సంఘ్ పరివార్
సంఘ్ పరివార్, హిందూ జాతీయవాదుల సంస్థల కుటుంబాన్ని సూచిస్తుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) సభ్యులచే లేదా దాని ఆలోచనల ప్రేరణతో ఇది ప్రారంభించబడింది. సంఘ్ పరివార్ హిందూ జాతీయోద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆర్.ఎస్.ఎస్, అనేక చిన్న సంస్థలను ఇది కలిగి ఉంది, ఇందులోని సభ్యులు, విషయాల పరిధిలో విభిన్న అభిప్రాయాలు వెలిబుచ్చుతారు. నామమాత్రంగా, వివిధ సంస్థలు సంఘ్ పరివార్ పరిధిలో స్వతంత్రంగా పనిచేస్తాయి, వివిధ విధానాలను, కార్యకలాపాలను కలిగి ఉంటాయి.[1]
చరిత్ర
మార్చు1960 లలో ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకులు, ప్రముఖ గాంధేయవాది వినోభాభావే నేతృత్వంలోని భూదాన్, భూ సంస్కరణ ఉద్యమంలో, మరో గాంధేయవాది జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని సర్వోదయలో సహా భారతదేశంలోని వివిధ సామాజిక, రాజకీయ ఉద్యమాలలో చేరారు. కార్మిక సంఘాల ఏర్పాటుకు, భారతీయ మజ్దూర్ సంఘ్, విద్యార్థుల సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, సేవా భారతి, లోక్ భారతీ, దీనదయాళ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి మొదలైన అనేక ఇతర సంస్థలకు కూడా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తోడ్పాటునందించింది. ఆర్.యస్.యస్ స్వయం సేవకులు ప్రారంభించిన, తోడ్పాటునందించిన సంస్థలన్నింటిని కలిపి సంఘ్ పరివార్ గా పేర్కొంటారు.[2]
సభ్యత్వ సంస్థలు
మార్చుసంఘ్ పరివార్ ఈ క్రింది సంస్థలను కలిగి ఉంది (బ్రాకెట్లలో 1998 నాటి సభ్యత్వం సంఖ్యలు):
- భారతీయ జనతా పార్టీ (బిజెపి) - భారతీయ రాజకీయ పార్టీ (23m) [3]
- భారతీయ కిసాన్ సంఘ్ - భారతీయ రైతుల సంస్థ (8m) [3]
- భారతీయ మజ్దూర్ సంఘ్ - భారతీయ కార్మిక సంస్థ (2009 వరకు 10 మిలియన్లు 2009 వరకు) [3]
- మత్స్యకారుల సహకార సంఘం - (2.2m) [3]
- వివేకానంద మెడికల్ మిషన్ - (1.7m) [3]
- అఖిల భారత శైక్షిక్ మహా సంఘ్ - భారతీయ ఉపాధ్యాయ సంస్ధ (1.8m) [3]
- భారతీయ వికాస్ పరిషత్ - (1.8m) [3]
- దీన్ దయాళ్ శోధ్ సంస్థాన్ - (1.7m) [3]
- రాష్ట్రీయ సేవికా సమితి - రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ మహిళా సంస్ధ (1.8m) [3]
- అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ - భారతీయ విద్యార్థి సంఘం (2.8m) [3]
- భారతీయ జనతా యువ మోర్చా - బిజెపి యువ సమూహం (1.8m) [3]
- శిక్షా భారతి (2.1m) [3]
- విశ్వ హిందూ పరిషత్, ప్రపంచ హిందువుల సమూహం (2.8m) [3]
- హిందూ స్వయం సేవక్ సంఘ్ - విదేశాల్లో ఉండే హిందువుల సమూహం
- స్వదేశీ జాగరణ్ మంచ్ - స్వదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది
- విద్యా భారతి - శ్రీ సరస్వతీ శిశు మందిర్ పేరుతో నడిచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ విద్యా సంస్ధలు
- లోక్ భారతి - జాతీయ ప్రభుత్వేతర సంస్థ
- ధర్మ జాగరణ సమితి - హిందూ ధర్మ ప్రచారం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ
- వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ - గిరిజనుల అభివృద్ధి సంస్థ
- ముస్లిం రాష్ట్రీయ మంచ్ - ముస్లింల అభివృద్ధి సంస్థ
- భజరంగ్ దళ్ - హిందూ ధర్మాన్ని రక్షించే హనుమంతుడి భక్తుల సంఘం (2m)
- భారత్ టిబెట్ మైత్రి సంఘ్ - భారతీయ టిబెట్ మిత్రుల సంస్థ
- సామాజిక సమరసతా వేదిక - దళితుల అభివృద్ధి సంస్థ
- సంస్కార భారతి - కళాకారుల సంస్థ
- సాక్షర భారత్ - సహకార సంస్థ
- సేవా భారతి - నిరుపేదల సేవా సంస్థ (1984 లో స్థాపితం)
- భారతీయ విచారణ కేంద్రం
- భారతీయ ఇతిహాస సంకలన యోజన
- దీన్ దయాళ్ పరిశోధన సంస్థ
- విశ్వ సంవాద కేంద్రం - ఐటి ప్రొఫెషనల్ బృందాన్ని కలిగి ఉన్న మీడియా సంబంధిత పనుల కోసం భారతదేశం అంతటా వ్యాపించి ఉన్న సంస్ధ [1] Archived 2018-03-16 at the Wayback Machine
- రాష్ట్రీయ సిఖ్ సంగత్ - సిక్కుల అభివృద్ధి సంస్థ
మూలాలు
మార్చు- ↑ Christophe Jaffrelot, The Hindu nationalist Movement in India, Columbia University Press, 1998
- ↑ http://publication.samachar.com/topstorytopmast.php?sify_url=http://www.suryaa.com/showNational.asp?ContentId=12667 Archived 2012-01-17 at the Wayback Machine.
- ↑ 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 3.10 3.11 3.12 Jelen 2002:253