సత్యవతి రాథోడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తరపున డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం నుండి 2009లో ప్రాతినిథ్యం వహించింది. 2014, మార్చి 2న తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరింది.[1][2]

సత్యవతి రాథోడ్
సత్యవతి రాథోడ్


గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 సెప్టెంబర్ 8-2023 డిసెంబర్ 3
నియోజకవర్గం డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం అక్టోబరు 31, 1969
గుండ్రాతిమడుగు, కురవి మండలం, వరంగల్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ, 2014 నుండి భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి గోవింద రాథోడ్
సంతానం సునీల్‌కుమార్‌ రాథోడ్, డా.సతీష్‌ రాథోడ్‌
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

జననం - విద్యాభ్యాసం

మార్చు

సత్యవతి రాథోడ్ 1969, అక్టోబరు 31న లింగ్యానాయక్[3], దశమి దంపతులకు వరంగల్ జిల్లా కురవి మండలంలోని గుండ్రాతిమడుగు లో జన్మించింది. మూడవ తరగతి వరకు చదువుకుంది.[4]

వివాహం - పిల్లలు

మార్చు

1982, మే 5న గోవింద రాథోడ్ తో సత్యవతి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు (సునీల్, సతీష్). 2009, జూలై 20న గోవింద్ రాథోడ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.[5]

రాజకీయరంగ ప్రస్థానం

మార్చు

సత్యవతి 1984లో రాజకీయాల్లోకి ప్రవేశించింది. 1985లో జిల్లా తెలుగు మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఎన్నికెంది. 1988 నుండి 1991 వరకు పంచాయితీ రాజ్ పరిషత్ సభ్యరాలుగా పనిచేసింది. 1996లో గుండ్రాతిమడుగు సర్పంచ్ గా ఉన్నారు.2006లో కురవి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచి, స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా పని చేసింది.

1989లో తెలుగుదేశం పార్టీ తరఫున డోర్నకల్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డీఎస్‌ రెడ్యానాయక్‌ చేతుల్లో స్వల్ప ఓట్లతేడాతో ఓటమిని చవి చూసింది. 2009 సంవత్సరంలో టీడీపీ నుంచి డోర్నకల్‌ ఎమ్మెల్యేగా పోటీచేసి కాంగ్రెస్‌ తరుపున పోటీచేసిన రెడ్యానాయక్‌పై గెలుపొందింది. 2014లో తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరింది. 2014లో డోర్నకల్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి రెడ్యానాయక్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. 2019లో టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైంది. 16 ఏప్రిల్ 2019 న ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసింది.[6] 2019 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది. ఆమెకు గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలను కేటాయించారు. 2019 లో జరిగిన హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో ఆమెను నియోజకవర్గ ఇంచార్జి గా నియమించారు.[7][8][9][10][11]

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు బీఆర్‌ఎస్‌ తరఫున మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో 9 మందితో రైతు ఆత్మహత్యలపై అధ్యయన కమిటీని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఏర్పాటు చేశాడు. ఈ కమిటీలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ సభ్యురాలిగా ఉంది.[12][13]

సత్యవతి రాథోడ్ శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్‌‌గా 2025 ఫిబ్రవరి 4న నియమితురాలైంది.[14][15]

మూలాలు

మార్చు
  1. తెలుగు వన్ ఇండియా. "టిడిపికి, పదవికి సత్యవతి రాథోడ్ రాజీనామా: తెరాసలోకి". telugu.oneindia.com. Retrieved 15 May 2017.
  2. సాక్షి, తెలంగాణ (16 June 2019). "అప్పట్లో ఎన్టీఆర్‌.. ఇప్పుడు మహేశ్‌ బాబు". Sakshi. Archived from the original on 8 September 2019. Retrieved 8 September 2019.
  3. Sakshi (18 February 2022). "మంత్రి సత్యవతి రాథోడ్‌కు పితృవియోగం". Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.
  4. Sakshi (9 September 2019). "స్వరాష్ట్రంలో తొలి గిరిజన మహిళా మంత్రి". Archived from the original on 6 జనవరి 2022. Retrieved 6 January 2022.
  5. తెలుగు వెబ్ దునియా. "డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి భర్త మృతి". telugu.webdunia.com. Retrieved 15 May 2017.
  6. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
  7. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (8 September 2019). "ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం". ntnews.com. Archived from the original on 8 September 2019. Retrieved 31 October 2019.
  8. సాక్షి, తెలంగాణ (8 September 2019). "శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ". Sakshi. Archived from the original on 8 September 2019. Retrieved 31 October 2019.
  9. నమస్తే తెలంగాణ, MAHABUBABAD NEWS (9 September 2019). "సర్పంచ్‌ నుంచి మంత్రి వరకు..." ntnews.com. Archived from the original on 9 September 2019. Retrieved 31 October 2019.
  10. నమస్తే తెలంగాణ, తాజావార్తలు (16 September 2019). "మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్యవతి రాథోడ్..." ntnews.com. Archived from the original on 16 September 2019. Retrieved 31 October 2019.
  11. Namasthe Telangana (6 May 2021). "బంజారా, ఆదివాసీ భవనాలను ప్రారంభానికి సిద్ధం చేయండి". Archived from the original on 6 మే 2021. Retrieved 6 May 2021.
  12. "రైతు ఆత్మహత్యలపై భారాస అధ్యయన కమిటీ". 21 January 2025. Archived from the original on 21 January 2025. Retrieved 21 January 2025.
  13. "రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ.. రెండు వారాల పాటు అన్ని జిల్లాల్లో పర్యటన". NT News. 20 January 2025. Archived from the original on 21 January 2025. Retrieved 21 January 2025.
  14. "శాసనమండలిలో బీఆర్‌ఎస్‌ విప్‌లుగా సత్యవతిరాథోడ్‌, కేపీ వివేకానంద్‌". Andhrajyothy. 5 February 2025. Archived from the original on 5 February 2025. Retrieved 5 February 2025.
  15. "భారాస విప్‌లుగా వివేకానంద, సత్యవతి". Eenadu. 5 February 2025. Archived from the original on 5 February 2025. Retrieved 5 February 2025.

ఇతర లంకెలు

మార్చు