సుభాష్ దేశ్‌ముఖ్
సుభాష్ సురేశ్‌చంద్ర దేశ్‌ముఖ్ (జననం 1957 మార్చి 12) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన షోలాపూర్ సౌత్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రివర్గంలో సహకార & టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి శాఖ మంత్రిగా పని చేశాడు.[1]
సుభాష్ సురేశ్‌చంద్ర దేశ్‌ముఖ్ | |||
![]()
| |||
పదవీ కాలం 2016 జూలై 8 – 2019 నవంబర్ 12 | |||
ముందు | చంద్రకాంత్ పాటిల్ | ||
---|---|---|---|
తరువాత | శామ్రావ్ పాండురంగ్ పాటిల్ | ||
పదవీ కాలం 2016 జూలై 8 – 2019 జూన్ 16 | |||
ముందు | చంద్రకాంత్ పాటిల్ | ||
తరువాత | రామ్ షిండే | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 | |||
ముందు | దిలీప్ మానే | ||
నియోజకవర్గం | షోలాపూర్ సౌత్ | ||
పదవీ కాలం 2004 – 2009 | |||
ముందు | ప్రతాప్‌సింహ మోహితే-పాటిల్ | ||
తరువాత | సుశీల్ కుమార్ షిండే | ||
నియోజకవర్గం | షోలాపూర్ | ||
మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడు
| |||
పదవీ కాలం 1998 – 2004 | |||
నియోజకవర్గం | షోలాపూర్ స్థానిక సంస్థల నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | షోలాపూర్, బొంబాయి రాష్ట్రం , భారతదేశం | 12 మార్చి 1957||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | స్మితా దేశ్‌ముఖ్, (వివాహం 1980 ) | ||
సంతానం | 2 కుమారులు, 1 కుమార్తె | ||
నివాసం | షోలాపూర్ | ||
మూలం | [1] |
రాజకీయ జీవితం
మార్చుసుభాష్ దేశ్‌ముఖ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1998లో జరిగిన మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికలలో షోలాపూర్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన 2004లో జరిగిన లోక్‍సభ ఎన్నికలలో షోలాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
సుభాష్ దేశ్‌ముఖ్ 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో షోలాపూర్ సౌత్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి దిలీప్ బ్రహ్మదేవ్ మనేపై 27,123 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి బాబా మిస్త్రీపై 29,247 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[3] దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రివర్గంలో సహకార & టెక్స్‌టైల్స్ శాఖ మంత్రిగా పని చేశాడు.[4]
సుభాష్ దేశ్‌ముఖ్ 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో షోలాపూర్ సౌత్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన (యుబిటి) అభ్యర్థి అమర్ రతీకాంత్ పాటిల్‌పై 77,127 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5][6]
మూలాలు
మార్చు- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ "Maharashtra Minister Subhash Deshmukh Aims For A Hat-Trick In Solapur South" (in ఇంగ్లీష్). TimelineDaily. 24 October 2024. Archived from the original on 14 January 2025. Retrieved 14 January 2025.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Solapur South" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 14 January 2025. Retrieved 14 January 2025.
- ↑ "Solapur South Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 14 January 2025. Retrieved 14 January 2025.