హేము కాలాణి

భారతదేశ స్వాతంత్ర్య సమర యోధుడు, విప్లవ నాయకుడు, రాజకీయ కార్యకర్త

హేము కాలాణి, భారతదేశ స్వాతంత్ర్య సమర యోధుడు, విప్లవ నాయకుడు, రాజకీయ కార్యకర్త. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు అనుబంధ విద్యార్థి సంస్థ స్వారాజ్ సేనకు నాయకుడు.[1]

హేము కలాణి
జననం(1923-03-23)1923 మార్చి 23
సుక్కేర్, సింధు, బ్రిటీష్ ఇండియా (ప్రస్తుతం పాకిస్తాన్)
మరణం21 జనవరి 1943(1943-01-21) (aged 19)
వృత్తివిప్లవ నాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ కార్యకర్త
ఉద్యమంభారత స్వాతంత్ర్యోద్యమము

హేము కలాణి 1923, మార్చి 23న పెసుమాళ్ కాలాణి, జెతిబాయి దంపతులకు సింధు (ప్రస్తుత పాకిస్తాన్) లోని సుక్కురులో జన్మించాడు.[2]

ఉద్యమంలో

మార్చు

చిన్నవయసులోనే విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని తన స్నేహితులతో కలిసి ప్రచారం చేసాడు, స్వదేశీ వస్తువులను ఉపయోగించడంలో దేశ ప్రజలను ఒప్పించాడు. అతను విప్లవ కార్యకలాపాలలో భాగంగా అనేక నిరసన కార్యక్రమాలలో పాల్గొని బ్రిటీష్ వాహనాలపై దాడులు చేశాడు. 1943లో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించినప్పుడు హేము కాలాణి ఆ ఉద్యమంలో చేరాడు.

 
1943 జనవరి 21న హేము కాలాణి అంత్యక్రియలు

ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన హేము కలాణి బ్రిటీష్ వారికి పట్టుబడ్డాడు. తన తోటి ఉద్యమకారుల వివరాలు, సమాచారాన్ని బహిర్గతం చేయడానికి నిరాకరించడంతో, బ్రిటీష్ ప్రభుత్వం హేము కాలాణికి మరణ శిక్ష విధించింది. 1943, జనవరి 21న ఉరితీయబడ్డాడు.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-01-24. Retrieved 2018-08-17.
  2. نادر سولنگي (20 జనవరి 2016). "سنڌ جو ڀڳت سنگهه شهيد هيمون ڪالاڻي". Online indus News. Archived from the original on 29 జనవరి 2016. Retrieved 17 ఆగస్టు 2018.