వికీపీడియా:సాధారణ పదదోషాలు - తప్పొప్పుల పట్టిక
(సాధారణ పదదోషాలు - తప్పొప్పుల పట్టిక నుండి దారిమార్పు చెందింది)
తెలుగులో సర్వ సాధారణంగా కనిపించే పదదోషాలను గుర్తించి, వాటికి సరైన పదాలను సూచించడం ఈ వ్యాస లక్ష్యం. వ్యాకరణ రూపాలలోని దోషాలు దీని పరిధిలోకి రావు. కేవలం పద స్వరూపంలో సాధారణంగా కనిపించే తప్పులకి మాత్రమే ఇది పరిమితం. ఇందులో పదాలని చేర్చే ముందు నిఘంటువులో[1] సరిచూడ్డం మంచిది.
ఈ దిగువన ఉన్న జాబితాలోని అచ్చుతప్పులను బాటు ద్వారా యాంత్రికంగా వికీపీడియా మొత్తం దిద్దించబడుతుంది. కాబట్టి ఈ దిగువ పట్టికలో ఉన్న విధంగానే మీరు చేర్చాలనుకున్న అచ్చుతప్పులు చేర్చండి. కొత్త అచ్చుతప్పులను చేర్చటానికి అనుసరించవలసిన పద్ధతి ఈ దిగువన గమనించండి.
గమనిక:ఈ దిగువ పదాలలో కూర్పు చేసేటప్పుడు పొరపాటున ఎక్కడైనా అటుది ఇటు, ఇటుది అటు కూర్ప అయి ఉండవచ్చు. అలాంటి పదాలు గమనించినప్పుడు ఈ వ్యాసం చర్చాపేజీలో రాయగలరు.వాటిని సరిచూసి సవరించగలరు.
తప్పొప్పుల పట్టిక -1
మార్చుతప్పు | ఒప్పు |
---|---|
ఆగత్యం | అగత్యం |
అదిగమించు | అధిగమించు |
అనర్దదాయకం | అనర్థదాయకం |
అనుసంథానం | అనుసంధానం |
అపరాథం | అపరాధం |
అపొహ | అపోహ |
అభద్దం | అబద్ధం |
అబిమానం | అభిమానం |
అబ్యంతరం | అభ్యంతరం |
అభ్యుధయం | అభ్యుదయం |
అమంతంగా | అమాంతంగా |
అరాచకం | అరాజకం |
అవకాతవకలు | అవకతవకలు |
ఆవశ్యం | అవశ్యం |
ఆశనిపాతం | అశనిపాతం |
అసబ్యంగా | అసభ్యంగా |
అస్థమానం | అస్తమానం |
అకతాయి | ఆకతాయి |
అణిముత్యాలు | ఆణిముత్యాలు |
ఆధర్శం | ఆదర్శం |
ఆమోధం | ఆమోదం |
ఆరంబం | ఆరంభం |
ఆర్బాటం | ఆర్భాటం |
ఆస్రితపక్షపాతం | ఆశ్రిత పక్షపాతం |
అత్తిసరు | అత్తెసరు |
అష్ఠకష్ఠాలు | అష్టకష్టాలు |
అస్థవ్యస్థం | అస్తవ్యస్తం |
ఆనవాయతీ | ఆనవాయితీ |
అబివృద్ది | అభివృద్ధి |
అధికృత | అధీకృత |
అణ్వాస్త్రం | అణ్వస్త్రం |
అనివారంగా | అనివార్యంగా |
అవస్త | అవస్థ |
అత్యథికం | అత్యధికం |
అదిక్షేపించు | అధిక్షేపించు |
అర్ధంతరంగా | అర్ధాంతరంగా |
అతిధి | అతిథి |
అగాథం | అగాధం |
అప్రతిష్ట | అప్రతిష్ఠ |
అవ్యజ | అవ్యాజ |
అతిరధుడు | అతిరథుడు |
అతివృష్ఠి | అతివృష్టి |
అర్జి | అర్జీ |
అక్షంతలు | అక్షింతలు |
