ఇఎస్‌పిఎన్‌క్రిక్‌ఇన్ఫో

(ESPNcricinfo నుండి దారిమార్పు చెందింది)

ఇఎస్‌పిఎన్‌క్రిక్‌ఇన్ఫో (ESPNcricinfo. గతంలో Cricinfo లేదా CricInfo అనేవారు) [1] అనేది క్రికెట్ ఆట కోసం ప్రత్యేకించిన ఒక క్రీడావార్తల వెబ్‌సైట్. [2] ఈ వెబ్‌సైటులో వార్తలు, కథనాలు, క్రికెట్ మ్యాచ్‌ల లైవ్ కవరేజీ ( లైవ్‌బ్లాగ్‌లు, స్కోర్‌కార్డ్‌లతో సహా) 18వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు జరిగిన చారిత్రిక మ్యాచ్‌లు, ఆటగాళ్ల డేటాబేస్ అయిన StatsGuru ఉంటాయి. 2023 మార్చి నాటికి సంబిత్ బల్ దీనికి సంపాదకుడు.[3]

ఇఎస్‌పిఎన్‌క్రిక్‌ఇన్ఫో
ESPNCricinfo.png
Screenshot
Main page of ESPNcricinfo
ఇఎస్‌పిఎన్‌క్రిక్‌ఇన్ఫో మొదటిపేజీ తెరపట్టు
చిరునామాఅధికారిక వెబ్‌సైటు Edit this at Wikidata
వ్యాపారాత్మకమా?Yes
సైటు రకంక్రీడా వెబ్‌సైటు
సభ్యత్వంఐచ్ఛికం
లభ్యమయ్యే భాషలుఇంగ్లీషు
హిందీ
తమిళం
యజమానిESPN
ప్రస్తుత పరిస్థితినడుస్తోంది

1993లో సైమన్ కింగ్ వరల్డ్ వైడ్ వెబ్ రూపంలో మొదట రూపొందించిన ఈ సైట్‌ను 2002లో విస్డెన్ గ్రూప్‌ కొనుగోలు చేసింది. విజ్డెన్, అనేక ప్రముఖ క్రికెట్ మ్యాగజైన్‌లు, విస్డెన్ క్రికెటర్స్ అల్మానాక్ ల ప్రచురణకర్త. 2007లో విజ్డెన్ గ్రూప్‌ను విడదీసినపుడు, ఇది ది వాల్ట్ డిస్నీ కంపెనీ, హర్స్ట్ కార్పొరేషన్ల సంయుక్తంగా యాజమాన్యంలోని ESPN కొనుగోలు చేసింది.

చరిత్ర

మార్చు

క్రిక్‌ఇన్ఫో 1993 మార్చి 15 న మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో బ్రిటిష్ పరిశోధకుడు సైమన్ కింగ్ ప్రారంభించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు, పరిశోధకుల సహాయంతో ఇది పెరిగింది. కొన్ని నివేదికలలో వచ్చినట్లుగా కాక, క్రిక్‌ఇన్‌ఫో ప్రారంభ వృద్ధిలో చాలా కీలక పాత్ర పోషించిన బద్రి శేషాద్రి, క్రిక్‌ఇన్‌ఫోను స్థాపించిన కొన్ని నెలల వరకు దానిలో పాలుపంచుకోలేదు.[4]

ఎలక్ట్రానిక్ స్కోర్‌కార్డ్‌లను కంపైల్ చేయడానికి, వాటిని క్రిక్‌ఇన్‌ఫో సమగ్ర ఆర్కైవ్‌కి అందించడానికి, అలాగే క్రిక్‌ఇన్‌ఫో లోని స్కోరింగ్ సాఫ్ట్‌వేర్ "డౌగీ"ని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గేమ్‌ల నుండి లైవ్ స్కోర్‌లను అందించడానికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు గంటల తరబడి వెచ్చించి చేసిన సహకారాలపై సైటు ఆధారపడింది. [5] 2000లో, Cricinfo అంచనా విలువ $150 మిలియన్లు; అయితే డాట్‌కామ్ క్రాష్ ఫలితంగా మరుసటి సంవత్సరం అది ఇబ్బందులను ఎదుర్కొంది. [6]

