సహాయం:IPA for English
వికీపీడియా అంతటా, ఆంగ్ల పదాల ఉచ్ఛారణ అంతర్జాతీయ ధ్వన్యాత్మక వర్ణమాల (IPA) ద్వారా తెలీయజేయబడి ఉంది. IPA యొక్క నిర్వచణం కొరకు, en:Help:IPA/Introduction చూడండి. ముఖ్యంగా, క్రింది పట్టిక వివిధ ఆంగ్ల ధ్వనుల సంబంధిత గుర్తులను సూచిస్తుంది; మరింత పూర్తి జాబితా కోసం, en:Help:IPA చూడండి, అందులో ఆంగ్ల భాషలో ఏర్పడని ధ్వనుల కుడా ఉన్నాయి. (IPA గుర్తులు మీ బ్రౌజర్లో సరిగ్గా కనపడకుంటే, వ్యాసం క్రిందన ఉన్న లింకులను చూడండి.)
మాండలిక వైవిధ్యాలు
మార్చుఈ జాబితా ప్రామాణిక జనరల్ అమెరికన్, స్వీకరించిన ఉచ్చారణ, కెనడా ఆంగ్లం, దక్షిణాఫ్రికా ఆంగ్లం, ఆస్ట్రేలియన్ ఆంగ్లం, మరియు న్యూజీలాండ్ ఆంగ్లాల ఉచ్చారణలను చూపిస్తుంది. అన్ని వ్యత్యాసాలు ఏదో ఒక మాండలికానికి మాత్రమే కలిగినవి కావు.
- ఉదాహరణకు, cot /ˈkɒt/ నూ caught /ˈkɔːt/ నూ ఒకేవిధంగా పలికినప్పుడు, వ్రాత అచ్చులు o, au లను విలక్షణం చేయనట్లే, /ɒ/ మరియు /ɔː/ గుర్తుల మధ్య తేడా పట్టించుకోనవసరం లేదు.
- చాలా మాండలికాలలో, /r/ కేవలం అచ్చు తర్వాతనే వస్తుంది; ఈ మాండలికం ఉపయోగించేవారు, /r/ పలుకుట విడిచిపెట్టవచ్చు, ఉదా: cart /ˈkɑrt/.
- మరికొన్ని మాండలికాలలో, ఒకే ఉచ్చారణలో /j/ (య) /t, d, n/ వంటి అక్షరాల తరువాత రాలేదు (ట్య, డ్య వంటివి); ఉదాహరణకు కొంతమంది అమెరికన్లు, న్యూయార్క్ లోన yaను పలుకరు, /njuː/లో ఉన్న /j/ను మరవాలి.
అదేవిధంగా, కొందరు గ్రహించగలిగే విలక్షణాలు ఈ పట్టికలో ఉండకపోవచ్చు, ఎందుకంటే వికీపీడియా వాడే నిఘంటువులలో అవి చాలా తక్కువగా వాడబడతాయి:
- స్కాటిష్ మరియు ఐరిష్ fir, fur ఇంకా fern లలో అచ్చులలో ఉన్న భేదాలు.
- బ్రిటిష్ మఱియు వెల్ష్ "pain" ఇంకా "pane" లలో అచ్చులలో ఉన్న భేదాలు.
ఇతర మాటలలో వ్యక్తిని బట్టి వివిధ అచ్చులు ఉండవచ్చు. ఉదాహరణకు Bath (స్నానం) అసలకి /æ/ అచ్చు (catలో వలె) ఉండేది, కాని నేటి జనం చాలామంది /ɑː/ అచ్చును (fatherలో వలె) వాడుతున్నారు.
జాబితా
మార్చు(SMALL CAPITALS దస్తూరిలో ఉన్న పదాలు ప్రామాణిక నిఘంటు సమితులు. BATH మఱియు CLOTH వంటి పదాలకు రెండు పలుకులు ఉంటాయి, వరుసగా ఒకదానికి /ɑː/ ఇంకా /æ/, మరొకదానికి /ɒ/ ఇంకా /ɔː/).
|
|
~ ఉన్నవి సుమారు శబ్దాలు, లేకుంటే ఖచ్చితమైనవి. తెలుగు ఉదాహరణలలో దోషం ఉందన్నా, మరొక ఉచ్చారణ ఉదాహరణ అవసరం అని భావించినా సహాయం చర్చ:IPA for Englishలో మాట్లాడండి.
వీటిని కూడా చూడండి
మార్చు- ఒకవేళ మీ బ్రౌసర్ IPA గుర్తులను ప్రదర్శించకపోతే, IPA కలిగి ఉన్న ఖతులను మీరు ఇంస్టాల్ చేయవలసి ఉంది. కొన్ని ఉచిత ఖతులు: జెంటియం మఱియు చారిస్ సిల్ (ఇంకాస్త పూర్తిది); దిగుమతి లింకులు ఆయా పేజీలలో లభిస్తాయి.
- వికీపీడియా కథనాలలో పరాయిభాష ఉచ్చారణలను జోడించడం కొరకు, {{IPA}} మూసను చూడండి.
- వికీపీడియా కథనాల IPA అక్షరాలు జోడించడం సూచన కోసం, వికీపీడియా శైలి సూచనలు చూడండి.