శివాజీరావు నాయక్

శివాజీరావు యశ్వంతరావు నాయక్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు షిరాల శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.

శివాజీరావు నాయక్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - 2019
ముందు మాన్‌సింగ్ ఫత్తేసింగ్రావ్ నాయక్
తరువాత మాన్‌సింగ్ ఫత్తేసింగ్రావ్ నాయక్
నియోజకవర్గం షిరాల

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1995 - 2009
ముందు శివాజీరావు దేశ్‌ముఖ్
తరువాత మాన్‌సింగ్ ఫత్తేసింగ్రావ్ నాయక్
నియోజకవర్గం షిరాల

వ్యక్తిగత వివరాలు

జననం 1945 మార్చి 2
తాడ్వాలే గ్రామం, షిరాలా మండలం, సాంగ్లీ జిల్లా, మహారాష్ట్ర భారతదేశం[1]
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

శివాజీరావు నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి 1995 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 1995 నుండి 1999లో శివసేన-బిజెపి ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పని చేసి ఆయన ఆ తరువాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి 1999, 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

శివాజీరావు నాయక్ 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2022 ఏప్రిల్ 02న శరద్ పవార్ సమక్షంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[2][3][4]

మూలాలు

మార్చు
  1. "शिराळा विधानसभा मतदारसंघ – म. क्र. २८४". My Mahanagar. 9 September 2019. Archived from the original on 15 January 2025. Retrieved 15 January 2025.
  2. "Maharashtra: BJP gets major setback after former minister Shivajirao Naik joins NCP" (in ఇంగ్లీష్). Free Press Journal. 2 April 2022. Archived from the original on 15 January 2025. Retrieved 15 January 2025.
  3. "माजी मंत्री शिवाजीराव नाईक यांची राष्ट्रवादीत घरवापसी; शरद पवारांच्या उपस्थितीत प्रवेश, म्हणाले". 2 April 2022. Archived from the original on 15 January 2025. Retrieved 15 January 2025.
  4. "भाजपचे विनोद तावडे-पवार गटाचे शिवाजीराव नाईक भेट; राजकीय चर्चांना सुरुवात". Loksatta. 29 August 2024. Archived from the original on 15 January 2025. Retrieved 15 January 2025.