1990లలో క్రిక్‌ఇన్ఫో గణనీయమైన వృద్ధి డాట్‌కామ్ విజృంభణ తారస్థాయిలో ఉన్న సమయంలో పెట్టుబడిదారులకు ఒక ఆకర్షణీయమైన సైట్‌గా మారింది. 2000లో కంపెనీలో 25% వాటాకు బదులుగా $37 మిలియన్ల విలువైన సత్యం ఇన్ఫోవే లిమిటెడ్ షేర్లను అందుకుంది (దాని సుమారు విలువ £100 మిలియన్లు). ఇది ప్రారంభ పెట్టుబడిదారులను చెల్లించడానికి సుమారు $22m విలువైన కాగితాన్ని ఉపయోగించింది. అయితే మిగిలిన స్టాక్‌ను విక్రయించడం ద్వారా సుమారు £6 మిలియన్లను మాత్రమే సేకరించగలిగింది. సైటు మరింత ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడం కొనసాగించింది. చాలా తక్కువ ఆదాయం వలన, అది తొమ్మిది దేశాలలో ఉన్న 130 మంది సిబ్బందికి మద్దతు ఇవ్వడానికి సరిపోలేదు. దాంతో సిబ్బందిని తొలగించవలసి వచ్చింది.

 
1995లో క్రిక్ఇన్ఫో

2002 చివరి నాటికి కంపెనీ నెలవారీ నిర్వహణ లాభాలను ఆర్జించింది. పతనాన్ని నివారించుకున్న చాలా తక్కువ స్వతంత్ర క్రీడా సైట్‌లలో ఇది ఒకటి (Sports.com, స్పోర్టల్ వంటివి కూడా ఇలా నిలబడ్డాయి). అయితే, ఇంకా పెద్ద రుణం ఉండిపోయింది. క్రిక్‌ఇన్‌ఫోను చివరికి విస్డెన్ క్రికెటర్స్ అల్మానాక్, ది విస్డెన్ క్రికెటర్‌ల ప్రచురణకర్త అయిన విస్డెన్ గ్రూప్ కొనుగోలు చేసింది. దాని పేరును విస్డెన్ క్రిక్‌ఇన్‌ఫోగా మార్చారు. చివరికి విజ్డెన్ ఆన్‌లైన్ కార్యకలాపాల కోసం పేరు లోని విజ్డెన్‌ తీసివేసి క్రిక్ఇన్ఫోగా మార్చారు. 2005 డిసెంబరులో విజ్డెన్, విస్డెన్ ఆసియా క్రికెట్ మ్యాగజైన్‌ను క్రిక్‌ఇన్‌ఫో మ్యాగజైన్‌గా తిరిగి ప్రారంభించింది. ఇది భారతీయ క్రికెట్ కవరేజీకి కోసం ప్రచురించేవారు. ఈ పత్రిక 2007 జూలైలో తన చివరి సంచికను ప్రచురించి ఆగిపోయింది.

2006లో, ఆదాయం £3 మిలియన్లు అని తెలియవచ్చింది.[7]

2007లో, విస్డెన్ గ్రూప్ విచ్ఛిన్నమై ఇతర కంపెనీలకు విక్రయించడం ప్రారంభించింది; BSkyB ది విజ్డెన్ క్రికెటర్‌ను కొనుగోలు చేసింది. సోనీ కార్పొరేషన్ హాక్-ఐ బాల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను కొనుగోలు చేసింది.[8] 2007 జూన్‌లో, ESPN Inc. విస్డెన్ గ్రూప్ నుండి Cricinfoని కొనుగోలు చేసినట్లు ప్రకటించింది.[9] ESPN.com, ESPN Soccernet తో సహా ESPN కు చెందిన ఇతర వెబ్ ప్రాపర్టీలతో ఈ సైట్‌ను కలిపి Cricinfoని మరింత విస్తరించడంలో సహాయపడటానికి దీన్ని కొనుగోలు చేసారు. కొనుగోలు నిబంధనలను వెల్లడించలేదు.[10]

