సిద్దిపేట జిల్లా
సిద్దిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.[2] సిద్దిపేట పట్టణం ఈ జిల్లాకు పరిపాలన కేంద్రం.2016 అక్టోబరు 11, న నూతనంగా ఏర్పడిన ఈ జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు, 22 మండలాలు, నిర్జన గ్రామాలు (6) తో కలుపుకుని 381 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3]
Siddipet district | |
---|---|
Country | India |
State | Telangana |
Formation | 11 అక్టోబరు 2016 |
Headquarters | Siddipet |
Government | |
• District collector | మిక్కిలినేని మనూ చౌదరి |
విస్తీర్ణం | |
• Total | 3,842.33 కి.మీ2 (1,483.53 చ. మై) |
జనాభా (2011)[1] | |
• Total | 10,12,065 |
• జనసాంద్రత | 260/కి.మీ2 (680/చ. మై.) |
Time zone | UTC+05:30 (IST) |
జిల్లాలోని 22 మండలాలలో (పాతవి 17 + కొత్తవి 5) పూర్వపు మెదక్ జిల్లాలోనివి పాతవి 13 మండలాలు, పూర్వపు కరీంనగర్ జిల్లా నుంచి 3 మండలాలు, పూర్వపు వరంగల్ జిల్లా నుండి ఒక మండలం మొత్తం 17 పాత మండలాలు కాగా, కొత్తగా ఏర్పడిన మండలాలు పూర్వపు మెదక్ జిల్లా గ్రామాల నుండి 4, పూర్వపు కరీంనగర్ జిల్లా గ్రామాల నుండి 1 మొత్తం 5 కొత్త మండలాలతో కొత్త జిల్లాగా అవతరించింది.జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలతో కలుపుకొని 499 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[4] 100శాతం వాక్సినేషన్ మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమంలో భాగంగా 2019 సంవత్సరానికి ప్రధానమంత్రి అవార్డును అందుకుంది.[5]
నీటిపారుదల
మార్చుసిద్దిపేటపట్టణ పరిసరప్రాంతాలలో ఇంటింటికీ నల్లాల ద్వారా నీటిసరఫరా జరుగుతుంది. వ్యవసాయరంగానికి బావుల ద్వారా, బోర్ల ద్వారా నీరు అందుతుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన రంగనాయకసాగర్ జలాశయం సిద్దిపేటకు 4 కి.మీ.దూరంలో ఉంది .
రెవెన్యూడివిజన్ లు
మార్చుపునర్య్వస్థీకరణ తరువాత ఏర్పడిన కొత్త మండలాలు
మార్చు- ఆ తరువాత సిద్ధిపేట రెవెన్యూ డివిజను పరిధిలోని, సిద్ధిపేట గామీణ మండలానికి చెందిన నారాయణరావుపేట మండలాన్ని ఐదు రెవెన్యూ గ్రామాలతో మండలం కొత్తగా ఏర్పడింది.[6]
- దూల్మిట్ట గ్రామం మండల కేంద్రంగా మద్దూర్ మండలం లోని 8 గ్రామాలతో దూల్మిట్ట మండలం కొత్తగా ఏర్పడింది.[7][8]
జిల్లా లోని మండలాల జాబితా
మార్చు- సిద్దిపేట గ్రామీణ మండలం *
- సిద్దిపేట పట్టణ మండలం
- నంగునూరు మండలం
- చిన్నకోడూర్ మండలం
- తొగుట మండలం
- దౌలతాబాద్ మండలం
- మిరుదొడ్డి మండలం
- దుబ్బాక మండలం
- చేర్యాల మండలం
- కొమురవెల్లి మంండలం *
- గజ్వేల్ మండలం
- జగ్దేవ్పూర్ మండలం
- కొండపాక మండలం
- ములుగు మండలం
- మర్కూక్ మండలం *
- వర్గల్ మండలం
- రాయపోల్ మండలం *
- హుస్నాబాద్ మండలం
- అక్కన్నపేట మండలం *
- కోహెడ మండలం
- బెజ్జంకి మండలం
- మద్దూరు మండలం
- నారాయణరావుపేట మండలం *
- దూళిమిట్ట మండలం
- అక్బర్పేట-భూంపల్లి మండలం*
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (5) గమనిక:* పునర్య్వస్థీకరణ తరువాత కొత్తగా ఏర్పడిన మండలాలు (2)
కలెక్టర్లు
మార్చు- పి.వెంకట్రామి రెడ్డి
- యం. హనుమంత రావు
- ప్రశాంత్ జీవన్ పాటిల్
- మిక్కిలినేని మనూ చౌదరి 2024 ఫిబ్రవరి 23న నియమించారు.[9]
సిద్దిపేట జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్
మార్చుప్రధానమంత్రి అవార్డు-2019
మార్చుచిన్నారులకు 100శాతం వ్యాధి నిరోధక టీకాలు వేసిన జిల్లాగా సిద్ధిపేట జిల్లా జాతీయ స్థాయిలో అరుదైన రికార్డు సృష్టించింది. అంతేకకాకుండా, నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసి, మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ పనితీరు కనబరిచినందుకు కేంద్ర ప్రభుత్వం, ఈ జిల్లాకు ప్రధానమంత్రి అవార్డు-2019ను ప్రకటించింది. 2022 ఏప్రిల్ 20-21 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమంలో ట్రోఫీ, ప్రశంసాపత్రంతోపాటు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహాన్ని కేంద్రం అందజేసింది.[11][12]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Search Details Here:". Census of India 2011. Office of the Registrar General & Census Commissioner, India; Ministry of Home Affairs, Government of India. Retrieved 10 September 2019.
- ↑ "తెలంగాణా ప్రభుత్వం, సిద్దిపేట జిల్లా | సిద్దిపేట జిల్లా తెలంగాణా, ఇండియా | భారతదేశం". Retrieved 2021-08-22.
- ↑ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240 Revenue (DA-CMRF)Department,Dt: 11-10-2016
- ↑ "లిస్టు విడుదల : తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే | V6 Telugu News". web.archive.org. 2018-03-31. Archived from the original on 2018-03-31. Retrieved 2021-08-22.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ telugu, NT News (2022-04-13). "సిద్దిపేట జిల్లాకు 'పీఎం' అవార్డు". Namasthe Telangana. Archived from the original on 2022-04-13. Retrieved 2022-04-13.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 28, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019
- ↑ "New mandal formed in Husnabad revenue division". The New Indian Express. Retrieved 2021-08-22.
- ↑ "Telangana: తెలంగాణలో కొత్త మండలం.. ఆ జిల్లాలో.. సీఎం కేసీఆర్ పర్యటనకు ముందే ఉత్తర్వులు." News18 Telugu. Retrieved 2021-08-22.
- ↑ telugu, NT News (2024-02-24). "పలువురు ఐఏఎస్‌ల బదిలీ". www.ntnews.com. Retrieved 2024-11-10.
- ↑ Sakshi (8 June 2019). "తెలంగాణలో ఎన్నికైన జెడ్పీ చైర్మన్లు వీరే". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
- ↑ "సిద్దిపేట జిల్లాకు 'మిషన్ ఇంద్రధనుష్' పురస్కారం". EENADU. 2022-04-13. Archived from the original on 2022-04-13. Retrieved 2022-04-13.
- ↑ "సిద్దిపేట జిల్లాకు ప్రధాన మంత్రి అవార్డు". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-13. Archived from the original on 2022-04-13. Retrieved 2022-04-13.