హిమాయత్‌నగర్ మండలం (హైదరాబాదు జిల్లా)

తెలంగాణ, హైదరాబాద్ జిల్లా లోని మండలం

హిమాయత్‌నగర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు జిల్లాకు చెందిన మండలం.[1][2]

హిమాయత్‌నగర్ మండలం
మండలం
హిమాయత్‌నగర్లోని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయం
హిమాయత్‌నగర్ మండలం is located in Telangana
హిమాయత్‌నగర్ మండలం
హిమాయత్‌నగర్ మండలం
తెలంగాణా పటంలో మండల స్థానం
Coordinates: 17°22′34″N 78°32′46″E / 17.376197°N 78.546053°E / 17.376197; 78.546053
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Named forహిమాయత్ అలీ ఖాన్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500029
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

హిమాయత్‌నగర్ మండల ప్రాంతం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మహానగరపాలక సంస్థ పరిధిలో ఉంది.[3] ఏడవ నిజాం పెద్ద కుమారుడు హిమాయత్ అలీ ఖాన్ పేరుతో హిమాయత్‌నగర్ గా స్థిరపడింది. ఇది నారాయణగూడా, బషీర్‌బాగ్, హైదర్‌గూడా ప్రాంతాలకి సమీపంలో ఉంది.ఇది హైదరాబాదు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2011 భారత జనగణన ప్రకారం, హిమాయత్ నగర్ మండల విస్తీర్ణం 6.92 చ.కి.మీ., జనాభా 108062.

గణాంక వివరాలు

మార్చు

హిమాయత్‌నగర్ 80% అక్షరాస్యతా రేటుతో తెలంగాణలో అత్యంత అక్షరాస్యత కలిగివున్న ప్రాంతంగా సర్వేలో నిర్ణయించబడింది.

భౌగోళిక స్థానం

మార్చు

హిమాయత్‌నగర్ హైదరాబాదుకు ఉత్తర భాగంలో ఉంది.

చరిత్ర

మార్చు

1960ల మధ్యకాంలో హిమాయత్‌నగర్ నివాస, వాణిజ్య ప్రాంతంగా అభివృద్ధి చెందింది.

వాణిజ్య ప్రాంతం

మార్చు

నగరంలోని ప్రముఖ వాణిజ్య కేంద్రాలలో హిమాయత్‌నగర్ ఒకటి. వివిధ వస్తువుల ప్రముఖ బ్రాండ్లుతో అనేక దుకాణాలు ఈ ప్రాంతంలో ఉండడంవల్ల ఈ ప్రాంతం ప్రముఖ వర్తక కేంద్రంగా ప్రసిద్ధిపొందింది. అలెక్స్, బ్లూఫాక్స్ వంటి ప్రముఖ హోటళ్ళు... పారడైజ్, కె.ఎఫ్.సి., మక్డోనాల్డ్ ప్రముఖ రెస్టారెంట్లు ఇక్కడ ఉన్నాయి.

ఆసుపత్రులు

మార్చు
  1. సత్య కిడ్నీ సెంటర్
  2. సాయి వాణి హాస్పిటల్
  3. విజయ డయాగ్నస్టిక్
  4. ఎ.కె.జె. ఛాతీ క్లినిక్

రవాణా

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా హిమాయత్‌నగర్ నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్సు రవాణా సదుపాయం ఉంది.

ప్రధాన కార్యాలయాలు

మార్చు

హిమాయత్‌నగర్లో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ, తెలుగు అకాడమి వంటి ప్రభుత్వ సంస్థ కార్యాలయాలు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన కార్యాలయం కూడా హిమాయత్‌నగర్లో ఉంది.[4]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2019-01-17.
  2. "హైదరాబాద్ జిల్లాలోని మండలాలు.రెవెన్యూ డివిజన్లు".
  3. "Reorganised list of District,Mandal,Villages of GHMC". Archived from the original on 2019-02-24. Retrieved 2019-01-17.
  4. ది హన్స్ ఇండియా (24 May 2015). "Brahmotsavams at Himayatnagar Balaji temple". Retrieved 19 December 2017.

వెలుపలి లంకెలు

మార్చు