ఆంటిమొని, 00Sb
ఆంటిమొని
Pronunciation
Appearancesilvery lustrous gray
Standard atomic weight Ar°(Sb)
ఆంటిమొని in the periodic table
Hydrogen Helium
Lithium Beryllium Boron Carbon Nitrogen Oxygen Fluorine Neon
Sodium Magnesium Aluminium Silicon Phosphorus Sulfur Chlorine Argon
Potassium Calcium Scandium Titanium Vanadium Chromium Manganese Iron Cobalt Nickel Copper Zinc Gallium Germanium Arsenic Selenium Bromine Krypton
Rubidium Strontium Yttrium Zirconium Niobium Molybdenum Technetium Ruthenium Rhodium Palladium Silver Cadmium Indium Tin Antimony Tellurium Iodine Xenon
Caesium Barium Lanthanum Cerium Praseodymium Neodymium Promethium Samarium Europium Gadolinium Terbium Dysprosium Holmium Erbium Thulium Ytterbium Lutetium Hafnium Tantalum Tungsten Rhenium Osmium Iridium Platinum Gold Mercury (element) Thallium Lead Bismuth Polonium Astatine Radon
Francium Radium Actinium Thorium Protactinium Uranium Neptunium Plutonium Americium Curium Berkelium Californium Einsteinium Fermium Mendelevium Nobelium Lawrencium Rutherfordium Dubnium Seaborgium Bohrium Hassium Meitnerium Darmstadtium Roentgenium Copernicium Ununtrium Flerovium Ununpentium Livermorium Ununseptium Ununoctium
As

Sb

Bi
తగరంఆంటిమొనిటెలురియం
Groupమూస:Infobox element/symbol-to-group/format
Periodperiod 5
Block  p-block
Electron configuration[Kr] 4d10 5s2 5p3
Electrons per shell2, 8, 18, 18, 5
Physical properties
Phase at STPsolid
Melting point903.78 K ​(630.63 °C, ​1167.13 °F)
Boiling point1908 K ​(1635 °C, ​2975 °F)
Density (near r.t.)6.697 g/cm3
when liquid (at m.p.)6.53 g/cm3
Heat of fusion19.79 kJ/mol
Heat of vaporization193.43 kJ/mol
Molar heat capacity25.23 J/(mol·K)
Vapor pressure
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 807 876 1011 1219 1491 1858
Atomic properties
Oxidation states−3, −2, −1, 0,[3] +1, +2, +3, +4, +5 (an amphoteric oxide)
ElectronegativityPauling scale: 2.05
Ionization energies
  • 1st: 834 kJ/mol
  • 2nd: 1594.9 kJ/mol
  • 3rd: 2440 kJ/mol
  • (more)
Atomic radiusempirical: 140 pm
Covalent radius139±5 pm
Van der Waals radius206 pm
Color lines in a spectral range
Spectral lines of ఆంటిమొని
Other properties
Natural occurrenceprimordial
Crystal structuretrigonal
Simple trigonal crystal structure for ఆంటిమొని
Speed of sound thin rod3420 m/s (at 20 °C)
Thermal expansion11 µm/(m⋅K) (at 25 °C)
Thermal conductivity24.4 W/(m⋅K)
Electrical resistivity417 nΩ⋅m (at 20 °C)
Magnetic orderingdiamagnetic[4]
Young's modulus55 GPa
Shear modulus20 GPa
Bulk modulus42 GPa
Mohs hardness3.0
Brinell hardness294 MPa
CAS Number7440-36-0
History
Discovery3000 BC
First isolationVannoccio Biringuccio (1540)
Symbol"Sb": from Latin stibium 'stibnite'
Isotopes of ఆంటిమొని
Template:infobox ఆంటిమొని isotopes does not exist
 Category: ఆంటిమొని
| references
A vial containing the black allotrope of antimony
Native antimony with oxidation products
Stibnite
The Italian metallurgist Vannoccio Biringuccio described the first procedure of how to isolate antimony.

