సత్యవాడ (ఓగేటి) ఇందిరాదేవి

(సత్యవాడ ఇందిరాదేవి నుండి దారిమార్పు చెందింది)

సత్యవాడ (ఓగేటి) ఇందిరాదేవి[1] పేరుపొందిన రచయిత్రి. ఈమె 1943, జూలై 21వ తేదీ గుంటూరుజిల్లా యాజలి గ్రామంలో ఓగేటి చంద్రమౌళి, విశాలాక్షీ అన్నపూర్ణ దంపతులకు జన్మించింది. ఎం.ఎ (తెలుగు) ఉత్తీర్ణురాలై మాడపాటి హనుమంతరావు స్వర్ణపతకాన్ని సాధించింది. హైదరాబాదులోని గవర్నమెంట్ సిటీ కాలేజిలో ఆంధ్రశాఖకు అధిపతిగా పనిచేసి స్వచ్ఛంద పదవీవిరమణ చేసింది. ఈమె వివిధ ప్రక్రియలలో రచనలు చేసింది. శతకాలు, గేయాలు, సాహితీ రూపకాలు, నాటికలు, చారిత్రక నవలలు, సాంఘిక నవలలు, కథలు,వ్యాసాలు రచించింది. ఈమె రచనలు వివిధ పత్రికలలో అచ్చయ్యాయి. ఆకాశవాణి, దూరదర్శన్‌లలో అనేక కార్యక్రమాలలో పాల్గొన్నది. ఈమె 2009 మే 25 న మరణించింది.

సత్యవాడ(ఓగేటి) ఇందిరాదేవి
జననంఓగేటి ఇందిరాదేవి
(1943-07-21)1943 జూలై 21
India యాజలి గ్రామం, కర్లపాలెం మండలం,గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం2009 మే 25
హైదరాబాదు
వృత్తిఅధ్యాపకురాలు
మతంహిందూ
భార్య / భర్తసత్యవాడ వెంకట సుబ్బారావు
పిల్లలుశ్రీధర్, శాంతిప్రియ
తండ్రిఓగేటి చంద్రమౌళి
తల్లివిశాలాక్షీ అన్నపూర్ణ

రచనలు

మార్చు

నవలలు

మార్చు
  1. శ్రీకృష్ణశ్శరణంమమ (పౌరాణికం)
  2. మధురానుబంధం (సాంఘికం)
  3. ఆశాజ్యోతి (సాంఘికం)
  4. అమ్మా! అమ్మా! (సాంఘికం)
  5. మృణాళిని (సాంఘికం)
  6. ఆనందధార (చారిత్రకం)
  7. అమృతవర్షిణి (చారిత్రకం)
  8. మా తెలుగుతల్లికి మల్లెపూదండ
  9. కోటలో నా రాజు (చారిత్రక)
  10. నిరుడు కురిసిన హిమసమూహములు(చారిత్రకం)
  11. శ్రీ కళ్యాణభారతి

కథాసంపుటాలు

మార్చు
  1. వసంతరాజీయం
  2. నీకుతోడూ నాకు నీడా
  3. అగ్నిపునీతా! వసంతా!
  4. ఇహం గేహే లక్ష్మీః
  5. ఇందిరాదేవి కథలు
  6. ఇందిరాకథనం

నాటకాలు, సాహిత్యరూపకాలు

మార్చు
  1. ఇందిరా మందిరం (సాహిత్యరూపకం)
  2. కాకతీయ వైభవం (నాటికల సంపుటి)
  3. ధీరభారతి (సాహిత్యరూపకం)
  4. జానకీ విజయం (సాహిత్యరూపకం)
  5. శారదా విజయం (సాహిత్యరూపకం)
  6. సంబరాల సంక్రాంతి! (నాటకం)
  1. అగ్ని పునీతా వసంతా
  2. అన్నపూర్ణ
  3. అమ్మలగమ్మ అమ్మ
  4. అమ్మా నాన్నా
  5. అయామ్ ముహూర్తస్తు
  6. ఆరతి
  7. ఇదండీ లోకం
  8. ఇయంగేహే లక్ష్మీ
  9. ఈ కన్నీరు పోగొట్టేదెవరు
  10. ఎవరురా గతి నీకు?
  11. ఏది ధర్మం
  12. ఏదేశమేగినా
  13. కంఫర్ట్
  14. కనకాభిషేకాలు
  15. కన్యధార
  16. కుశకుముద్వతి
  17. కోరికలు సంకెళ్లు
  18. క్షమ
  19. గర్జంతమ్ గర్జయంతమ్
  20. గీత
  21. ఘటన
  22. చక్రభ్రమణం
  23. చైతన్య మానసం
  24. జననీ జన్మభూమిశ్చ
  25. తనదాకా వస్తే కానీ
  26. తమ్ముడా! మాయనిత్తువే ...?"
  27. తిరగబడ్డ గులాబీ
  28. నమశ్శివాభ్యామ్
  29. నీకోసమే ఈ ...
  30. పందింట్లో పెళ్లవుతుంది
  31. పగ
  32. పాపం వంచిత
  33. పెనంనుంచి పొయ్యిలోకి
  34. పేకాటలో వసంతరాజకీయం
  35. పేర్వెల్ మై హజ్బెండ్
  36. ఫాషన్
  37. బంగారు పాపాయి
  38. బాబుకోసం
  39. మధుమతి
  40. మనసూ మనువూ
  41. మమదేహి కరావలంబం
  42. మహామాయామయ...
  43. మొదటి పాఠం
  44. రంభాశోకం
  45. రాగమాలిక
  46. రావుగారి రిటైర్మెంట్
  47. రాత్రౌ తరతి నర్మదా![2]
  48. వంశాకురం
  49. వర్థల్లు మహాకవీ వర్థిల్లు!
  50. వర్షించని మేఘం
  51. వసంత రాజీయం
  52. వసంతరాజీయంలో పెళ్లిళ్ళపర్వం
  53. విచిత్ర గార్హస్థ్యం
  54. విజయోస్తు
  55. విధి పన్నిన పన్నాగం
  56. వెన్నెల కిరణాలు
  57. శేఖరం ఔదార్యం
  58. సత్యలోకంలో...
  59. సరస్సరస్వతీసహిత
  60. సింహాచలం...
  61. సుధా మధువూ
  62. సుమాదవం
  63. స్త్రీ సాహసం
  64. స్వర్గానికి

ఇతరాలు

మార్చు
  1. వ్యాసమంజరి
  2. ఇందిరాదర్శనం (వ్యాసాల సంపుటి)
  3. ఇందిరాగేయాలు (గేయసంపుటి)
  4. స్తుతివైజయంతి (గేయసంపుటి)
  5. వేంకటేశ్వర శతకం
  6. షిరిడీ నివాస శతకం

పురస్కారాలు

మార్చు
  • సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శ్రీరామనవమి ప్రతిభాపురస్కారం
  • తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం
  • సారస్వతసమితి మచిలీపట్నం వారి ఉగాది పురస్కారం
  • నోరినరసింహశాస్త్రి స్మారక పురస్కారం మొదలైనవి.

మూలాలు

మార్చు
  1. ఆంధ్రప్రభలో ఇందిరాదేవి గురించి[permanent dead link]
  2. "కథాజగత్‌లో". Archived from the original on 2016-03-04. Retrieved 2014-11-28.