శ్రీరంగం నారాయణబాబు
శ్రీరంగం నారాయణబాబు (మే 17, 1906 - అక్టోబర్ 2, 1961) ప్రముఖ తెలుగు కవి.
జననం
మార్చువీరు విజయనగరంలో, 1906, మే 17వ తేదీన జన్మించారు. వీరు ఆజన్మ బ్రహ్మచారి గా జీవితం గడిపారు.
నారాయణబాబు పద్య రచనలకు, భావ కవిత్వానికి భిన్నంగా కొంతమందితో కలసి సర్రియలిజం (Surrealism) అనే విదేశీయ ప్రక్రియను అనుసరించి రచనలు చేశారు. ఒక యదార్థ రూపాన్ని కవితలోనో, చిత్రలేఖనంలోనో చూపించినపుడు, ఆ విషయం యొక్క మూల స్వరూపాన్ని వివిధ విపరీత పరిస్థితులలో వర్ణించి మరువలేని చిత్రంగా ప్రదర్శించడమే "సర్రియలిజం" అంటారు. దీనిని "అధివాస్తవికత" అని కొందరు అంటే "అతి వాస్తవికత" అంటే బాగుంటుందని వీరు భావించారు. విధానం విదేశీయమైనది అయినా మన దేశపు పౌరాణిక గాథలు, సమయోచితమైన అర్థాన్నిచ్చే ఆంధ్ర, సంస్కృత శబ్ద ప్రయోగం వీరి రచనలకు ప్రత్యేక లక్షణాలు.
మరణం
మార్చువీరు 1961, అక్టోబర్ 2వ తేదీన చెన్నైలో పరమపదించారు.
రచనలు
మార్చు- విశాఖపట్నం
- ఫిడేలు నాయుడుగారి వేళ్ళు
- గడ్డిపరక
- గేదెపెయ్యె
- తెనుగురాత్రి
- రుధిరజ్యోతి
- కపాలమోక్షం
- కిటికీలో దీపం
- ఊరవతల
- పండగనాడు
- మౌన శంఖం
- సంపంగి తోట
- రుధిరజ్యోతి ని శ్రీశ్రీ గారికి అంకితమిచ్చారు