అజమాయషీ | అజమాయిషీ |
రంగరంగవైభవం | అంగరంగ వైభవం |
అదృస్యం | అదృశ్యం |
అద్యక్షుడు | అధ్యక్షుడు |
అనుచిత్తంగా | అనుచితంగా |
ఆహుతులు | ఆహూతులు |
ఆచ్చాదన | ఆచ్ఛాదన |
ఆస్థులు | ఆస్తులు |
ఆర్దిక | ఆర్థిక |
అల్పఫీడనం | అల్పపీడనం |
ఇథోదికంగా | ఇతోధికంగా |
ఇబ్బుడిముబ్బుడి | ఇబ్బడిముబ్బడి |
ఇల్లరికటం | ఇల్లరికం |
ఈసుడింపు | ఈసడింపు |
వుత్తమం | ఉత్తమం |
ఉచ్ఛారణ | ఉచ్చారణ |
ఉన్నపలంగా | ఉన్నపళంగా |
ఉత్తానపతనాలు | ఉత్థానపతనాలు |
వుచితంగా | ఉచితంగా |
ఉత్ఫాథం | ఉత్పాతం |
ఉదాశీనత | ఉదాసీనత |
ఉధ్యమం | ఉద్యమం |
ఉధ్వాసన | ఉద్వాసన |
ఉపాచారం | ఉపచారం |
ఉపయోగ్యం | ఉపయోగం |
ఉప సంహారణ | ఉపసంహరణ |
ఉవ్విల్లూరు | ఉవ్విళ్లూరు |
ఎడతెరుపి | ఎడతెరిపి |
ఎద్ధడి | ఎద్దడి |
ఏన్నర్థంగా | ఏణ్ణర్థంగా |
ఐచ్చిక | ఐచ్ఛిక |
ఐక్యమత్యం | ఐకమత్యం |
ఔఛిత్యం | ఔచిత్యం |
కధ | కథ |
కౌన్సిలింగ్ | కౌన్సెలింగ్ |
ఖచ్చితంగా | కచ్చితంగా |
క్రోదం | క్రోధం |
క్రమబద్దీకరణ | క్రమబద్ధీకరణ |
ఖంగారు | కంగారు |
కాపురస్తులు | కాపురస్థులు |
కాలుశ్యం | కాలుష్యం |
కూలంఖషంగా | కూలంకషంగా |
కాయిలా | ఖాయిలా |
ఖచ్చితంగా | కచ్చితంగా |
గాతం | ఘాతం |
గాయికుడు | గాయకుడు |
గ్రంధసాంగుడు | గ్రంథసాంగుడు |
గుభాళింపు | గుబాళింపు |
గృహస్తుడు | గృహస్థుడు |
గడిబిడ | గడబిడ |
గంబీరంగా | గంభీరంగా |
గుభులు | గుబులు |
చతుర్ది | చతుర్థి |
చిరనామ | చిరునామా |
చేతన్యం | చైతన్యం |
జయంత్యోత్సవం | జయంత్యుత్సవం |
జీవచ్చవం | జీవచ్ఛవం |
జళిపించు | ఝళిపించు |
ఢీలాపడు | డీలా పడు |
డైరక్టరేట్ | డైరెక్టరేట్ |
ఢక్కామక్కీలు | డక్కామొక్కీలు |
డయిరీ | డెయిరీ |
తలుకుబెలుకు | తళుకుబెళుకు |
తాలుకా | తాలూకా |
తటస్తం | తటస్థం |
తలక్రిందులు | తల్లకిందులు |
తిరోగామం | తిరోగమనం |
తృటి | త్రుటి |
దగ్దం | దగ్ధం |
ద్వందవైఖరి | ద్వంద్వ వైఖరి |
దుష్పలితం | దుష్ఫలితం |
దృక్ఫదం | దృక్పథం |
దిగ్భందం | దిగ్బంధం |
ధండకం | దండకం |
దాఖలు | దఖలు |
దగ్దం | దగ్ధం |
దుర్ధినం | దుర్దినం |
దర్మాసనం | ధర్మాసనం |
దిక్కరించు | ధిక్కరించు |
ద్యేయం | ధ్యేయం |
దృవీకరించు | ధ్రువీకరించు |
దుర్బేధ్యం | దుర్భేద్యం |
నిర్ద్వందంగా | నిర్ద్వంద్వంగా |