మూలక ప్రాథమిక సమాచారం

మార్చు

ఆంటిమొని, లేదా ఆన్టిమోని, అనేది తెలుగులో కాటుకఱాయి[5], లేదా కాటుకకల్లు[5], అని పిలువబడే ఒక రసాయనిక మూలకము.మూలకాల ఆవర్తన పట్టికలో 15 వ సమూహం, p బ్లాక్, 5వ పిరియాడుకు చెందినది.మూలకం యొక్క పరమాణు సంఖ్య 51.మూలకం యొక్క సంకేత అక్షరము Sb.పురాతన కాలంనుండి సౌందర్య సామగ్రి/ వస్తువులలో ఆంటిమొని సమ్మేళనాలను వాడే వారు. అయితే దీనిని వారు సీసము (మూలకము)గా భావించారు.మొదటిగా 1540 లో వాన్సియో బ్రిం గుస్సియో (Vannoccio Biringuccio) ఖనిజంనుండి మూలకాన్ని వేరుచేసాడు.

చరిత్ర

మార్చు

క్రీ.పూ .3100 సంవత్సరాలనాటికే, సౌందర్యసామగ్రి ల (cosmetic pallete) ను కనిపెట్టినప్పుడు అంటి మొని (III) సల్ఫైడ్ (Sb2S3) ని కళ్ళ యొక్క సౌందర్య సామగ్రిగా (కాలుక, మస్కరా, khol) ఈజిప్టులో వాడేవారు.[6] టేల్లో, చాల్ది (ప్రస్తుతం ఇరాక్) లో క్రీ.పూ. 3000 నాటి, ఆంటిమొనితో కళాత్మకంగా కళాకృతులు చిత్రికరించిన కలశము (vase ) ను గుర్తించారు.అలాగే క్రీ.పూ .2500 -2200 మధ్యకాలంనాటి ఆంటిమొని పూత/మలాము కలిగిన రాగి వస్తువును గుర్తించారు.క్రీ.పూ.16వ శతాబ్ది నాటి పురాతన లిఖితపత్రాలలో ఆంటిమొని సల్ఫైడ్ గురించి వ్రాసారు.నల్లని వర్ణంకలిగిన ఈపదార్థం సహజంగా లభించే అంటిమొని ఖనిజమైన స్తీబ్‌నైట్ (stibnite) ను కళ్ళకు మస్కరాగా ఉపయోగించెవారు.ప్రముఖంగామరులుకత్తే జెఝెబెల్ (Jezebel) వాడినట్లు బైబిలులో పేర్కొన్న బడినది[7]

మొదటిగా 1540 లో వాన్సియో బ్రిం గుస్సియో (Vannoccio Biringuccio) ఖనిజంనుండి మూలకాన్ని వేరుచేసాడు. 1932 సంవత్సరాల కాలంలో చైనా లోని Guizhou ప్రాదేశిక పాలన ప్రాంతంలో (province) ఆంటిమొనితో చేసిన నాణేలను చలామణి చేసారు.అయితే నాణేలు త్వరగా అరిగి పోతుండటం వలన, వీటి ముద్రణను నిలిపివేశారు.

పద ఉత్పత్తి

మార్చు

అంటిమోని అనేపదం రెండు గ్రీకు పదాలు అంటీ (anti) మొనొస్ (monos) కలయిక వలన ఏర్పడినది, అనగా ఒంటరికాదు అనిఅర్థం.[6] ఇది ప్రకృతిలో ఒంటరిగా, విడిగా కాకుండగా ఇతర లోహాలతో కలిసి ఖనిజాలలో లభించటం వలన ఒంటరికాదు అని పేరు పెట్టుటకు కారణం అయ్యినది.

మూలక ధర్మాలు-లక్షణాలు

మార్చు

ఆంటిమొనినత్రజని సముదాయం నకు (15 సముదాయం) చెందిన లోహం. ఈ మూలకం యొక్క ఋణవిద్యుతత్వం 2.05. తగరం, బిస్మత్ కన్న ఎక్కువ ఋణవిద్యుతత్వ గుణం కలిగియున్నది. అయితే టెలూరియం, ఆర్సినిక్ లోహాలకన్న తక్కువ ఋణవిద్యుత్వతను (electro negativity) కలిగియున్నది. గది ఉష్ణోగ్రత వద్ద మూలకం స్థిరంగా ఉండి ఆక్సిజన్తో చర్యా రహితం.కాని వేడిచేసి, ఉష్ణోగ్రతను పెంచిన, ఆక్సిజనుతో చర్య చెంది ఆంటిమొనిట్రై ఆక్సైడ్ ఏర్పడుతుంది Sb2O3.

ఆంటిమొని వెండి వంటిబూడిద వర్ణంతో మెరిసే లోహం. ఈ లోహం యొక్క గట్టితనం మొహోస్ స్కేల్ (mohs scale ) ప్రకారం 3. శుద్ధమైన ఈ మృదువైన లోహంతో గట్టి వస్తువులను తయారు చేయవచ్చును .ఆమ్లాల రసాయనిక ప్రభావాన్ని ఆంటిమొని తట్టుకొని నిలువరించ గలదు.

