శాఖా గ్రంథాలయం
శాఖా గ్రంథాలయం, అనగా ప్రభుత్వానికి సంబంధించింది.దీనిని బ్రాంచి లైబ్రరీ,కమ్యూనిటీ గ్రంథాలయం, కమ్యానిటీ లైబ్రరీ అని కూడా అంటారు. ఇది గ్రంధాలయ వ్యవస్థలో భాగమైన ఒక లైబ్రరీ. ఇవి ప్రధాన గ్రంధాలయం, లేదా ప్రభుత్వ శాఖ, ప్రవేటు సంస్థలకు,యాజమాన్యాలకు అనుబంధంగా పనిచేస్తాయి. అయితే ఇవి అన్ని ప్రాంతాలలో లేవు.కానీ ఉన్నవాటిని ప్రాంతాలవారిగా వర్గీకరించి,వాటిని అన్ని ప్రధాన శాఖలకు అనుసంధానించబడి ఉంటాయి.గ్రంధాలయ వ్యవస్థలో భాగమైన ఈ బ్రాంచి గ్రంధాలయ సంస్థను ఏకీకృత గ్రంధాలయ వ్యవస్థ ద్వారా శాఖా గ్రంథాలయాలను పోషిస్తుంది.[1]
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/9/9f/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%A5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF%E0%B0%82IMG20200217180814.jpg/220px-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%A5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF%E0%B0%82IMG20200217180814.jpg)
కొన్ని దేశాలలో మునిసిపాలిటీలకు వారి స్వంత లైబ్రరీ వ్యవస్థ ఉంటుంది.ఉదాహరణకు:16 లైబ్రరీ శాఖలతో లండన్ పబ్లిక్ లైబ్రరీ (కెనడా), 64 లైబ్రరీలతో హెల్సింకి మెట్రోపాలిటన్ ఏరియా లైబ్రరీస్,[2] 685 శాఖలతో వెనిజులా నేషనల్ లైబ్రరీ ప్రధాన శాఖలు ఉన్నాయి.కొన్ని ప్రసిద్ధ లైబ్రరీ శాఖలలో న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్లో భాగమైన న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ మెయిన్ బ్రాంచ్, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్ శాఖ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మెమోరియల్ లైబ్రరీ ఉన్నాయి.
మొదటి గ్రంథాలయం అసోసియేషన్
మార్చుఆంధ్రదేశ్ గ్రంథ భాండాగారం సంఘం అనే పేరుతో చిలకమర్తి లక్ష్మీ నరసింహ పంతులు పిలుపు ఇచ్చిన స్పూర్తితో 1914 ఏప్రియల్ 14 న విజయవాడలో స్థాపించబడింది.ఇది భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి లైబ్రరీ అసోసియేషన్. తరువాట దీనిని ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ అని పేరు పెట్టారు.[3]
శాఖా గ్రంధాలయం ప్రయోజనాలు
మార్చు- గ్రంధాలయం కమ్యూనిటీ సర్వీస్, ఇన్ఫర్మేషన్ బ్యూరో, కంటిన్యూషన్ స్కూల్, ప్రజాస్వామ్యం కోసం ఒక శిక్షణా పాఠశాలగా పరిగణిస్తారు.జీవితంలో సమాజం ఆదర్శవంతమైన జీవితాన్ని, ఆదర్శాలను రూపొందించడంలో అమూల్యమైన సేవలను గ్రంధాలయం అందిస్తుంది.
- ఇది జీవితంలోని ప్రతి నడకలో వ్యక్తుల పురోగతికి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది.
- ఇది వయస్సు, వృత్తి, జాతి, లింగం, రంగు, మతంతో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా తెరవబడుతుంది.అవసరమైన ఏ సాహిత్యానికైనా ఉచిత ప్రాప్తిని అందిస్తుంది.జ్ఞాన సంపదను పెంపొందించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రంధాలయ శాఖలు
మార్చుతెలంగాణ విడిపోకముందు ఆంధ్రప్రదేశ్లో అన్ని శాఖలకు చెందిన గ్రంధాలయాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.[4]వీటిని రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్, జిల్లా స్థాయిలో జిల్లా లైబ్రరీ అసోసియేషన్ నియంత్రణలో పనిచేస్తాయి.
- స్టేట్ సెంట్రల్ లైబ్రరీ -1
- స్టేట్ రీజనల్ లైబ్రరీస్ -5
- జిల్లా సెంట్రల్ -23
- బ్రాంచి గ్రంధాలయాలు -804
- గ్రామ గ్రంధాలయాలు -199
- బుక్ డిపాజిట్ సెంటర్సు -602
- పంచాయితీ,ఇతర సంస్థల గ్రంధాలయాలు -2315
మూలాలు
మార్చు- ↑ "Definition of BRANCH". www.merriam-webster.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-28.
- ↑ https://web.archive.org/web/20140808044631/http://www.iii.com/news/pr_display.php?id=559
- ↑ "About Us". Welcome to Andhra Pradesh Library Association (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-07-14. Retrieved 2020-07-28.
- ↑ https://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/86860/12/12_chapter%203.pdf