నిర్ధారణ | నిర్ధరణ |
నిషేదిత | నిషేధిత |
నిసృహ | నిస్పృహ |
నిర్ధిష్టంగా | నిర్దిష్టంగా |
నెంబరు | నంబరు |
నిర్ధయ | నిర్దయగా |
న్యాయస్తానం | న్యాయస్థానం |
నసించు | నశించు |
నిక్కచ్ఛిగా | నిక్కచ్చిగా |
నిమత్తం | నిమిత్తం |
నిరాయుదీకరణ | నిరాయుధీకరణ |
నివృతి | నివృత్తి |
నిర్భందం | నిర్బంధం |
నిర్వీరం | నిర్వీర్యం |
నిష్క్రమింఛారు | నిష్క్రమించారు. |
నైవేధ్యం | నైవేద్యం |
ప్రధమ | ప్రథమ |
పట్టబద్రులు | పట్టభద్రులు |
పుంకానుపుంకాలు | పుంఖానుపుంఖాలు |
పునర్వవస్తీకరణ | పునర్వ్యవస్థీకరణ |
ప్రయివేటు | ప్రైవేటు |
పశుసంవర్దక | పశుసంవర్ధక |
ప్రాదేయపడు | ప్రాధేయపడు |
పరివాహక | పరీవాహక |
పర్యావసానం | పర్యవసానం |
ప్రణాలిక | ప్రణాళిక |
పించెను | పింఛను |
ఫుకారు | వదంతి |
పరంబోకు | పోరంబోకు |
ప్రచ్చనం | ప్రచ్ఛన్నం |
ప్రతిబ | ప్రతిభ |
ప్రతిక | ప్రతీక |
ప్రబాతం | ప్రభాతం |
ప్రలోబం | ప్రలోభం |
ప్రశక్తి | ప్రసక్తి |
ప్రాంగనం | ప్రాంగణం |
భాద్యత | బాధ్యత |
భీభత్సం | బీభత్సం |
భహిరంగంగా | బహిరంగంగా |
బ్రహ్మరధం | బ్రహ్మరథం |
బీష్మించు | భీష్మించు |
బౌతిక | భౌతిక |
భ్రష్ఠుడు | భ్రష్టుడు |
మర్థించు | మర్దించు |
మద్యాన్నం | మధ్యాహ్నం |
మనస్థాపం | మనస్తాపం |
మలేషియా | మలేసియా |
మెలకువ | మెళకువ |
మార్చ్ | మార్చి |
మితృడు | మిత్రుడు |
మమైకం | మమేకం |
యధాతధం | యథాతథం |
యుద్దం | యుద్ధం |
యదేచ్ఛగా | యధేచ్చగా |
రబస | రభస |
రంగేళిరాట్నం | రంగులరాట్నం |
రొచ్ఛు | రొచ్చు |
రవుతు | రౌతు |
లాటీఛార్జి | లాఠీచార్జ్ |
లంకణం | లంఖణం |
వైశమ్యం | వైషమ్యం |
విద్యుద్ఘాతం | విద్యుదాఘాతం |
వార్శికం | వార్షికం |
విఛక్షణ | విచక్షణ |
వ్యక్తిగథం | వ్యక్తిగతం |
వేధిక | వేదిక |
వెవహారం | వ్యవహారం |
వ్యాఫారి | వ్యాపారి |
శబ్ధం | శబ్దం |
షాశనం | శాసనం |
స్మశానం | శ్మశానం |
శికారు | షికారు |
సమర్ధించడం | సమర్థించడం |
సంభోదన | సంబోధన |
సషేశం | సశేషం |
సమృద్ది | సమృద్ధి |
సారధి | సారథి |
స్తలం | స్థలం |
స్తలం | స్థలం |
సంస్త | సంస్థ |
సృహలో | స్పృహలో |
సఛివులు | సచివులు |
సందర్బం | సందర్భం |
సమీకరనాలు | సమీకరణాలు |
సంస్తాగతం | సంస్థాగతం |
