శంకరాభరణం (2015 సినిమా)
శంకరాభరణం 2015 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. యంవివి సినిమా పతాకంపై యంవివి సత్యనారాయణ నిర్మించాడు. కోన వెంకట్ రాసిన కథతో ఉదయ్ నందనవణం దర్శకుడిగా పరిచయం అయ్యాడు. 2010 లో హిందీలో విడుదలైన ఫస్ గయే రే ఒబామా సినిమాకి రీమేక్ ఈ చిత్రం. ఛాయాగ్రాహణం సాయి శ్రీరాం, సంగీతం ప్రవీణ్ లక్కరాజు అందించారు. నిఖిల్ సిద్ధార్థ్, నందిత రాజ్, అంజలి, సంపత్ రాజ్, సుమన్, రావు రమేశ్ తదితరులు నటించారు.
శంకరాభరణం | |
---|---|
దర్శకత్వం | ఉదయ్ నందనవనం |
రచన | కోన వెంకట్ |
కథ | కోన వెంకట్ |
నిర్మాత | ఎంవీవీ సత్యనారాయణ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | సాయి శ్రీరామ్ |
కూర్పు | ఛోటా కే ప్రసాద్ |
సంగీతం | ప్రవీణ్ లక్కరాజు (ప్రవీణ్ టామీ) |
నిర్మాణ సంస్థ | యంవివి సినిమా |
విడుదల తేదీ | 4 డిసెంబరు 2015 |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- నిఖిల్ సిద్ధార్థ్ (గౌతమ్)
- నందిత రాజ్ (హ్యాపీ ఠాకూర్)
- అంజలి (డాఖు రాణి మున్నీ)
- సంపత్ రాజ్ (కేంద్ర మంత్రి లాల్ / కృష్ణ (ద్వంద్వ పాత్ర))
- సుమన్ (రఘు, గౌతమ్ తండ్రి)
- సితార (రజో దేవి, గౌతమ్ తల్లి)
- రావు రమేశ్ (బద్రీనాథ్ ఠాకూర్, హ్యాపీ తండ్రి)
- సంజయ్ మిశ్ర (భాయ్ సాబ్)
- సప్తగిరి (అక్షయ్ కుమార్)
- పృథ్వీరాజ్ (ఎస్. ఐ శాతం పరమేష్)
- సత్యం రాజేష్ (లక్ష్మణ యాదవ్)
- ప్రవీణ్
- దిక్షా పంత్
- గీతా సింగ్
- అంకిత శర్మ
- శకలక శంకర్
- హర్ష చెముడు