bcc2f68036728365b3d21243f4dbd)
నియోజకవర్గంలోని మండలాలు
మార్చుఇప్పటివరకు ఎన్నికైన శాసనసభ్యులు
మార్చుసం. | ఎ.సి.సం. | నియోజకవర్గ పేరు | రకం | విజేత పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2023[1] | 28 | వేములవాడ | జనరల్ | ఆది శ్రీనివాస్ | పు | కాంగ్రెస్ పార్టీ | 71451 | చల్మెడ లక్ష్మీనరసింహారావు | పు | బీఆర్ఎస్ | 56870 |
2018 | 28 | వేములవాడ | జనరల్ | చెన్నమనేని రమేష్ బాబు | పు | టీఆర్ఎస్ | 84050 | ఆది శ్రీనివాస్ | పు | కాంగ్రెస్ పార్టీ | 55864 |
2014 | 28 | వేములవాడ | జనరల్ | చెన్నమనేని రమేష్ బాబు | పు | టీఆర్ఎస్ | 58414 | ఆది శ్రీనివాస్ | పు | బీజేపీ | 53146 |
2010 | ఉప ఎన్నిక | వేములవాడ | జనరల్ | చెన్నమనేని రమేష్ బాబు | పు | టీఆర్ఎస్ | 79146 | ఆది శ్రీనివాస్ | పు | కాంగ్రెస్ పార్టీ | 28695 |
2009 | 28 | వేములవాడ | జనరల్ | చెన్నమనేని రమేష్ బాబు | పు | టీడీపీ | 36601 | ఆది శ్రీనివాస్ | పు | కాంగ్రెస్ పార్టీ | 34780 |
శాసన సభ్యులు- రమేశ్ బాబు (టీఆర్ఎస్)
మార్చు2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు పోటీ చేస్తుండగా, విద్యాసాగర్ రావు సోదరుడు సిరిసిల్ల శాసన సభ్యుడు రాజేశ్వరరావు కుమారుడు తెలుగుదేశం పార్టీకి చెందిన రమేశ్ బాబు మహాకూటమి తరఫున పోటీలో ఉండగా. కాంగ్రెస్ తరఫున వి.ఆదిశ్రీనివాస్ పోటీ చేసాడు.[2]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ ఈనాడు దినపత్రిక తేది 22-03-2009