2023 నాటికి, సంబిత్ బాల్ ESPNcricinfo కు ఎడిటర్-ఇన్-చీఫ్. [11] 2013లో, ESPNcricinfo.com తన ఇరవయ్యవ వార్షికోత్సవాన్ని వరుస ఆన్‌లైన్ ఫీచర్‌లతో జరుపుకుంది. వెబ్‌సైటు వార్షిక ESPNcricinfo అవార్డులను ప్రదానం చేస్తుంది.

2023 మార్చి 20 న, ESPNcricinfo 30వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.

2000లో క్రిక్ఇన్ఫో, మహిళల ప్రపంచ కప్ టైటిల్ స్పాన్సర్‌గా ఎంపికైంది.[12]

ప్రజాదరణ

మార్చు

ESPNcricinfo ప్రజాదరణ 2010 ఫిబ్రవరి 24 న వెల్లడైంది. భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 200*తో పురుషుల వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును బద్దలు కొట్టిన రోజున ఎదురైన భారీ ట్రాఫిక్‌ను సైటు తట్టుకోలేకపోయింది.[13][14]

విశేషాలు

మార్చు

ESPNcricinfo లో వివిధ వార్తలు, శీర్షికలు, బ్లాగులు, వీడియోలు, ఫాంటసీ స్పోర్ట్స్ గేమ్‌లు ఉన్నాయి. దాని అత్యంత జనాదరణ పొందిన ఫీచర్లలో క్రికెట్ మ్యాచ్‌ల లైవ్‌బ్లాగ్‌లు ఒకటి. ఇందులో అనేక రకాలైన స్కోర్‌కార్డ్‌లు ఉంటాయి. పాఠకులు వ్యాగన్ వీల్స్, భాగస్వామ్యాలు వంటి ఆటలోని అంశాలను ట్రాక్ చేయవచ్చు. ప్రతి మ్యాచ్‌కి, లైవ్ స్కోర్‌లు బులెటిన్‌తో పాటు మ్యాచ్ లోని మలుపులు, కొన్ని ఆఫ్-ఫీల్డ్ ఈవెంట్‌లనూ వివరిస్తుంది. మ్యాచ్ స్కోరింగ్ డేటాను ఉపయోగించుకుని, మ్యాచ్ 3D యానిమేటెడ్ అనుకరణను రూపొందించే అంశం కూడా ఉంది.[15]

ESPNcricinfoలోని రెగ్యులర్ కాలమ్‌లలో "ఆల్ టుడేస్ ఎస్టర్‌డేస్", చారిత్రాత్మక క్రికెట్ ఈవెంట్‌లపై దృష్టి సారించే "ఆన్ దిస్ డే" కాలమ్, క్రికెటర్లు, క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌ల కోట్‌లను కలిగి ఉన్న "కోట్ అన్‌కోట్" ఉన్నాయి. "ఆస్క్ స్టీవెన్" అనేది వారంవారీ కాలం. దీనిలో స్టీవెన్ లించ్ అన్ని విషయాల క్రికెట్‌పై పాఠకుల ప్రశ్నలకు సమాధానమిస్తాడు.[16] ఇంకా, "ది లైట్ రోలర్", "ది బ్రీఫింగ్" లలో క్రికెట్ లోని ఇటీవలి సంఘటనలపై వ్యంగ్య కథనాలు ఉంటాయి.[17][18]

