హస్తకళ
హస్తకళ (Handicraft) అంటే మనుషులు కేవలం తమ చేతులతో, లేదా కొన్ని సాధారణమైన, తేలికైన పనిముట్లను మాత్రమే వాడి ఉపయోగకరమైన, అలంకరణ వస్తువులు తయారు చేయడం. సాంప్రదాయ కళల్లో హస్తకళలు ఒక ప్రధానమైన వర్గం. మనిషి తన చేతులతో బట్టలు, అచ్చులు, కాగితాలు, మొక్కలకు సంబంధించిన పదార్థాలు వాడి తయారు చేసే సృజనాత్మక రూపకల్పనలు హస్తకళల క్రిందికి వస్తాయి. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన హస్తకళల్లో ఢోక్రా ఒకటి. ఇది ఒకరమైన లోహపు పోతపని (metal casting). ఈ కళ భారతదేశంలో 4000 సంవత్సరాలకు ముందు నుంచి కొనసాగుతూ వస్తోంది. హస్తకళ అనే పదాన్ని ప్రస్తుతం వ్యక్తిగత అవసరాల కోసం గానీ, వ్యాపారాత్మకంగా కానీ అందంగా కనిపించే, ఆచరణాత్మక వస్తువులను తయారు చేసే కళలను ఉద్దేశించి వాడుతున్నారు. చేతివృత్తుల పరిశ్రమల్లో హస్తకళాకారులు తమ ప్రాంతంలోని ప్రజల అవసరార్థం అనేక ఉత్పత్తులు తయారు చేస్తారు. ఇందులో సాధారణంగా యంత్రాలను వాడరు.[1][2][3]
ఈ హస్తకళలకు మూలాలు గ్రామీణ కళల్లో ఉన్నాయి. పురాతన నాగరికతల నుంచి మానవుల వివిధ రకాలైన అవసరాల కోసం వీటిని కనుగొంటూ వస్తున్నారు. కొన్ని కళలు కొన్ని శతాబ్దాల నుంచీ కొనసాగుతూ వస్తుండగా కొన్ని అధునాతనమైనవి, అంతకు మునుపు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కళలను ఆధారంగా చేసుకుని విస్తరించిన కళలు కూడా ఉన్నాయి.
హస్తకళల్లో చాలా వరకు సమీప ప్రకృతిలో లభించే సహజసిద్ధమైన పదార్థాలే వాడినా కొన్ని వాటిలో సాంప్రదాయేతర పదార్థాలు కూడా వాడుతున్నారు.
మూలాలు
మార్చు- ↑ Thomas MacMillan (April 30, 2012). "On State Street, "Maker" Movement Arrives". New Haven Independent. Retrieved November 23, 2016.
- ↑ "Gaia Handicraft". Archived from the original on 2016-10-26. Retrieved 2020-08-21.
- ↑ Martinez, Sylvia (2013). Invent To Learn. Torrance, CA: Constructing Modern Knowledge. pp. 32–35. ISBN 978-0-9891511-0-8.