బహుజన్ సమాజ్ పార్టీ
బహుజన్ సమాజ్ పార్టీ భారతదేశంలో ఒక జాతీయ పార్టీ. సమాజంలో హెచ్చు సంఖ్యలో ఉన్నవారికి (వెనుకబడిన కులాలు, హరిజనులు, గిరిజనులు, మత పరంగా మైనారిటీ) ప్రాతినిథ్యం ఇవ్వడానికి ఏర్పడ్డ పార్టీ ఇది.[2] ఈ పార్టీని 1984 లో కాన్షీరామ్ స్థాపించాడు. ఆయన ఈ పార్టీ ఏర్పాటు చేసినపుడు భారతదేశంలో సుమారు 6000 కులాల్లో వర్గీకరించబడిన బహుజనులు మొత్తం జనాభాలో 85% ఉన్నారని అంచనా వేశాడు.[3][4] ఈ పార్టీ గౌతమ బుద్ధుడు, బి. ఆర్. అంబేద్కర్, జ్యోతిబా ఫూలే, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, ఛత్రపతి సాహు మహరాజ్ మొదలైన వారి ఆదర్శాలతో ప్రారంభించినట్లు చెప్పారు.[5] కాన్షీరామ్ 2001 లో మాయావతిని తన వారసురాలిగా ప్రకటించాడు. ఈ పార్టీ ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లో కేంద్రీకృతమై ఉంది. 2019 భారత సాధారణ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో 19.3 శాతం ఓట్లు సాధించి రెండో అతి పెద్ద పార్టీగా ఉంది.[6] 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 12.8 శాతం ఓట్లతో మూడో అతిపెద్ద పార్టీగా నిలిచింది.[7] ఈ పార్టీ గుర్తు ఏనుగు. ఇదే గుర్తును అంబేద్కర్ గిరిజన తెగల సమాఖ్య గుర్తుగా వాడేవాడు.[8]
బహుజన్ సమాజ్ పార్టీ | |
---|---|
లోకసభ నాయకుడు | గిరీష్ చంద్ర |
రాజ్యసభ నాయకుడు | రాంజీ గౌతమ్ |
స్థాపకులు | కాన్షీరామ్ |
స్థాపన తేదీ | 14 ఏప్రిల్ 1984 |
Preceded by | దళిత్ శోషిత్ సమాజ్ సంఘర్షణ సమితి |
ప్రధాన కార్యాలయం | 12, గురుద్వారా రకబ్‌గంజ్ రోడ్డు, న్యూఢిల్లీ |
రాజకీయ విధానం | ఆత్మ గౌరవం[1] |
రంగు(లు) | నీలం |
ఈసిఐ హోదా | జాతీయ పార్టీ |
కూటమి | శిరోమణి అకాలీ దళ్ (2021—present) (పంజాబ్) |
లోక్‌సభలో సీట్లు | 10/543 |
రాజ్యసభలో సీట్లు | 1/245 |
Election symbol | |
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Ms. Mayawati said she would devote her life for the self-respect movement". The Hindu.
- ↑ "Bahujan Samaj Party". The Times of India. Retrieved 2019-10-11.
- ↑ Jaffrelot, Christophe (2003). India's Silent Revolution: The Rise of the Lower Castes in North India (in ఇంగ్లీష్). Hurst. ISBN 9781850653981.
- ↑ "The Contradictory Bahujan of the BSP – Countercurrents". Countercurrents (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-04-28. Archived from the original on 28 October 2018. Retrieved 2018-03-09.
- ↑ "The ground flanked by giant-sized cut-outs of BSP's icons -- Babasaheb Ambedkar, Shahuji Maharaj, Jyotiba Phule, Narain Guru, Periyar, and Mayawati herself".
- ↑ "Indian politics has undergone a tremendous change. Uttar Pradesh results the proof". The Economic Times. 2019-05-26. Retrieved 2019-10-07.
- ↑ Bureau, Zee Media (2022-03-10). "UP Election Results: Landslide victory for BJP, SP distant 2nd; Congress, BSP decimated". Zee News. Retrieved 2022-03-11.
- ↑ Mishra, Anant Shekhar (2014-04-20). "A tale of election symbols". The Times of India. Retrieved 2022-03-11.