దాని అత్యంత విస్తృతమైన ఫీచర్లలో స్టాట్స్‌గురు డేటాబేస్. దీన్ని ఇది ట్రావిస్ బసేవి రూపొందించాడు. ఆటగాళ్లు, అధికారులు, జట్లు, క్రికెట్ బోర్డుల గురించిన సమాచారం, భవిష్యత్ టోర్నమెంట్‌ల వివరాలు, వ్యక్తిగత, జట్ల రికార్డుల గణాంకాలు ఉంటాయి. 2014 మేలో ESPNcricinfo అభిమానుల క్రికెట్ పరిజ్ఞానాన్ని పరీక్షించే CricIQ అనే ఆన్‌లైన్ పరీక్షను ప్రారంభించింది.[19]

2021 సెప్టెంబరులో ESPNCricinfo, AskCricinfoని ప్రారంభించింది, ఇది క్రికెట్ గణాంకాలను అన్వేషించడంలో సహాయపడే సహజ భాషా శోధన సాధనం.[20]

క్రికెట్ మంత్లీ

మార్చు

క్రికెట్ మంత్లీ ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్‌గా మాత్రమే ప్రచురించే క్రికెట్ మ్యాగజైన్ అని పేర్కొంది.[21] దాని మొదటి సంచిక 2014 ఆగష్టు లో విడుదలైంది.[22]

మూలాలు

మార్చు
  1. "ESPN acquires Cricinfo" (Press release). 11 June 2007.
  2. "ESPNcricinfo / About Us". ESPNcricinfo. Retrieved 25 February 2017.
  3. Sambit Bal.
  4. "11.5 Million, Not Out". business.outlookindia.com. 13 June 2009. Archived from the original on 7 ఏప్రిల్ 2014. Retrieved 2 August 2013.
  5. Vishal Misra (11 June 2013). "One night in 1996– Ball-by-ball text commentary, the core of ESPNcricinfo's offering, was born out of adversity during the sixth World Cup". ESPNcricinfo. Retrieved 11 June 2013.
  6. Weaver, Paul (16 February 2006). "Cricinfo ups tempo on turning clicks into cash". The Guardian. London. Retrieved 11 June 2010.
  7. Weaver, Paul (16 February 2006). "Cricinfo ups tempo on turning clicks into cash". The Guardian. Retrieved 6 October 2021.
  8. "Hawk-Eye ball-tracking firm bought by Sony". BBC News. 7 March 2011. Retrieved 7 March 2011.
  9. "ESPN acquires Cricinfo.com". Business-standard.com. 12 June 2007. Retrieved 1 September 2012.
  10. "ESPN acquires Cricinfo". Cricinfo. 11 June 2007. Retrieved 6 October 2021.
  11. "Sambit Bal | Author Index | ESPNcricinfo". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 15 March 2018.
  12. Raf Nicholson (11 July 2013). "Cricinfo's own World Cup". Cricinfo. Retrieved 19 January 2022.
  13. Bal, Sambit (2013-02-25). "Tendulkar breaks Cricinfo records". 'From the Editor' blog. ESPNcricinfo. Retrieved 13 March 2023.
  14. Hoult, Nick (24 February 2010). "Sachin Tendulkar's 200 breaks ODI world record as India crush South Africa". The Daily Telegraph. London. Archived from the original on 11 January 2022.
  15. "Live 3D Cricket at Cricinfo.com". The Next Web. Archived from the original on 30 August 2011. Retrieved 22 January 2012.
  16. Steven Lynch. "Ask Steven".
  17. "The Briefing". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2024-01-01.
  18. "The Light Roller". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2024-01-01.
  19. "ESPNcricinfo launched CricIQ". The Hindu. 5 May 2014.
  20. "ESPNcricinfo launches natural language search tool AskCricinfo service - Exchange4media". Indian Advertising Media & Marketing News – exchange4media (in ఇంగ్లీష్). Retrieved 2021-09-21.
  21. "About us". The Cricket Monthly. ESPNcricinfo. Retrieved 6 May 2016.
  22. "Issues index". The Cricket Monthly. ESPNcricinfo. Retrieved 6 May 2016.