సమిక్ష | సమీక్ష |
సహాకారం | సహకారం |
సౌష్టవం | సౌష్ఠవం |
స్తాయి | స్థాయి |
స్తూలంగా | స్థూలంగా |
స్ఫందన | స్పందన |
హేమాహేమిలు | హేమాహేమీలు |
హుటాహుటన | హుటాహుటిన |
క్షిఫణి | క్షిపణి |
హడావిడి | హడావుడి |
ఆగచాట్లు | అగచాట్లు |
అట్టాహాసం | అట్టహాసం |
అధ్యాయనం | అధ్యయనం |
అనుభందం | అనుబంధం |
అంధలం | అందలం |
అపబ్రంశం | అపభ్రంశం |
అప్పానంగా | అప్పనంగా |
అబినందన | అభినందన |
అబియోగం | అభియోగం |
అబ్యర్తి | అభ్యర్థి |
అమాత్యిడు | అమాత్యుడు |
అయోమైయంగా | అయోమయంగా |
అలంకారించు | అలంకరించు |
ఆవగాహన | అవగాహన |
ఆగ్రహాం | ఆగ్రహం |
అశ్రద్ద | అశ్రద్ధ |
అగంతకుడు | ఆగంతకుడు |
అక్షేపించు | ఆక్షేపించు |
అంక్షలు | ఆంక్షలు |
ఆధరణ | ఆదరణ |
ఆధాయం | ఆదాయం |
ఆయుకట్టు | ఆయకట్టు |
అరిమరికలు | అరమరికలు |
ఆవరన | ఆవరణ |
అగ్నిమాపుకం | అగ్నిమాపకం |
అర్బకుడు | అర్భకుడు |
అష్ఠైశ్వర్యాలు | అష్టైశ్వర్యాలు |
ఆధునీకరణ | ఆధునికీకరణ |
ఆబాలగోపాళం | ఆబాలగోపాలం |
అబిప్రాయం | అభిప్రాయం |
అంతర్యుద్దం | అంతర్యుద్ధం |
అధారిటీ | అథారిటీ |
అభ్యర్దించు | అభ్యర్థించు |
అగాయిత్యం | అఘాయిత్యం |
అధమ | అథమ |
అనవతం | అవనతం |
అణుకువ | అణకువ |
అధిష్టానం | అధిష్ఠానం |
అద్వాన్నం | అధ్వానం |
అరిష్ఠం | అరిష్టం |
అంతర్థానం | అంతర్ధానం |
అనర్ధం | అనర్థం |
అనుసంథానం | అనుసంధానం |
ఆక్రమం | అక్రమం |
అగ్రస్తానం | అగ్రస్థానం |
అత్తలాకుత్తలం | అతలాకుతలం |
అడ్డాదిడ్డం | అడ్డదిడ్డంగా |
అధీగమించు | అధిగమించు |
అనుచెరుడు | అనుచరుడు |
అనుసందానం | అనుసంధానం |
ఆక్షేపన | ఆక్షేపణ |
అతిథ్యం | ఆతిథ్యం |
ఆస్థిపాస్థులు | ఆస్తిపాస్తులు |
ఆంద్రుడు | ఆంధ్రుడు |
ఇంగీతం | ఇంగితం |
ఇబ్భంది | ఇబ్బంది |
ఇనస్పెక్టర్ | ఇన్‌స్పెక్టర్ |
ఈర్ష | ఈర్ష్య |
ఉద్గాటించారు | ఉద్ఘాటించారు |
ఉల్లంగించారు | ఉల్లంఘించారు |
ఉపోద్గాతం | ఉపోద్ఘాతం |
ఉపాద్యక్షుడు | ఉపాధ్యక్షుడు |
గుండ్రాళ్లదెబ్బ | ఉండేలు దెబ్బ |
ఉద్బవించారు | ఉద్భవించారు |
ఉఢాయించారు | ఉడాయించారు |
ఉత్సావం | ఉత్సవం |
ఉదాహారణ | ఉదాహరణ |
ఉద్భోదించారు | ఉద్బోధించారు |
ఉపగృహం | ఉపగ్రహం |
ఉపదేశ్యం | ఉపదేశం |
ఉపాది | ఉపాధి |
ఊరుమ్ముడి | ఊరుమ్మడి |
