వేయిలింగాల కోన
వేయిలింగాల కోన ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తికి సమీపంలోని ఒక దేవాలయం, ఒక చిన్న జలపాతం.[1][2] ఈ ఆలయంలో ఒకే శివలింగంపై చెక్కిన వేయి లింగాలను గమనించవచ్చు. ఈ మూర్తిని యక్షేశ్వర స్వామి అని కూడా అంటారు. ఈ ఆలయం తిరుపతి నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలోనూ, శ్రీకాళహస్తి ఆలయం నుంచి సుమారు పదికిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ముందుగా ఆటోలు, బస్సులు లేదా స్వంత వాహనాల్లో రామాపురం గ్రామాన్ని చేరుకోవాలి. ఆ గ్రామాన్ని దాటిన తర్వాత ఒక కొండను ఎక్కి దిగి మరల కొండ ఎక్కితే ఈ ఆలయం దర్శనమిస్తుంది. ఆలయం పక్కనే ఓ జలపాతం కూడా ఉంది. ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి మహాశివరాత్రి పర్వదినాల్లో ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు.
ఇక్కడి జలపాతంలోని నీళ్ళకు అనారోగ్యాల్ని, ముఖ్యంగా చర్మ వ్యాధులను నయం చేసే గుణముందని సందర్శకుల విశ్వాసం.[3] కాబట్టి ఇక్కడికి వచ్చిన వారు ఎక్కువమంది జలపాతంలో స్నానం చేయడం ఆనవాయితీ. వర్షాకాలంలోనూ, దాని తరువాత కొద్ది నెలలు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అనువైన సమయం.[4]
మూలాలు
మార్చు- ↑ "సన్నిదానం వెబ్ సైటులో శ్రీకాళహస్తి గురించిన సమాచారం". sannidanam.com. Retrieved 12 October 2016.[permanent dead link]
- ↑ "శ్రీకాళహస్తిలో చూడతగిన స్థలాలు". nativeplanet.com. Archived from the original on 10 అక్టోబరు 2016. Retrieved 12 October 2016.
- ↑ "వేయిలింగాల కోన జలపాతం శ్రీకాళహస్తి". templesinindiainfo.com. Archived from the original on 18 మార్చి 2017. Retrieved 12 October 2016.
- ↑ "వేయిలింగాల కోన, శ్రీకాళహస్తి". gotirupati.com. Archived from the original on 17 మే 2015. Retrieved 12 October 2016.