హనుమంత్ డోలాస్
హనుమంత్ డోలాస్ (1 జూన్ 1962 - 30 ఏప్రిల్ 2019) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు మల్షిరాస్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
హనుమంత్ డోలాస్ | |||
పదవీ కాలం 2009 అక్టోబర్ 13 – 2019 అక్టోబర్ 30 | |||
ముందు | విజయ్‌సింగ్ మోహితే-పాటిల్ | ||
---|---|---|---|
తరువాత | రామ్ సత్పుటే | ||
నియోజకవర్గం | మల్షిరాస్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1962 జూన్ 1 అక్లూజ్, సోలాపూర్ | ||
మరణం | 2019 ఏప్రిల్ 30 ముంబై | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | కంచన్ | ||
సంతానం | సంకల్ప్, సిద్ధి | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
హనుమంత్ డోలాస్ ప్రభుత్వ నిర్వహణలో ఉన్న సంత్ రోహిదాస్ లెదర్ ఇండస్ట్రీస్ చార్మాకర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఛైర్మన్‌గా ఆ తర్వాత మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ డైరెక్టర్‌గా పని చేశాడు.
రాజకీయ జీవితం
మార్చుహనుమంత్ డోలాస్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి ఉత్తమ్‌రావ్ జంకర్‌పై 16,226 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2] ఆయన 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి ఖండగలే అనంత్ జయకుమార్‌పై 6245 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]
మరణం
మార్చుహనుమంత్ డోలాస్ పెద్దపేగు క్యాన్సర్‌తో బాధపడుతూ ముంబైలోని సైఫీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019 ఏప్రిల్ 30న మరణించాడు. ఆయనకు భార్య కంచన్, ఒక కుమారుడు సంకల్ప్, కుమార్తె సిద్ధి ఉన్నారు.[5][6]
మూలాలు
మార్చు- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
- ↑ "NCP MLA Hanumant Dolas passes away at 57" (in ఇంగ్లీష్). The Indian Express. 1 May 2019. Archived from the original on 11 December 2021. Retrieved 14 January 2025.
- ↑ "माळशिरसचे राष्ट्रवादीचे आमदार हनुमंत डोळस यांचं निधन". 30 April 2019. Archived from the original on 14 January 2025. Retrieved 14 January 2025.