ఏకాఎకిన | ఎకాఎకిన |
ఎన్నైక | ఎన్నిక, ఎంపిక |
ఏమరుపాటిగా | ఏమరుపాటుగా |
ఏకంతంలో | ఏకాంతంలో |
ఐఖ్యం | ఐక్యం |
ఒడంభడిక | ఒడంబడిక |
కనిష్ఠం | కనిష్టం |
కటాకట | కటకట |
కలక్టరేట్ | కలెక్టరేట్ |
కమీశనర్ | కమిషనర్ |
కూలంకశంగా | కూలంకషంగా |
కలువరింత | కలవరింత |
కల్లోళం | కల్లోలం |
కార్యదర్సి | కార్యదర్శి |
కీర్తిసేషులు | కీర్తిశేషులు |
క్రీఢాకారులు | క్రీడాకారులు |
కాకీ | ఖాకీ |
గర్బం | గర్భం |
గాయిని | గాయని |
గ్రంధం | గ్రంథం |
గుత్తాదిపత్యం | గుత్తాధిపత్యం |
గూడాచారి | గూఢచారి |
గౌరవార్ధం | గౌరవార్థం |
గమినించు | గమనించు |
గరానా | ఘరానా |
ఛట్టబద్దం | చట్టబద్ధం |
చతుష్ఠయం | చతుష్టయం |
చాంపియన్ | ఛాంపియన్ |
జనార్ధన | జనార్దన |
జీర్ణుద్ధరణ | జీర్ణోద్ధరణ |
జఠిలం | జటిలం |
డెప్యూటీ | డిప్యూటీ |
డ్రయినేజీ | డ్రైనేజీ |
డిశంబర్ | డిసెంబర్ |
డమరుకం | ఢమరుకం |
తనికీ | తనిఖీ |
తాదాత్మం | తాదాత్మ్యం |
తాకత్తు | తాహతు |
త్రైపక్షిక | త్రైపాక్షిక |
తలవొంపులు | తలవంపులు |
తిరస్కారించు | తిరస్కరించు |
తీర్ధం | తీర్థం |
ధృడం | దృఢం |
దరకాస్తు | దరఖాస్తు |
ధీటుగా | దీటుగా |
దౌర్బాగ్యం | దౌర్భాగ్యం |
దిగ్బ్రాంతి | దిగ్భ్రాంతి |
దైర్యం | ధైర్యం |
దంఢయాత్ర | దండయాత్ర |
దహానం | దహనం |
దషకం | దశకం |
దోహధపడు | దోహదపడు |
దాటి | ధాటి |
ధురందరుడు | దురంధరుడు |
దరలు | ధరలు |
దూమపానం | ధూమపానం |
నిముషం | నిమిషం |
నిర్భందం | నిర్బంధం |
నిశ్చితార్ధం | నిశ్చితార్థం |
నిశేదాజ్ఞలు | నిషేధాజ్ఞలు |
నేరస్తులు | నేరస్థులు |
నేపద్యం | నేపథ్యం |
నిరూపయోగం | నిరుపయోగం |
నిర్ధాక్షిణ్యం | నిర్దాక్షిణ్యం |
నదీనదులు | నదీనదాలు |
నాస్థికుడు | నాస్తికుడు |
నిఘ్రహం | నిగ్రహం |
నిరాఠంకంగా | నిరాటంకంగా |
నిరాహార ధీక్ష | నిరాహార దీక్ష |
నిర్ధేశ్యం | నిర్దేశం |
నిర్వాఖం | నిర్వాకం |
నివేధిక | నివేదిక |
నీరషించు | నీరసించు |
ప్రత్యామ్నం | ప్రత్యామ్నాయం |
పంఛాయతీ | పంచాయితీ |
పటిష్ఠం | పటిష్టం |
పునరుద్గాటించు | పునరుద్ఘాటించు |
ప్రాధమిక | ప్రాథమిక |
పరిణామ్యం | పరిణామం |
పురష్కారం | పురస్కారం |
పరిక్ష | పరీక్ష |
పరోపంగా | పరోక్షంగా |
పలయానం | పలాయనం |