ఆంటిమొనినాలుగు అల్లోట్రోపు (allotropes) లలో ఒకటి స్థిర మెటాలిక్ రకం కాగా, మిగిలిన మూడు మెటా స్టేబుల్ రకాలు (ఎక్సుప్లోసివ్, బ్లాక్, ఎల్లో) మెటాలిక్ ఆంటిమొని పెళుసుగా ఉండి, వెండిలా తెల్లగా మెరిసే లోహం.

మూలకం యొక్క పరమాణు భారం:121.760, ద్రవీభవన స్థానం:630.63 °C ( 903.78 Kలేదా 1167.13 °F, మరుగు స్థానము:1587 °C ( 1860 K లేదా 2889 °F, సాంద్రత 6.685గ్రాంలులు/సెం.మీ3.[8]

ఐసోటోపులు

మార్చు

ఆంటిమొని రెండు ప్రకృతి సిద్ధమైన స్థిర ఐసోటోపులులను కలిగి యున్నది. స్వాభావికంగా లభించు లోహంలో 121Sb ఐసోటోపులు వాటా 57.36%, 123Sb ఐసోటోపులు వాటా42.64%. ఆంటిమొని మూలకం 35 రేడియో ఐసోటోపులులను కలిగి యున్నది. ఇందులో 125Sb ఐసోటెపుయొక్క అర్ధ జీవిత కాలం 2.75 సంవత్సరాలు. అదనంగా 29 మెటాస్టేబుల్ స్థితులను క్రమబద్దికరించా రు.స్థిరలోహ (meta stable) ఐసోటోపులులలో ఎక్కువ స్థిరమైన 120m1Sb అర్ధజీవితకాలం 5.76 రోజులు.123Sb ఐసోటోపులు కన్న తేలికగా ఉన్న ఐసోటోపులుల క్షయికరణ β+ క్షీణత వలనను, బరువైన ఐసోటోపులుల క్షయికరణ β− క్షీణత జరుగును.

అస్థిరమైన ఐసోటోపులుల పట్టిక [9]

ఐసోటోపులు జీవిత కాలవ్యవధి ఐసోటోప్లు జీవిత కాలవ్యవధి
Sb-117 2.8గంటలు Sb-124 60.2రోజులు
Sb-119 38.1గంటలు Sb-125 2.75 సంవత్సరాలు
Sb-120 15.89 నిమిషాలు Sb-126 12.4రోజులు
Sb-121 స్థిరం Sb-126m 19.0 నిమిషాలు
Sb-122 2.7రోజులు Sb-127 3.84 రోజులు
Sb-123 స్థిరం Sb-129 4.4 గంటలు

సమ్మేళనాలు/సంయోగ పదార్థాలు

మార్చు

ఆంటిమొనిసమ్మేళన పదార్థాలను వాటి యొక్క ఆక్సీకరణ స్థాయిని బట్టి Sb (III, Sb (V) అంటూ వర్గికరించారు. ఇందులో +5 ఆక్సీకరణ స్థాయి మిక్కిలి స్థిరమైనది.

ఆక్సైడులు –హైడ్రో క్సైడులు

మార్చు
ఆంటిమొనిట్రై ఆక్సైడ్ (Sb4O6)
ఈ సమ్మేళనం ఆంటిమొనిని గాలిలో మండించడం వలన ఏర్పడును. వాయు స్థితిలో ఈ సమ్మేళనం Sb4O6 రూపంలో ఉండును.అయితే చల్లార్చినప్పుడు గుణితాంగరూపకత (polymerizes) చెందును.
ఆంటిమొనిపెంటాక్సైడ్
ఆంటిమొనిపెంటాక్సైడ్ అనునది గాఢ నత్రికామ్లంతో ఆక్సీకరణ వలన ఏర్పడును. ఆంటిమొని మిశ్రమ వేలన్సీ ఆక్సైడు ఆంటిమొని టేట్రోక్సైడ్ (Sb2O4,ను Sb (III), Sb (V) లుగా కూడా కలిగి ఉండును.

