వేమూరి రామయ్య
వేమూరి రామయ్య సుప్రసిద్ధ రంగస్థల నటుడు.
వేమూరి రామయ్య | |
---|---|
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రంగస్థల నటుడు |
జీవిత విశేషాలు
మార్చుప్రఖ్యాత రంగస్థల నటులు వేమూరి గగ్గయ్య పుత్రులైన రామయ్య గుంటూరు హిందూ కాలేజీలో చదివారు.
రంగస్థల ప్రస్థానం
మార్చుఎన్ని పాత్రలు ధరించినా 'మహారధికర్ణ', 'యముడు' పాత్రలు రామయ్యకి విశేషమైన పేరు ప్రతిష్టలు తెచ్చాయి. గుంటూరు లో జరిగిన 'ఆంధ్రప్రదేశ్ ఇన్కస్ మహాసభలలో, రామయ్య నటించిన యమధర్మరాజు పాత్రను సోవియట్ రష్యావారు ఫిల్మ్ తీసి, వారిదేశానికి తీసుకెళ్ళారు. వీరు చేసిన సైరంద్రి, బాణాసుర, రాయబారం, సతీసులోచన, భూకైలాస్ వంటి నాటకాలు రేడియోలోను, తారాశశాంకం, మహారధికర్ణ మొదలైనవి టి.వి. లోను ప్రసారమైనాయి. 1950లో'లక్ష్మీగణపతి నాట్యమండలి'ని అనేక ప్రదర్శనలు ఇచ్చారు.
నటించిన నాటకాలు
మార్చు- తులసీజలంధర
- వెంకటేశ్వర మహత్మ్యం
- ఉద్యోగ విజయాలు
- గయోపాఖ్యానం
- పాదుక
- రాధాకృష్ణ
- నారదసంసారం
సన్మానాలు - బిరుదులు
మార్చు1975లో రేపల్లె లో యమధర్మరాజు పాత్రకు, మద్రాసు లో కృష్ణ పాత్రకు, తెనాలి లో జలంధర పాత్రకు (నన్నపనేని వెంకట్రావు), ప్రొద్దుటూరు లో గయోపాఖ్యానం లో అర్జునుని పాత్రకు, హైదరాబాదు రవీంద్రభారతి లో 1968లో కర్ణ పాత్రకు (మంత్రివర్యులు శీలం సిద్దారెడ్డి), శివాజీ పాత్రకు (స్థానం నరసింహారావు), తాడేపల్లిగూడెం లో పసల సూర్యచంద్రరావు లు ఘన సన్మానాలు చేశారు. ఇంకా శ్రీకాకుళం, ఏలూరు, విజయవాడ, బొంబాయి, మద్రాసు, హైదరాబాద్ మొదలైన పట్టణాలలో సన్మానాలు జరిగినాయి.
'నటశేఖరుడు', 'నటరత్న', 'నటకిశోరం', 'నాటక కళాప్రపూర్ణ' (ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ, నాటక అకాడమీ) అనే బిరుదులు పొందారు.
సినిమారంగం
మార్చుసినిమారంగానికి వెళ్లి కృష్ణ కుచేల, నర్తనశాల, వీరాభిమన్యు, శ్రీకృష్ణావతారం, సతీ అరుంధతి, గోవుల గోపన్న వంటి సినిమాలలో నటించారు.
మూలాలు
మార్చు- వేమూరి రామయ్య, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 218.