1761
1761 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1758 1759 1760 - 1761 - 1762 1763 1764 |
దశాబ్దాలు: | 1740లు 1750లు - 1760లు - 1770లు 1780లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- జనవరి 14 – మూడవ పానిపట్టు యుద్ధం : అహ్మద్ షా దుర్రానీ తన సంకీర్ణంతో కలిసి మరాఠా సమాఖ్యను నిర్ణయాత్మకంగా ఓడించి, షా ఆలం IIకు మొఘల్ సామ్రాజ్యాన్ని తిరిగి అప్పగించాడు.
- జనవరి 16 – బ్రిటిష్ వారు పాండిచేరిని ఫ్రెంచి వారి నుండి స్వాధీనం చేసుకున్నారు. [1]
- ఫిబ్రవరి 8 – లండన్‌లో సంభవించిన భూకంపంలో లైమ్‌హౌస్, పోప్లర్‌లో చిమ్నీలు ధ్వంసమయ్యాయి.
- మార్చి 8 – ఉత్తర లండన్, హాంప్‌స్టెడ్, హైగేట్‌లో రెండవ భూకంపం సంభవించింది.
- మార్చి 31 – పోర్చుగల్‌లోని లిస్బన్‌లో భూకంపం సంభవించింది. [2]
- ఏప్రిల్ 4 – లండన్లో ఇన్ఫ్లుఎంజా అంటువ్యాధి చెలరేగి నగరంలోని జనాభా అంతా బాధపడింది; ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అంటుకొనే ఈ వ్యాధి అసాధారణ సంఖ్యలో గర్భస్రావాలు, అకాల జననాలకు కారణమైంది. [3]
- జూన్ 6: సూర్యుడి ముందుగా శుక్రగ్రహ ప్రయాణం (ట్రాన్సిట్) సంభవించింది. భూమి చుట్టూ 120 ప్రదేశాల నుండి గమనించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో టెలిస్కోపుతో చేసిన పరిశీలనలలో మిఖాయిల్ లోమోనోసోవ్, శుక్ర గ్రహం చుట్టూ కాంతి వలయాన్ని గమనించాడు. శుక్ర గ్రహంపై వాతావరణం ఉందని కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్త అతడే. [4]
- నవంబర్ 26 – స్పెయిన్ సైన్యం నుండి 500 మందితో కూడిన దళం మెక్సికో లోని మాయా ప్రజల తిరుగుబాటును అణచివేసి, యుకాటాన్ గ్రామమైన సిస్టీల్‌ను స్వాధీనం చేసుకుంది. 2,500 మంది మాయన్ సైనికులలో 500 మందిని చంపగా, తమవారిలో 40 మందిని కోల్పోయారు. [5]
జననాలు
మార్చు- జనవరి 17 – జేమ్స్ హాల్, స్కాటిష్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త (మ .1832 )
- మే 27: సర్ థామస్ మన్రో
- ఏప్రిల్ 20: వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, గుంటూరు ప్రాంతమును పరిపాలించిన కమ్మ రాజు, అమరావతి సంస్థాన పాలకుడు. (మ.1817)
- డిసెంబర్ 1 – మేరీ టుస్సాడ్, ఫ్రెంచ్ మైనపు మోడలర్ (మ .1850)
మరణాలు
మార్చు- జూన్ 23: బాలాజీ బాజీరావ్ మరాఠా సామ్రాజ్యపు 10 పేష్వా. (జ.1721)
- మే 14 – థామస్ సింప్సన్, ఇంగ్లీష్ గణిత శాస్త్రజ్ఞుడు (జ .1710)
పురస్కారాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Historical Events for Year 1761 | OnThisDay.com". Retrieved 2016-06-30.
- ↑ "Landmarks of World History: A Chronology of Remarkable Natural Phenomena: Eighteenth Century 1761-1770". Retrieved 2016-02-01.
- ↑ "Relation of Influenza to Pregnancy and Labor", by Dr. P. Brooke Bland, in The American Journal of Obstetrics and Diseases of Women and Children (February 1919) pp185-186
- ↑ Govert Schilling, Atlas of Astronomical Discoveries (Springer, 2011) p41
- ↑ Micheal Clodfelter, Warfare and Armed Conflicts: A Statistical Encyclopedia of Casualty and Other Figures, 1492-2015 (McFarland, 2017) p139