లభ్యత

మార్చు

భూపటలం లోని నేలలో 0.2 -0.5 ppm (వంతులు పది లక్షలకు) .ఇది అరుదుగా లభ్యమగు మూలకం అయినప్పటికీ, దాదాపు 100 రకాల ముడి ఖనిజాలలో ఇది లభిస్తుంది.ముడి ఖనిజం ఎక్కువగా సల్ఫైడ్ (stibnite ) గా లభిస్తుంది.సముద్ర జలాల్లో లభ్యం:2.4×10-4 మి.గ్రాములు/లీటరుకు[8]

ఖనిజ ఉత్పత్తి

మార్చు

కొంతకాలంగా చైనా పెద్ద ప్రమాణంలోఆంటిమొని, దాని సంయోగ పదార్థాలను ఉత్పత్తి చేస్తోంది. ఇదంతయు హునాన్ లోని Xikuangshan గని నుండి ఖనిజత్రవ్వకాలు జరుపుతున్నారు.ముడి ఖనిజాన్నిమొదట వేయించి ( roast) తరువాత కార్బో థెర్మల్ క్షయికరణ ద్వారా ఆంటిమొనిని ఉత్పత్తి చేయుదురు.లేదా నేరుగా స్టిబ్ నైట్ ను ఇనుముతో కలిపి క్షయికరిచడ ద్వారా కుడా ఉత్పత్తి చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 50, 000 టన్నులు ఉత్పత్తి చెయ్యబడుచున్నది.అధికంగా ఉత్పత్తి చెయ్యు దేశాలు చైనా, రష్యా, బిలివియా,, దక్షిణ ఆఫ్రికాలు.ప్రపంచ వ్యాపంగా 5మిలియను టన్నుల వనరులు ఉన్నట్లు అంచనా.ఫిన్‌లాండులో ఆదిమూలమైనాఅంటీమొని మూలక నిక్షేపనిల్వలు ఉన్నాయి.[10]

లోహ ఉత్పత్తి

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Standard Atomic Weights: Antimony". CIAAW. 1993.
  2. Prohaska, Thomas; Irrgeher, Johanna; Benefield, Jacqueline; et al. (2022-05-04). "Standard atomic weights of the elements 2021 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry (in ఇంగ్లీష్). doi:10.1515/pac-2019-0603. ISSN 1365-3075.
  3. Anastas Sidiropoulos (2019). "Studies of N-heterocyclic Carbene (NHC) Complexes of the Main Group Elements" (PDF). p. 39. doi:10.4225/03/5B0F4BDF98F60. S2CID 132399530.
  4. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Handbook of Chemistry and Physics 81st edition, CRC press.
  5. 5.0 5.1 "నిఘంటుశోధన - తెలుగు నిఘంటువు Online Telugu Dictionary - Andhrabharati nighaMTu SOdhana - ఆంధ్రభారతి నిఘంటు శోధన Telugu Dictionary Online Telugu Dictionary telugu nighantuvu Telugu Online Dictionaries telugunighantuvu తెలుగునిఘంటువు telugunighantuvulu తెలుగునిఘంటువులు శబ్దరత్నాకరము శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటువు బ్రౌన్ నిఘంటువు ఆంధ్ర వాచస్పత్యము వావిళ్ల నిఘంటువు వావిళ్ళ నిఘంటువు తెలుగు వ్యుత్పత్తి కోశము తెలుగు వ్యుత్పత్తి కోశం శబ్దార్థ చంద్రిక ఆంధ్ర దీపిక శ్రీ సూర్యరాయ నిఘంటువు Telugu Nighantuvu Nigantuvu Bahujanapalli Sitaramacharyulu Sabdaratnakaram Sabdaratnakaramu Shabdaratnakaram Shabdaratnakaramu Sabda ratnakaramu Shabda ratnakaramu Charles Philip Brown Telugu-English Dictionary, English-Telugu Dictionary Adhunika vyavaharakosamu Shabdaratnakaramu, Urdu Telugu Dictionary". andhrabharati.com. Retrieved 2024-02-05.
  6. 6.0 6.1 "Antimony Element Facts". chemicool.com. Retrieved 2015-04-06.
  7. "Antimony-History". rsc.org. Retrieved 2015-04-06.
  8. 8.0 8.1 "The Element Antimony". education.jlab.org. Retrieved 2015-04-06.
  9. "Periodic Table:Antimony". chemicalelements.com. Retrieved 2015-04-06.
  10. "Chemical properties of antimony". lenntech.com. Retrieved 2015-04-06.
"https://te.wiki.x.io/w/index.php?title=ఆంటిమొని&oldid=4103831" నుండి వెలికితీశారు