పల్లెత్తమాట | పల్లెత్తుమాట |
పీపాస | పిపాస |
పూర్వత్తరాలు | పూర్వోత్తరాలు |
ప్రక్షాలనం | ప్రక్షాళనం |
ప్రతిష్ట | ప్రతిష్ఠ |
ప్రత్యర్ధి | ప్రత్యర్థి |
ప్రబంజనం | ప్రభంజనం |
ప్రమానం | ప్రమాణం |
ప్రవాశం | ప్రవాసం |
పందారం | పందేరం |
బాహబాహి | బాహాబాహీ |
భుద్ది | బుద్ధి |
భడుగు | బడుగు |
బృంధావనం | బృందావనం |
బవిత | భవిత |
బేషజం | భేషజం |
బాగస్తులు | భాగస్థులు |
భూస్తాపితం | భూస్థాపితం |
మధ్యపానం | మద్యపానం |
మదువు | మధువు |
మరమత్తు | మరమ్మతు |
మార్ధవం | మార్దవం |
మహాత్యం | మహాత్మ్యం |
మథలబు | మతలబు |
మనోనిబ్భరం | మనోనిబ్బరం |
యధార్థం | యథార్థం |
యాదృచ్చికం | యాదృచ్ఛికం |
యవ్వనం | యౌవనం |
రధం | రథం |
రిజిష్ట్రార్ | రిజిస్ట్రార్ |
రాజదాని | రాజధాని |
రోదశి | రోదసి |
లబ్ధిదారులు | లబ్దిదారులు |
లక్షం | లక్ష్యం |
వ్యర్ధం | వ్యర్థం |
వ్యాహ్యాళి | వాహ్యాళి |
విమర్ష | విమర్శ |
వినోధం | వినోదం |
విరాలం | విరాళం |
విస్పోటన | విస్ఫోటన |
వెవసాయం | వ్యవసాయం |
వ్యాక్యానం | వ్యాఖ్యానం |
వాయగండం | వాయుగుండం |
శతగ్ని | శతఘ్ని |
షాతం | శాతం |
శోదన | శోధన |
శృతి | శ్రుతి |
సధస్సు | సదస్సు |
స్తోమత | స్థోమత |
సంషయం | సంశయం |
సంగటం | సంకటం |
సదుద్ధేశ్యం | సదుద్దేశం |
స్తిరం | స్థిరం |
స్వచ్చందంగా | స్వచ్ఛందంగా |
స్తితిగతులు | స్థితిగతులు |
సంజాయషీ | సంజాయిషీ |
సంథరించు | సంతరించు |
సబ్యుడు | సభ్యుడు |
సమర్ధన | సమర్థన |
సమిష్టి | సమష్టి |
సవరన | సవరణ |
సవుజన్యం | సౌజన్యం |
స్తావరం | స్థావరం |
స్నాతకుత్సవం | స్నాతకోత్సవం |
స్వానుబవం | స్వానుభవం |
హటాత్తుగా | హఠాత్తుగా |
ఆశక్తి, ఆశక్తులు | ఆసక్తి, ఆసక్తులు |
చేధించు | ఛేదించు |
భాష్పము | బాష్పం |
భాందవ్యము | బాంధవ్యం |
అస్థిత్వము | అస్తిత్వం |
అర్జనుడు | అర్జునుడు |
ధనుంజయుడు | ధనంజయుడు |
మహత్యము | మాహాత్మ్యం |
రాయభారము | రాయబారం |
భాద | బాధ |
బేధం | భేదం |
రుషి | ఋషి |
వశిష్టుడు | వశిష్ఠుడు |
విబాగము | విభాగం |
దశరధుడు | దశరథుడు |
భందము, భంధము, బందము | బంధం |
అనుభందము, అనుభంధము, అనుబందము |
అనుబంధం |
శాఖాహారం | శాకాహారం |
సమైఖ్య | సమైక్య |
"కారణములను" (శైలి) | కారణాలను |